Thursday, February 4, 2010

దేశంలో మరో దేశం

దేశంలో మరో దేశం ఆ అవకాశం ఏ దేశానికో ఎటువంటి బంధమో -
ఒక దేశ ప్రజలు నివసించుటకు మరో దేశానికై వేచి ఉన్నారు ఏదీ తెలియక -
ఆ దేశ పరిస్థితుల ప్రభావాలు దిక్కు తోచని విధంగా మారిపోతున్నాయి ఎందుకో -
భూ ప్రకంపనాలు వాయు జల అగ్ని(లావా) ప్రళయ ప్రమాదాలు తలెత్తుతున్నాయి -
ఎక్కడ చూసిన ఘోర మరణాలు భయంకర దృశ్యాలు ప్రకృతి వికృతాలు మతి చెదురునట్లుగా -
భవనాలు కూలిపోవటం భూ పొరలలో చిక్కి పోవటం బరువైనవేన్నో మీద పడటం -
కాలిపోవటం శ్వాస ఆడకపోవటం గుండె ఆగిపోవటం భయం కలగటం నీటిలో కొట్టుకుపోవటం ఎన్నెన్నో -
మరణించినవారు మరణించబోయేవారు సురక్షింతంగా ఉన్నా బయటికి రాలేనివారు ఎందరో -
చిన్న పిల్లలు వయసుగలవారు పెద్దలు ముసలివారు ఎందరో ఎన్నోవిధాల ఎన్నిరకాల ఇబ్భందులో -
అంగవైకల్యముతో పోరాడినవారు గురైనవారు అంగవైకల్యము చెందినవారు అవస్థలతో ఎంత భారమో -
కన్నీరు రక్తపు మడుగులు భూడిద కుప్పలు కళేభరాలు జంతు జీవముల మరణాలతో స్మశానము వలె -
తిండి గుడ్డ వసతి ధనం విలువైన వస్తువులు కుటుంభాలు బంధువులు అనాధలు ఏమియులేవు శూన్యము వలె -
లక్షలలో ఉన్నవారు వేలలో మిగిలిపోయారు ఆశతో జీవిస్తున్నవారు నిరాశతో పరతత్వ యోగులవలె -
ఆ దేశాన్ని వీడితే గాని మరో దేశంలో బ్రతకగలమనే ఆశ చిగురించటం లేదు -
అక్కడే జీవిస్తే మరో సమయానికి అదే పరిస్థితి అన్నట్లు భయంతో మిగిలిపోయారు -
దేశాన్ని వీడకపోతే వేలలో ఉన్నవారు వందలలో మరో వేదనలో మరణించేదరు -
ఆ దేశాన్ని ప్రకృతి ప్రభావాలకు అతీతమైనా ప్రదేశంగా వదిలిపెడదాం మరో ప్రాంతానికి వెళదాం -
ప్రపంచంలో ఎక్కడైతే ప్రకృతి వికృతాలు ఎక్కువగా సంభవిస్తాయో ఆ ప్రదేశాన్ని సృష్టికే అంకితం చేయండి -
అంతా పోగొట్టుకున్న ఆ దేశ ప్రజలను మరో దేశస్తులు ఆహ్వానించండి కనీస సదుపాయాలు కల్పించండి -
అందరు మనవారే ఎవరినుండి దేనినుండి ఏది జరిగినా శాంతి ప్రభావాలతో శ్రమిస్తూ జీవిద్దాం -
దేశంలో మరో దేశ ప్రజలు జీవించునట్లుగా ఆ దేశాలు చరిత్రలో నిలిచిపోతాయి -
దేశమే కాకపోయినా కొన్ని ప్రాంతాలను వదిలి వెళ్ళండి ప్రకృతి ప్రభావాలు దూరంగా -
శాస్త్రవేత్తలే భూ ప్రాంతాన్ని పరిశీలించి సరైనా జాగ్రతలు తీసుకునే విధంగా జ్ఞానించండి -

1 comment:

  1. Welcome to Blogger "gsystime" to read my intent of information. // Spread Universal //

    ReplyDelete