మన మేధస్సున ఆలోచనలే మన కార్యాలకు సాటిగా ఎన్నైనా సరేనని
దేనికైనా ఏ క్షణమైనా మనతోనే మన కోసమే ఆలోచించే మేధస్సు నేస్తంగా
ఏదైనా ఎవరైనా భగవంతుడైనా మన మేధస్సు కన్న గొప్పగా ఏదీ లేదని
మన మేధస్సుతోనే సాధనతో అద్భుతమైనా పరమాత్మగా ఎదగవలెనన్నా
ఎవరి మేధస్సు వారికే గొప్ప ఎవరు ఎలా కావాలనుకుంటే అల కాల స్పూర్తితో
ఏ సమయానికి ఏ వయసుకు ఏది చేయవలెనో తెలుసుకోగల్గితే మనకెవరు సాటి
No comments:
Post a Comment