Sunday, February 7, 2010

* ప్రకృతిగా పంచభూతములు ఎలా

ప్రకృతిగా పంచభూతములు ఎలా వచ్చెను -
ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ముందుగా "క్షణం - అంతా తెలిసిపోయేనా" చదివిఉంటె అర్థమవుతుంది -
మర్మము : శూన్యము : మొదటి క్షణముతో భావము : భావమున కలుగు స్వభావములే ఆలోచనలుగా కాలంతో సాగుతూ -
ఆలోచనలలోనే గుణాలు లక్షణాలు విశేషణములు విచక్షణ రూప భావ స్వభావములు ఎన్నో ఎన్నెన్నో అనంతముగా -
ఆలోచన(భావన) స్వభావాలను మార్పులుగా వివిధ రకాలుగా సూక్ష్మముగా అర్థం చేసుకొనుటలో కలిగినదే "ఎరుక" -
"ఎరుక" అంటే అన్ని తెలిసి ఉండడం "మరుపు లేనిది" స్వభావ అర్థాన్ని కలిగి ఉండడం గుర్తించడం (ఆలోచనైనా భావమైనా అణువైనా) ఎప్పటికైనా ఏ క్షణమైనా -
ఎరుక ఏదైనా సృష్టించడానికి ఒక శక్తి కావాలి దానిని తట్టుకోవడానికి ఒక ఆత్మ ఉండాలి లేదంటే ఏది జరగదు నిలబడదు సృస్టించబడదు -
ఎరుక శక్తి కోసం తనకు తానుగా(దానికదే) మరణించి మరల అదే క్షణాన ఉదయించి మహా శక్తిని పరమాత్మ తత్వంతో పొందినది -
ఎరుక ఎప్పుడైతే శక్తిని పొందుతుందో అప్పుడు ఎరుక ఏదైనా సృస్టించ గలదు -
ఎరుక మొదటగా సృష్టించినది "కాంతి"(ఆరా) ఈ కాంతి అణువంతయే : ఇదే పరమాత్మ స్వభావం -
ఈ కాంతి స్వభావముతో కూడిన పరమాత్మ తత్వంతోనే ఏదైనా సృస్టించ గలదు వివిధ ఆత్మలుగా -
కాంతి ద్వారా మొదటగా సృస్టించబడినది ప్రదేశము ( జగతి బ్రంహాండము విశ్వము మహాలోకము అంతరిక్షము ) -
ప్రదేశ మంతయు సూక్ష్మాతి సూక్ష్మమైన అణువులతో ప్రతి అణువుకు ఒక ప్రత్యేకమైన ఆత్మ తో వివిధ స్వభావాలుగా నిర్మితమైనది -
ఆత్మ లేనిచోట ప్రదేశము లేదు కనుకనే ఆత్మ అవసరం ఆత్మ లేకుండా దేనిని సృష్టించలేము -
ఈ ప్రదేశము ఎంత ఉందంటే ఎరుక దాని స్వభావాలను వివిధ రకాలుగా కల్పించుటకు ఎన్ని అణువులు కావాలో అన్ని అణువులు పట్టే ప్రదేశం -
ప్రదేశము కూడా ఎంతో కాలానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడే విధంగా ముందస్తు ప్రణాళిక గా కాలంతో పాటు భవిష్యత్ కార్యాలకు అనుకూలంగా -
ప్రదేశమంతా దాగిఉన్న అణువులకు కొన్ని స్వభావాలతో పాటు రూపాలను కలిగించుటకు కాల ప్రభావ ఉనికిని కొన్ని రకాలుగా కొన్ని సంవత్సరాలుగా కల్పించుకుంది -
"ఉనికి" ని వివిధ రకాలుగా ప్రథమముగా చలి(చంద్రుని ప్రభావంతో) వేడి(సూర్యుని ప్రభావంతో) గా వివిధ ప్రభావాల తీవ్రతతో ప్రదేశములోని అణువుల మీద ప్రయోగించడం జరిగింది -
ఇక్కడ గమనించ వలసిన గొప్ప విషయం ఏమిటంటే సూర్య చంద్రులు ఉదయించిన(ఏర్పడిన) సమయ కాలము ఇక్కడే ఆరంభమైనదని తెలుసుకోవచ్చు -
చలి యొక్క ఉనికిని వివిధ తీవ్రతలతో అత్యధికంగా చేయడం వల్ల గాలి స్వభావము అణువులలో చలనముగా (ఆరంభమై) కలిగి హిమ(నీరు) బిందువులుగా మారుతూ చాల పెద్ద పరిణామాలతో వివిధ రకాలుగా ఆకార రూపాలతో మార్పు చెందుతూ వచ్చాయి -
హిమమును కూడా వివిధ రకాల స్వభావాలతో అతి చలి తీవ్రతతో మహాగట్టిదనముగా ఘనరూపంగా మార్చుటలో రూపాంతరం చెందుతూ పర్వతాలుగా శిఖరాలుగా కొండలుగా ఏర్పడుతూ వచ్చాయి -
వేడి తీవ్రతను వివిధ స్వభావాలతో అత్యధికం చేయడంవల్ల పర్వతాలలో శిఖరాలలో కొండలలో పగుళ్ళు ఏర్పడి లోయలుగా పెద్ద చిన్న రాళ్ళుగా గులకరాళ్లుగా ఇసుక రేణువులు మట్టి ధూళి సూక్ష్మ కణాలు ఇలా ఎన్నెన్నో -
వేడి తీవ్రతకు పర్వతాలలో వివిధ ప్రకంపనాలకు పగుళ్ళు ఏర్పడి లావా జ్వాలలు విజ్రంభించి మంచు కరుగుతూ నీరుగా మారి ఆవిరి అవుతూ మేఘాలుగా ప్రభావం చెంది వర్షాలుగా ప్రభావం చెందాయి -
పగుళ్ళు వివిధ రకాలుగా భూ ప్రకంపనాలు లావా జ్వాలలు వర్ష ప్రభావాలు (వర్షాలు ఆరంభమైన కాలం) ఏర్పడుతూ కొన్ని అణువుల రాపిడిలో మలినములు వివిధ రంగులతో రూపాంతరం చెందుతూ వచ్చాయి -
మలినముల యొక్క ప్రభావాలు చలి వేడి తీవ్రతలో అనేక రకాలుగా స్వభావం చెంది ఎంతో కాలంగా నేల రకాలుగా (ఎర్ర నల్ల మిశ్రమ నేలలుగా వివిధ స్వభావాలతో) ఖనిజాలుగా ఇంధనములుగా భూ పొరలలో విస్తృతంగా ఏర్పడినాయి -
వర్షాల ప్రభావాలతోనే సముద్రాలు నదులు జల పాతాలు సెల యేరులు గుహలు లోయలు చెరువులు వాగులు వంకలు కాలువలు నీటి ప్రవాహ ధారలుగా కొన్ని సంవత్సరాలతో పాటు మార్పులు చెందుతూ వచ్చినవే -
"చలి, వేడి" తీవ్రత ప్రభావాలు కొన్ని సంవత్సరాలుగా ప్రభావితం చెందుతూ సృష్టిలో పంచభూతాలుగా ప్రదేశంతో పాటు అణువుల ద్వారా గాలి నీరు భూమి అగ్ని వివిధ రకాల మార్పులతో కాలంతో పాటు వచ్చినవేనని తెలుస్తుంది -
చలి వేడి తీవ్రత ను ఎరుక యే వివిధ స్వభావాలతో కలిగించి ప్రకృతి పంచభూతాలుగా మారుస్తూ ఏర్పరిచింది -
మట్టి నీరు ఎప్పుడైతే కలిసినాయో దాని ప్రభావానికి కాలానుగునంగా అణువులలో సంకోచ భావాలుగా పరిణామం చెందే చలన తత్వం ఏర్పడి సూక్ష్మ భీజములుగా మొక్కలుగా వేర్లతో ప్రభావం చెందుతూ చెట్లు వృక్షాలు అడవులుగా ఏర్పడ్డాయి -
చెట్టుగా పరిణామం చెందిన తర్వాతనే సూక్ష్మ జీవులు క్రిమి కీటకాలు పక్షులు జంతువులు ఎన్నో రకాలుగా నీటిలో మట్టిలో గాలిలో ఎన్నో ఎన్నెన్నో -
ఇంకా ఉంది ..!

------

గమనించవలసిన ముఖ్య మైన విషయాలు :
చలి వేడి ఉనికి కై చంద్రుడు సూర్యుడు ఉదయించినట్లు తెలుస్తుంది - నక్షత్రాలు చంద్రుడు సూర్యుడు : కాంతి ప్రభావాలతో ఏర్పడిన అణువుల సముదాయమే -
ప్రదేశము మొదట చీకటిగా ఉన్న తర్వాతనే వెలుగుగా మారినది(సూర్యునితో అర్ధ రోజు వెలుగుతో) -
చీకటి వల్ల చంద్రుడు వెలుగు వల్ల సూర్యుడు మనం చూస్తున్నవే -
భూమి యొక్క ప్రదేశాన్ని చాలా వెలుగుతో నింపుటకు సూర్యుడు అగ్నిగోళంగా మారిపోయాడు(అణువుల యొక్క శక్తి విస్పోటనమే) -
అణువులు ఎప్పుడైతే హిమముగా మారుతాయో దాని వల్ల బరువు పెరుగుతుంది -
బరువు వల్ల గురత్వాకర్షణ శక్తి మొదలవుతుంది కనుక ప్రదేశము లో ఒక ప్రాంతమున హిమము తిరుగుటను ప్రారంభించి రూపాంతరము చెందుతూ కాల ప్రభావము వలన భూమిగా నేటికి తిరుగుతూనే ఉంది -
"సర్వాంతర దిశ శక్తి" తో నే భూమి తిరుగుట వలన బరువును సమపాలలో మోస్తుంది -
ప్రదేశమున వివిధ ప్రాంతములలో వివిధ రకాలుగా హిమము గా మారుట వలన భూమిగానే కాక ఇతర గ్రహాలుగా రూపాంతరం చెందాయి -
భూమిలో కలిగిన ప్రభావాలుగా ఇతర గ్రహాలలో అణువులు రూపాంతరం చెందక జీవ సృష్టిలేక గ్రహాలుగానే మిగిలి పోయాయి -
ఒక వేల ఇతర గ్రహాలలో కూడా ఏ జీవి ఐనా జీవించగలిగినచో అది కాల క్రమేణ జరుగుతూ వచ్చిన అణువుల ప్రభావమే -
ఇక్కడ ముఖ్యమైన విషయమేమిటంటే భూమి గ్రహాలకన్నా చంద్ర సూర్యులు ముందుగా ఉదయించారు (చంద్రుడు తర్వాతనే సూర్యుడు కూడా) -

ఇంకో విషయమేమిటంటే చంద్ర సూర్యులకన్నా నక్షత్రాలే ముందుగా ఏర్పడ్డాయని ఒక ఆలోచనగా కాంతి ప్రభావంతో గమనించవచ్చు -
నక్షత్రాల యొక్క ప్రకాశ శక్తి కాంతివంతంగా ఉన్నందువల్ల దాని ప్రభావమునకు చాలా కాల సమయంతో ఏర్పడ్డాయని తెలుపగలను -
ఇంకా సూక్ష్మముగా పరిశీలించి ఆలోచిస్తే గాని కొన్ని విషయాలు తెలియగలవు -
మీకు ఏదైనా నా భావన సరి కాకపోతే మీ జ్ఞానమే నా భావనగా మీలో ఒక అణువుగా ఆలోచనా ప్రభావంగా నిలిచిపోతుంది -










1 comment:

  1. Welcome to Blogger "gsystime" to read my intent of information. // Spread Universal //

    ReplyDelete