Sunday, February 14, 2010

ఆ క్షణాన నేను ఒక్కడినే

ఆ క్షణాన నేను ఒక్కడినే నిలిచానని కలియుగాంతమున తెలిసేనే
ఎందరో కనుమరుగై నా యందే దిక్కులు లేని విధంగా మరణించేనే
నా వారు తెలియని వారు అందరూ నన్ను విడిచిన శ్వాస వారినే వదిలెనే
ఏ జీవిని రక్షించినా మరో జీవిని రక్షించుటలో ఎన్నో జీవులు మరణంతోనే
భయంకరంగా వివిధ ధ్వనులతో భీభత్సం సృష్టిస్తున్న ప్రకృతి ప్రశాంతమైనది
అడుగులు వేయటానికి కూడా లేకున్నా ఎవరైనా ఉన్నారా అని పలుకుతున్నా
నిలిచిన చోటే నిలిచి చీకటిలో నిరాశగా నిద్రిస్తూ మరో ఆశతో రేపటి సూర్యోదయానికే
నా చుట్టూ ఉన్న ప్రాంతం గట్టి పడేంతవరకు రోజులుగా వేచి అడుగులతో సాగిపోయా
ఏ జీవి లేక నా జీవం ఎదురు చూస్తున్నది ఒంటరిగా కొత్త చిగురుకై ఆహారముగా
మరో యుగం ఆరంభం వరకు నే ఒంటరిగా జీవిస్తూనే ఉన్నా ఒక యోగిగా మరో జీవిగా

1 comment:

  1. Welcome to Blogger "gsystime" to read my intent of information. // Spread Universal //

    ReplyDelete