Saturday, February 20, 2010

* "కల" ల లోకం ఎక్కడ?

నిద్రలో చూడగలుగుతున్న వాటిని ఆధారంగా చేసుకొని మనకు తెలియకుండా మన ప్రమేయమ లేకుండా వస్తున్నాయి కనుక వీటిని కల గా భావిస్తాం -
కల లు వివిధ రకాలుగా కనబడేవి వినబడేవి కనపడినా వినపడనట్లుగా వినపడినా కనబడనట్లుగా చిత్రములుగా ఎన్నో విధాలుగా భయంకరంగా కూడా కలుగుతాయి -
నేడు మనం చూస్తున్న సాంకేతిక యంత్రముల వలె మనకు కలలు వస్తుంటాయి అందులో కొన్ని గుర్తుంటాయి కొన్నింటిని మరచిపోతాం మరికొన్ని తెలిసినట్టే జరుగుతున్నట్టే ఉంటాయి -
కల ల లోకం మన కంటి రెప్ప వెనుకనే ఉంది ఎందుకనగా మనం కళ్ళు మూసినప్పుడే మన కంటి రెప్ప కంటికి ఎదురుగా లోపలి భాగాన ఉంటుంది కంటిరెప్ప ఒక తెర లా చిత్రాలకై -
కళ్ళు మూసినప్పుడు మనం చూసేది చీకటిని : చీకటిలేకపోతే మనకు నిద్ర రావడం కష్టం : చీకటితోనే మనం కల ల లోకానికి వెళ్ళినట్టే : చీకటిని ఎక్కువ సేపు చూస్తే తెర మొదలవుతుంది -


కల ల లోకం ఎందుకు కంటి రెప్ప వెనుక ఉందంటే రెప్ప తెరవగా కల మాయమగునే వెంటనే నిద్ర ఆగిపోవునే కనుక రెప్ప వెనుకనే కల ల లోకం -
మన మేధస్సున ముఖ్యంగా మూడు రకాల ఎరుకలు ఉన్నాయి ప్రథమ ద్వితీయ ఆరవ : మనం ఆలోచించే తీరును ప్రథమ ఎరుక పనిచేస్తుంది : నిద్రించేటప్పుడు ద్వితీయ ఎరుక పనిచేస్తుంది -
నిద్రించే సమయంలో ప్రథమ ఎరుక నిదానముగా/తక్కువగా ఆలోచించడంవల్ల విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా దాని స్థితి మారుతూ ద్వితీయ ఎరుక ఆలోచించడం మొదలుపెడుతుంది -
ద్వితీయ ఎరుక మనం పగలు ఆలోచించిన వాటిని తిరగేసి మనం ఏవైతే మరల చేయాలనుకున్న పనులను గుర్తు చేసేలా చేస్తుంది అలాగే ప్రథమ ఎరుకకు ఉత్తేజాన్ని కల్పిస్తుంది -

మనకు తెలియని వాటిని కూడా ఆలోచిస్తూ అలాగే గతంలో ఆలోచించిన వాటిని మన మేధస్సున దాగిన సమాచారాన్ని వివిధరకాలుగా ఆలోచిస్తూ మనకు కలగా ఏదో తెలపటానికి ప్రయత్నిస్తుంది -
గత జన్మలకు సంభందించిన వాటిని కూడా ఆలోచిస్తూ మన ఊహకు అందని వాటిని కూడా ఎన్నిటినో ఆలోచిస్తూ వివిధరకాలుగా ద్వితీయ ఎరుక నిద్రలో పని చేస్తూనే ఉంటుంది -
మనయొక్క తత్వంను బట్టి మనఆలోచనల తీరును బట్టి మనయొక్క పనితీరును బట్టి మన ఉద్దేశ్యాలకు తగినట్లుగా ఆలోచిస్తూనే మనల్ని నిద్రింపజేస్తుంది -
మనం నిర్ణయించుకున్నవి సాధించవలసినవి వృత్తి రిత్యా చేయవలసిన పనులను కూడా వివిధ రకాలుగా ద్వితీయ ఎరుకకు అర్థమైన భాషలో తెలుపుతుంటుంది -
కొందరు నిద్రావస్థలో లేచి నడుస్తూ ఉంటారు ఆ సమయాన ద్వితీయ ఎరుక పనిచేస్తూనే ఉంటుంది ప్రథమ ఎరుకకు మెలకువ రాక ఒక ఆలోచన ద్వారా మనల్ని నిద్ర నుంచి లేపేస్తుంది -
మనం లేచిన వెంటనే ద్వితీయ ఎరుకను ఆపితేగాని ప్రథమ ఎరుక యొక్క ఆలోచనలను గమనించలేము ఉత్తేజముగా ఏ పనిని మొదలుపెట్టలేము ఇది మన ఆలోచనల తీరుపైననే ఆధారపడి ఉంటుంది -

కొందరు నిద్రలో అరుస్తూ లేదా తమలో తామే మాట్లాడుతూ లేదా తిడుతూ ఉంటారు కొందరైతే పల్లు కొరుకుతుంటారు -
ఇదంతా ఆ రోజు గడిచిన విధానంలో ఒత్తుగా పలికిన పదాలుగా, పదే పదే పలికిన పదాలుగా, చాలా సార్లు వాడిన పదాలుగా, ఆవేశంగా మాట్లాడిన పదాలుగా వివిధ రకాలుగా -
వీటినన్నింటిని ద్వితీయ ఎరుకయే చేస్తుంది ఇవన్నీ మనలో దాగిన స్వభావాలే : మనకు తెలియని స్వభావాలు మనలోనే ఎన్నెన్నో : కొన్ని మనకు తెలియకుండా వివిధ పనుల స్థితిని బట్టి వస్తుంటాయి -
ఒక రోజు నిద్రలో ఎన్నో రకాల కలలు ఎన్నో విధాల వస్తుంటాయి కొన్ని గుర్తుంటాయి కొన్ని వచ్చినట్టే ఉండవు కొన్ని మరచి పోయినట్టే ఉంటాయి ఇలా కొన్ని క్షణాలలో నిమిషాలలో గంటలలో లెక్కలేనన్ని -
కలలు ఎందుకు ఎలా ఆగిపోతాయి (ద్వితియ ఎరుక స్వభావం) :-
మనం ఒక ఆసనంలో ఎక్కువ సమయం నిద్రించడం వల్ల నొప్పి కలిగి కదలడం వలన ఆగిపోతాయి -
భయంకరమైన కలలు రావడం వలన మనం వాటిని చూడలేకపోతే ఆగిపోవడం -
మనకు దాహమైనా ఆకలి వేసినా లేదా కాల కృత్యములకై లేచిన లేదా ఏదైనా గుర్తుకు రావడం వలన -
ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడం వలన లేదా మన ప్రదేశాన ఏదైనా శబ్దం వినిపించడం వలన లేదా ఎవరైనా పిలవడమో లేపడమో -
నిద్రా సమయం పూర్తి కావడం వలన మనం లేచి పోవుటలో మెలకువ రావటం వలన -
మనం ఆలోచించే విధానానికి సరైనా ఆలోచనలు రాకపోయినా కలలకు సరైన సమాచారం అందక ఆగిపోతాయి (కలలు త్వరగా వస్తుంటాయి కనుక ఆలోచనల వేగం ఎక్కువగా ఉండాలి ) -
-----
కలలు ఆటగా పాటగా ఆటపాటగా నటనగా చిత్రంగా చిత్రాలుగా మాటగా వివిధ రకాలుగా ఎలాగైనా ఉంటాయి వస్తాయి -
మనం ఊహించి చూసే చిత్రము కూడా ద్వితియ ఎరుక స్వభావముగా నిద్రలోనైనా పగలైనా (మనకు కొన్ని అర్థం కావడానికి ఊహించి చూసుకుంటాం నేర్చుకునేటప్పుడు : కంటిరెప్ప వెనుక తెర లోనే) -
ఆరవ ఎరుక ముందుచూపు లేదా దూరదృష్టి ని తెలిపే స్వభావంతో ఉంటుంది ఒక్కోసారి తొందరగా ఏదైనా గుర్తు పట్టేస్తుంది లేదా తెలుపుతుంది గ్రహిస్తుంది -

మేధస్సున ఆత్రేయ(చురుకుదనం) వివేకము వలన ఆరవ ఎరుక స్వభావాన్ని కలిగిఉంటుంది -

1 comment:

  1. Welcome to Blogger "gsystime" to read my intent of information. // Spread Universal //

    ReplyDelete