Saturday, February 6, 2010

ఆత్రేయముగా తోచిన ఆలోచనలను

ఆత్రేయముగా తోచిన ఆలోచనలను అర్థముగా చేసుకొని మేధస్సున అప్పుడే జ్ఞాపక పరచితే మరల విశ్రాంతి సమయాన విశదీకరించగా దాని విజ్ఞాన ప్రభావము ఎప్పటికైనా ఉపయోగకరమే -
మేధస్సు యొక్క శక్తి క్షణమున ఎన్నో వేల ఆలోచనలను సేకరిస్తూ కొన్నిటిని జ్ఞానముగా గ్రహిస్తూ ఎన్నో కార్యములను ఎన్నో విధాల చేయుటకు మరెంతో విజ్ఞానం కల్పిస్తూ సహకరించును -
ఆత్రేయముగా కలుగు ఆలోచనలపై ఏకాగ్రత లేకపోతే అద్భుతమైన ఆలోచనలను గ్రహించలేక మేధస్సు యొక్క వేగ ప్రవాహ ఆలోచన తీరును గుర్తించలేక తెలియని విచారమే -
ఆలోచనల శక్తి వలనే ప్రతి జీవి జీవిస్తూ ప్రపంచాన్ని జ్ఞానవంతంగా వివిధ రకాల అద్భుతాలతో ముందుకు నడిపిస్తూ మేధస్సు విజ్ఞానాన్ని విశ్వ జగతిలో కూడా అన్వేషిస్తూ పరిశీలిస్తున్నారు -

1 comment:

  1. Welcome to Blogger "gsystime" to read my intent of information. // Spread Universal //

    ReplyDelete