Wednesday, February 24, 2010

* నిద్ర ఎలా వస్తుంది

నిద్ర ఎలా వస్తుంది ఎలా కలుగుతుంది ఏ విదంగా ఉంటుంది ఎందుకు -
పగలంతా ఆలోచిస్తూ ఎన్నో పనులు చేస్తూ మేధస్సున ఎన్నో సమకూర్చుకుంటూ అలసిపోతూ ఉంటాం -
మన మేధస్సు శరీరం ఎన్నో విధాలా అలసిపోవుటచే మనలో ఉత్తేజము శక్తి సామర్థ్యాలు తగ్గుతూ వస్తాయి -
ఆహారం తీసుకుంటున్నా శరీరంలో జరిగే ఎన్నో రకాల పనుల వలన మనకు కొంత మానసిక విశ్రాంతి అవసరం -
మనం కొన్ని గంటలు నిద్రపోతే మరల కొంత శక్తిని పొంది మేధస్సు ఉత్తేజముగా శక్తివంతంగా మరికొన్ని పనులను చేయుటకు వీలు కల్గిస్తుంది -
మనం నిద్రించకపోతే శరీరమున శక్తి తగ్గి మేధస్సు సరిగా పని చేయక అనారోగ్యముగా జీవించవలసి వస్తుంది -
ఇంకా ఎన్నో విధాల శక్తి సామర్థ్యాలకై మనం ప్రతి రోజు ఎనిమిది గంటలైనా నిద్ర పోవలసి వస్తుంది -
నేడు వృత్తి రిత్యా కొందరు రాత్రి సమయంలో పని చేస్తూ పగటి సమయాన నిద్రిస్తుంటారు -
మనం నిద్రించేటప్పుడు కళ్ళు మూసిన వెంటనే కొంత సమయానికి మరోధ్యాసలో వెళ్ళిపోతాం -
ఎప్పుడైతే మరోధ్యాసలో వెల్లిపోతామో ఆ సమయాన నిద్ర కలుగుతుంది -
నిద్రలో శరీరమున ఎన్నో రకాల సూక్ష్మ పనులతో వివిధ అవయవాలు పనిచేస్తూ కొత్త శక్తిని పొందుతాయి -
నిద్రలోనే మనం కలలుగంటూ ఎన్నిటినో ఆలోచిస్తూ ఎన్నిటినో తెలుసుకుంటూ ఉంటాం -
నిద్రలోనే మనకు ఎన్నో రోగాలు నయమౌతాయి అలాగే సరిగా నిద్రించకపోతే ఎన్నో రోగాలు వస్తాయి -
సరైనా సమయాన సరిపోయే సమయాన్ని నిద్రకు కేటాయించి మన ఆరోగ్యాన్ని పొందగలగాలి -
మరోధ్యాస ఎలా కలుగుతుందంటే మన ఆత్మ ఎరుకయే మనం నిద్రించే సమయానికి మన రోజు వారి కార్యాలను ఆపి తెలిసి తెలియకుండానే నిద్రలో జార విడుచుతుంది -
ఆత్మ ఎరుక ద్వారా నిద్రలో వెళ్ళినప్పుడు ద్వితియ ఎరుక మొదలవుతుంది -
ద్వితియ ఎరుక నిద్రలో ఆలోచిస్తూ మనలో దాగిన ఎన్నో విషయాలను తిరగేస్తూ కలలుగా వివిధ రకాలుగా పనిచేస్తుంది -
మనం ప్రతి రోజు మెలకువతో ఆలోచించేది ప్రథమ ఎరుకతోనే అలాగే నిద్రలో వెళ్ళినపుడు ద్వితియ ఎరుక పనిచేస్తుంది -
ద్వితియ ఎరుక పనిచేస్తున్నప్పుడు ప్రథమ ఎరుక మరో ధ్యాసలో వెళ్లి పోతుంది అప్పుడు ప్రథమ ఎరుకకు ధ్యాస ఉండదు -
ప్రథమ ఎరుకపై ఏకాగ్రత ఉంటేనే కొంత మెలకువగా ఉండి కొన్ని విషయాలు తెలుస్తాయి అలాగే నిద్రలో కొన్ని కళలను గుర్తు పెట్టుకోగలం -
మనం ఎప్పుడైతే నిద్ర పోవాలనుకుంటామో ఆ సమయాన ఒక ఆలోచన ప్రథమ ఎరుక నుండి ద్వితియ ఎరుకకు మరియు ఆత్మ ఎరుకకు వెళ్ళుతుంది -
ఆలోచనను ఆత్మ ఎరుకను గ్రహించిన తర్వాత కళ్ళు మూయగానే మరో ధ్యాసతో నిద్రపోగలుగుతాం అలాగే ద్వితియ ఎరుక మొదలవుతూ పనిచేస్తుంది -
నిద్రలో ద్వితియ ఎరుక పని చేస్తున్నప్పుడు ఆత్మ ఎరుక శరీర శక్తిని పెంచగలుగుతుంది రోగాలను నయం చేస్తుంది -
మరోధ్యాస అంటే ప్రథమ ఎరుక మెళకువను మరలించి ద్వితియ ఎరుకను మెళకువగా పని చేయించడం (ఆత్మ ఎరుకయే మరలిస్తుంది) -
ఈ విధంగా మనం నిద్ర పోగలం అలాగే మరోధ్యాసలో శరీర శక్తిని పెంచి రోగాలను నయం చేసుకుంటాం కలలుగంటాం మేధస్సుకు ఉత్తేజాన్ని కలిగిస్తాం -
మనకు మెళకువ రావడానికి కూడా ఒక ఆలోచన ఆత్మ ఎరుక నుండి లేదా ద్వితియ ఎరుక నుండి ప్రథమ ఎరుకకు కలగవలసిందే -
మెళకువ వచ్చిన తర్వాత మరల లేవడానికి కూడా ఒక ఆలోచన మనకు తోచినట్లుగా కలగవలసిందే లేదంటే మెళకువగా ఉన్నా అలాగే మరల నిద్రపోతున్నట్లు -
దేనికైనా ఆలోచన కలగాలి లేదంటే ఆ పనిని చేయలేం కనుకనే మేధస్సు ఉత్తేజమునకై సరైన నిద్ర అవసరం ప్రతి జీవికి -
కొన్ని సందర్భాలలో లేదా కొన్ని క్షణాలలో ఆలోచనలలో మరో ధ్యాసగా తెలిసి తెలియనట్టుగా గ్రహచారముగా ప్రమాదాలు జరుగుతూ ప్రాణాలకే మతి కలిగి మరణానికి దారి తీస్తాయి : జాగ్రత్త సుమా!(పగలైనా రాత్రైనా : నడిచేటప్పుడైనా ప్రయాణముననైనా మెట్లు ఎక్కి దిగే టప్పుడైనా కాల కృత్యముల సమయమునైనా) ముందు చూస్తూ దూర ద్రుష్టి తో వెళ్ళండి యే సమయమునైనా ఎక్కడైనా ఎరుకతో ఆత్మ జ్ఞానంతో -

No comments:

Post a Comment