ఈ విశ్వశక్తి ప్రాణ వాయువుగా తల్లి ద్వార శిశువులో చేరి జీవంగా మారుతుంది -
ప్రతి అణువు పరమాణువులో సూక్ష్మ కణములలో జీవులలో ప్రకృతి రూపాలలో ఆత్మలుగానే వివిధ ఆకార రకాల స్వభావాలతో -
శిశువులో ఆత్మ చేరిన తర్వాతనే శ్వాస మొదలవుతుంది అలాగే ఇతర జీవులలో -
శ్వాస ఆగిన తర్వాతనే మరణం చెంది ఆత్మ శరీరాన్ని వదిలి మరల జీవముగా కొత్త శిశువులో ప్రవేశించుటకు ప్రయత్నిస్తుంది -
ఆత్మ శరీరాన్ని వదిలిన తర్వాత (పరమాత్మ నుండి) విశ్వ శక్తిని పొంది మరల ఆత్మ ఎరుకగా మరో శిశువులో ప్రవేశిస్తుంది లేనిచో ప్రవేశించదు (విశ్వ శక్తియే ఆత్మ ఎరుక) -
ఆత్మ ఎరుక తోనే శ్వాస మొదలవుతుంది -
-----
ఆరు "ఎరుక" లు
విశ్వ/ప్రకృతి ఎరుక (సృష్టిలోనే మొదటి ఎరుక) : "క్షణం - అంతా తెలిసిపోయేనా" చదవండి (జనవరి 2010) -
ప్రకృతి ప్రభావాలుగా చలి ఎండ వాన గాలి కలిగేది ప్రకృతి ఎరుక తోనే -
ఆత్మ ఎరుక : మన శరీరము ఆత్మతో కూడి శ్వాసను కలిగించేది (గత జన్మ ప్రభావాలు గుర్తుకు వచ్చేది దీని వలెనే) -
ముఖ్య/ప్రథమ ఎరుక : ప్రతి జీవి మానవుడు ఆలోచించేది అర్థం చేసుకోవడం దీని వలెనే ("మేధస్సు ఎలా పనిచేస్తుంది" : చదవండి) -
ద్వితీయ ఎరుక : కలలు వచ్చేది దీని వలనే (చదవండి : "కల" ల లోకం ఎక్కడ?) -
మహా/ధ్యాస ఎరుక : చాలా గొప్పదైన దివ్యమైన ఎరుక ధ్యానమున కలిగేది
ఆరవ ఎరుక : దూరసృష్టి ముందుచూపు కలిగినది (అనుభవము అవగాహన సమయాలోచన ఏకాగ్రత కార్యస్థితిలో కలిగేది) -
No comments:
Post a Comment