Sunday, February 28, 2010

ఆనాటి గతం నుండి

ఆనాటి గతం నుండి నిన్నటి వరకు చేసిన కర్మలను గ్రహించి నేటి నుండి అనుభవించు -
శరీరాన్ని ఆరోగ్యంగా కోరుకుంటూ కష్టాలెన్నిటినో ఓపికగా ఆలోచనలతో అధిగమించు -
జీవహింస లేకుండా మరోప్రాణిని ద్వేషించకుండా ఆత్మజ్ఞానంతో రోజూ తలుస్తూనే జీవించు -
ప్రకృతిని కూడా ప్రేమతో ఆదరిస్తూ ఎవరు ఏమన్నా జ్ఞానంగానే స్వీకరిస్తూ ధ్యానించు -
ధ్యానమును సాగించుటలో ఆత్మకర్మ నశిస్తూ ఆత్మజ్ఞానం ఎదుగుతూ విశ్వజ్ఞానిలా నీవే -

నాకు తెలియకుండా నా వారికి

నాకు తెలియకుండా నా వారికి ఘోర ప్రమాదం జరిగినది ఓ చోట ఎలాగో
ఆ వేళలో నాకు జరుగుతున్నదని తెలియలేక పోవడానికి కారణమేదో
ఒక వేళ ఆ క్షణానికి ముందు నాకు ఆలోచనగా తెలిసిన ఆపేదెలా
జరిగిన తర్వాత కొంత సమయానికి తెలిసేటప్పుడు నాముఖ కదలిక భావనేది
భావాలతో మొదలయ్యే ఆ భాద వేదనలో కలిగే స్వభావం ఎలాంటిదో
నా వారి ఆకార రూపం చూడలేనంతగా ఉంటె దిక్కు తోచని విధాన నేనెందుకు
ప్రమాదాలు జరగకుండా ఆపలేను ఐనా అనుభవంతో మీ ఎరుకకే హెచ్చరిస్తున్నా
జరిగే ప్రమాదాన్ని ఆపలేని శక్తి మనలో లేనప్పుడు ఆత్మజ్ఞానిగా నడుచుకోవలెను
మీలో మరుపు ఉంటుందేమో గాని నే తెలుపుటలో ఎన్నో విషయాలు గమనిస్తా
ఎలా జీవించాలో తెలుసుకోండి కాలాన్ని వృధా చేయక ప్రయాణాలను తగ్గించండి
నా మాట వినక పోతే కాల మార్పులకు ఎవరు ఎలా అనేది దైవమే నిర్ణయిస్తుంది
ఎన్నో తెలుపగలను మీలో తెలుసుకోవాలనే జీవిత విజ్ఞానకృషి ఉంటె చాలు భావనగా

Saturday, February 27, 2010

ఏ రూపమైనా క్షణములో

ఏ రూపమైనా క్షణములో తెలిసిన రూపంగా గుర్తించి మరో రూపాన్ని చూస్తున్నా
ఎన్నో రూపాలను చూస్తూనే ఎన్నో తెలిసిపోయి క్షణముననే ఎన్నెన్నో భావాలతో
ప్రతీది క్షణములోనే తెలుసుకుంటూ అనంత విజ్ఞానముగా మరెన్నో విషయాలు
నేను సేకరించినవన్ని నా మేధస్సున ఉన్నా విజ్ఞాన భావనగా తెలుపుతూనే ఉన్నా

నేను పరమాత్మనని నమ్మే వరకు

నేను పరమాత్మనని నమ్మే వరకు జగతిలో నిలిచి ఉంటానని నా భావన నిరంతరముగా -
నాకు నేను ఎన్నో తెలుసుకొని మరెన్నో భావాలు నిరంతరం నా వారికి తెలుపుతున్నా -
ఎవరికి తెలియని సృష్టి తత్వములను విశ్వమున అన్వేషించే వేద విజ్ఞానముగా తెలిపా -
అనంత భావాలైనా కణాలతో సహా గుర్తించి స్వభాలను తెలిపి పరమాత్మగా నమ్మకాన్నే -

నా రూపమున ఒకే క్షణమున

నా రూపమున ఒకే క్షణమున నవ్వు జాలి కరుణ దయ ఉత్సాహం ఆత్రేయం ప్రేమ ఏడుపు భాద వేదన చింతన -
కోప తాప ఉక్రోషాలు ఉగ్ర రాక్షసత్వ రోష ఉగ్వేదాలు క్రూర ద్వేష ఆకార వికారములుగా ఎన్నో రకాలుగా నాలో -
కనపించేవారికి చూసినట్లుగా ఒకే భావమైనా నాలో తెలియని స్వభావ ఆకృతులు ప్రతి క్షణమున ఎన్నో విధాల -
ప్రతిజీవిలో ప్రతిఅణువున కలుగు స్వభావ ముఖ కదలికలు నాలో నిరంతరం దాగేఉండును మరణ రూపమైనా -

మనలో కలిగే ఆలోచనలన్నిటిని

మనలో కలిగే ఆలోచనలన్నిటిని మాటలుగా పలకలేము
పలికే మాటలన్నీ ఆలోచనలుగా వచ్చినా అన్నీటిని గుర్తించలేము
మనకు తెలియకుండ దాగిన ఆలోచనలెన్నో మేధస్సుననే
కలలుగా వచ్చే ఆలోచనలకు అంతే లేదు అలా మనలో ఎన్నో
ఏ ఆలోచనైనా పలికే మాటగా సత్యంగా ఉండవలెనని జ్ఞాపకంగా
సత్యములేని మాట దేహముననే పలికే ప్రతి మాట విశ్వముననే

సమయానికి ఏది తోచక

సమయానికి ఏది తోచక అడుగులతో ప్రయాణమయ్యాను కాలాక్షేపంగా
వెల్లిపోతూనే ఎన్నిటినో చూస్తూ ప్రకృతి తప్ప ఏది కనిపించనట్లుగా ఎందుకో
అడుగులు సాగుతున్నాయేగాని అలసటలేక ఎప్పుడు చూడలేనివి విజ్ఞానంగా
అద్భుతమైన వెలుగులు విశాలమైన వివిధ రకాల ప్రదేశాలు ఎన్నెన్నో నాలో
అణువంతటి కాంతిలో వెళ్ళగా ఏది గుర్తులేక మరల నా ప్రదేశాన్ని చేరుకున్నా
జ్ఞాపకంగా చూసినవన్ని గుర్తుకురాక ధ్యానం చేయగా తెలిసిపోతున్నది మరల
ధ్యానమున మరోధ్యాసలో తెలిసెను నేను విశ్వమును చూట్టి పరమాత్మలో ఇక్యమైనట్లు

పరమాత్మ నేనేనని భావనగా

పరమాత్మ నేనేనని భావనగా నేననుకున్నా నన్ను అడిగినవారికి తెలిపేదేలా
నాలో ఏ శక్తి లేనేలేదు విజ్ఞానముగా ఎన్నో విషయాలు తెలిపినా రుజువు లేదే
నాకు నేనైనా నేనే పరమాత్మనని నాలో రుజువు లేదే నాకు తెలిసేలా గొప్పగా
భావనగా అనంత విశ్వాంతర విజ్ఞానమే తెలిసినా తెలిపినా నమ్మకం కలగదే ఎవరిలో
అణువణువున భావ స్వభావాలు తెలిపినా ఒక భావనతో పరమాత్మనని నాలోనే

నిజంగా నేనేనా పరమాత్మ

నిజంగా నేనేనా పరమాత్మ భావన నాలోనే ఉందని నన్నే అడిగెనే సత్యం
ఎవరైనా నావారనే ఏదైనా నాకేనని సుఖ దుఖ్హాలను ఒకటిగా తలిచేలా
మరణం కన్నా ఆపదలో కలిగే భాధలోని వేదన కొన్నాలుగా నరకంగా
స్వర్గమనే పదం నాలోనే లేనట్లు భావనగా మీలో కలిగే జీవన ఆశయమే
నాలో ఏదైనా తెలియని మర్మముగా మరో ధ్యాసలో ఆత్మ ధ్యానంలా
జరిగినదేధైనా విజ్ఞానముగా ఎదుగుటకు సత్యంగా నిలిచా పరమాత్మవలె

Friday, February 26, 2010

జగమంతా తెలుపాలనుకున్నా

జగమంతా తెలుపాలనుకున్నా ఒక భావన నాలోనే నిలిచిపోయింది
భావనకు ప్రతిరూపం స్వభావమేనని ఆ భావన ఆలోచనగా నాలోనే
ఎన్నో ఊహించని భావాలు నాలో ఉన్నా ఎన్నో తెలిపినా మిగిలేను
నా శ్వాస ఆగిన క్షణాన నాకు తెలిసి తెలియనట్లుగా తెలుపలేక ఆ..!

భావనలే ఆలోచనలని తెలిసినా

భావనలే ఆలోచనలని తెలిసినా ఇంకా ఆలోచనలనే యేమని తలుస్తున్నా
ఆలోచనలు లేక ప్రకృతి ఉండగలదేమోగాని ఏ జీవి జీవించజాలదు క్షణాన
క్షణము కూడా క్షణాలుగా సాగుతున్నందునే విశ్వమున కాల ప్రయాణం
ఏదైనా ఆగితే సమస్యగా లేదా మరణంగా లేదా తెలుసుకోవాలనే తెలిసినా

విశ్వమే నేనని నేనే తెలుపుకుంటున్నా

విశ్వమే నేనని నేనే తెలుపుకుంటున్నా తెలిపినా ఆధ్యాత్మకంగా ఆలోచించే భావన ఎవరిలో లేదే -
ఆధ్యాత్మక భావన కలవారు నాయందులేరు తెలిపేందుకు వారితో కలియుటకు సరైనసమయం రాక -
నాకు నేనుగా తెలుపుకుని నాలోనే విశ్వ వేదాంత విజ్ఞాన గుణ భావ సత్యములు నిలిచిపోయాయి -
ఎవరికైనా నా లోని ఒక భావన అర్థమైన దానిని ఇతరులకు వివరించేందుకు ప్రయత్నిస్తే సమస్తమే -

ఎన్నెన్నో రూపాలు

ఎన్నెన్నో రూపాలు ప్రతి రూపమున అనంతమైన భావాలు
భావాలతో ఆలోచనలుగా ఎన్నెన్నో కార్యాలు ఎన్నో రకాలుగా
ఏదైనా ఎన్నో విధాలుగా మేధస్సు ప్రభావం విస్తృతంగానే
అణువణువున ఎన్ని స్వభావాలో ఒక్కటిగా పరమాత్మగా

ఆ గ్రహచారము ఎందుకు

ఆ గ్రహచారము ఎందుకు ఎలా జరిగినదో మాయగా కర్మవలె తెలియనట్లుగా
ఎందరో ఉన్నా నాకు నాకు నేనుగా వెళ్లి ప్రమాదమునకు గురైతినే మూర్ఖుడిలా
ఆ సమయమున నా ఆలోచనల స్థితి నాకే తెలియనట్లుగా ముందున్నదేదో కానరాక
ప్రమాదమున ప్రాణాలను తోడేసినట్లు అవయవాల భాగాలు చెడి అనర్థ రూపంగా
ఎరుకలేని ఆలోచనలతో ఆత్మజ్ఞానం లేక మానసిక సమస్యలే ఇబ్బందులుగా కర్మవలె

మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా

మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా మన తోటివారు సరిగా లేక ఇబ్బందులకు గురైతే మనకూ భాదే -
ఇబ్బందులలో కాలధన ప్రగతులు తగ్గి మార్పులతో ఎందరికో అవస్థలుగా దూర ప్రయాణమున -
ప్రమాదాలుగా గురైతే నయం కావడానికి ఎన్ని రోజులు ఎందరికి ఇబ్బందో అర్థంకాని విచారం -
ప్రయాణమున ప్రక్కవారు కూడా మనకు ఇబ్బందిగా ఉంటె మన జాగ్రత్తలో కూడా ప్రాణాలు విలవిల -

మన మేధస్సున ఆలోచనలే

మన మేధస్సున ఆలోచనలే మన కార్యాలకు సాటిగా ఎన్నైనా సరేనని
దేనికైనా ఏ క్షణమైనా మనతోనే మన కోసమే ఆలోచించే మేధస్సు నేస్తంగా
ఏదైనా ఎవరైనా భగవంతుడైనా మన మేధస్సు కన్న గొప్పగా ఏదీ లేదని
మన మేధస్సుతోనే సాధనతో అద్భుతమైనా పరమాత్మగా ఎదగవలెనన్నా
ఎవరి మేధస్సు వారికే గొప్ప ఎవరు ఎలా కావాలనుకుంటే అల కాల స్పూర్తితో
ఏ సమయానికి ఏ వయసుకు ఏది చేయవలెనో తెలుసుకోగల్గితే మనకెవరు సాటి

భావనగా ఆలోచనలు

భావనగా ఆలోచనలు మొదలై కార్యములలో మరో భావనాలోచనలెన్నో
బహు భావ ఆలోచనలుగా కార్యములలో ఎన్నెన్ని ఆలోచనలో అనంతమే
ఆలోచనగా లేని కార్యములు సాగలేవని భావనగా మొదలై వివిధ రకాలుగా
ఆలోచించే మేధస్సున సైతం బహు బావాలేనని ఎన్ని కార్యములను నిర్వర్తిస్తుందో

నే పరమాత్మనని తెలియక

నే పరమాత్మనని తెలియక మాయగా నా వారికి ప్రమాదాలేలా
విశ్వమంతా అణువులుగా నే ఉన్నా నా వారి ఆలోచనలేలా
సహనమే నాలో ఉందని తెలుపుటకా లేదా నా వారి దుఖ్హాలేలా
జీవించగా జీవము జీర్ణమౌతున్నదే గాని జీవించుటకు పరీక్షలేలా

అలసిపోయాను జేవిస్తూనే

అలసిపోయాను జేవిస్తూనే అలసిపోతూ అలలుగా సాగిపోతూ కెరటంలేని విధంగా
ఆత్మగా ఎన్నో జన్మల విజ్ఞానమే ఉన్నా సర్వం తెలిసేదాకా జీవిస్తూనే అలసిపోయా
కెరటం ఉప్పొంగేలా మరణించాలని ఒక ఆలోచనతో ఉత్సాహంగా ఎదురే చూస్తున్నా
అలలు కూడా ఆగిపోయి గాలిలేక నాలో శ్వాస నిలిచిపోయే అలసిపోయానని ఆగేలా

Thursday, February 25, 2010

How are you?

How are you? Everybody asking how are you? Most of them replies fine -
Actually no one be with happy because everyone having problems -
If say fine ok otherwise no(not fine) means you express the problems -
If you have no time just fine, you have spend some time then say not fine -

వేదమునే రచించి విశ్వమున

వేదమునే రచించి విశ్వమున వివరించి ఎందరికో తెలిపెదను విజ్ఞానమునే గ్రహింపజేసెదను -
అజ్ఞానమున విశ్వమున కలుగు కీడు ప్రభావాలెన్నో ఎవరు పరిష్కారించలేని విధముగానే -
భగవంతుడు ఏది సృష్టించలేదు అజ్ఞానముగా ఏ అణువును నాశనం చేయలేక నిలిచాడు -
విశ్వప్రకృతినే గమనిస్తూ విజ్ఞానముగా ఎదిగి నిరంతర అణు పరమాణువువలె పరమాత్మగా -

ఆలోచనలు కొన్ని క్షణాలలోనే

ఆలోచనలు కొన్ని క్షణాలలోనే మారిపోతూ చేయవలసిన పనులు కూడా మారుతూ పోతాయి -
జ్ఞానేంద్రియాల దృష్టి ఏకాగ్రత స్వభావ ప్రభావాలతో మన ఆలోచనలు వివిధరకాలుగా మారుతుంటాయి -
చూస్తున్నప్పుడు వినిపిస్తున్నప్పుడు తినేటప్పుడు వాసనను గ్రహించేటప్పుడు ఆలోచించేటప్పుడు క్షణాలలో మారుతూనే -
ఆలోచనలు క్షణానికి ఎన్నో మారుతూనే మనం ఎన్నిటినో వివిధ రకాలుగా తెలుసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం -
ఏ ఆలోచన మారిన ఎరుకతో చేయవలసిన పనిని చేయగలగాలి నష్టం లేకుండా ఎవరికి భాద కలగకుండా -

Wednesday, February 24, 2010

* నిద్ర ఎలా వస్తుంది

నిద్ర ఎలా వస్తుంది ఎలా కలుగుతుంది ఏ విదంగా ఉంటుంది ఎందుకు -
పగలంతా ఆలోచిస్తూ ఎన్నో పనులు చేస్తూ మేధస్సున ఎన్నో సమకూర్చుకుంటూ అలసిపోతూ ఉంటాం -
మన మేధస్సు శరీరం ఎన్నో విధాలా అలసిపోవుటచే మనలో ఉత్తేజము శక్తి సామర్థ్యాలు తగ్గుతూ వస్తాయి -
ఆహారం తీసుకుంటున్నా శరీరంలో జరిగే ఎన్నో రకాల పనుల వలన మనకు కొంత మానసిక విశ్రాంతి అవసరం -
మనం కొన్ని గంటలు నిద్రపోతే మరల కొంత శక్తిని పొంది మేధస్సు ఉత్తేజముగా శక్తివంతంగా మరికొన్ని పనులను చేయుటకు వీలు కల్గిస్తుంది -
మనం నిద్రించకపోతే శరీరమున శక్తి తగ్గి మేధస్సు సరిగా పని చేయక అనారోగ్యముగా జీవించవలసి వస్తుంది -
ఇంకా ఎన్నో విధాల శక్తి సామర్థ్యాలకై మనం ప్రతి రోజు ఎనిమిది గంటలైనా నిద్ర పోవలసి వస్తుంది -
నేడు వృత్తి రిత్యా కొందరు రాత్రి సమయంలో పని చేస్తూ పగటి సమయాన నిద్రిస్తుంటారు -
మనం నిద్రించేటప్పుడు కళ్ళు మూసిన వెంటనే కొంత సమయానికి మరోధ్యాసలో వెళ్ళిపోతాం -
ఎప్పుడైతే మరోధ్యాసలో వెల్లిపోతామో ఆ సమయాన నిద్ర కలుగుతుంది -
నిద్రలో శరీరమున ఎన్నో రకాల సూక్ష్మ పనులతో వివిధ అవయవాలు పనిచేస్తూ కొత్త శక్తిని పొందుతాయి -
నిద్రలోనే మనం కలలుగంటూ ఎన్నిటినో ఆలోచిస్తూ ఎన్నిటినో తెలుసుకుంటూ ఉంటాం -
నిద్రలోనే మనకు ఎన్నో రోగాలు నయమౌతాయి అలాగే సరిగా నిద్రించకపోతే ఎన్నో రోగాలు వస్తాయి -
సరైనా సమయాన సరిపోయే సమయాన్ని నిద్రకు కేటాయించి మన ఆరోగ్యాన్ని పొందగలగాలి -
మరోధ్యాస ఎలా కలుగుతుందంటే మన ఆత్మ ఎరుకయే మనం నిద్రించే సమయానికి మన రోజు వారి కార్యాలను ఆపి తెలిసి తెలియకుండానే నిద్రలో జార విడుచుతుంది -
ఆత్మ ఎరుక ద్వారా నిద్రలో వెళ్ళినప్పుడు ద్వితియ ఎరుక మొదలవుతుంది -
ద్వితియ ఎరుక నిద్రలో ఆలోచిస్తూ మనలో దాగిన ఎన్నో విషయాలను తిరగేస్తూ కలలుగా వివిధ రకాలుగా పనిచేస్తుంది -
మనం ప్రతి రోజు మెలకువతో ఆలోచించేది ప్రథమ ఎరుకతోనే అలాగే నిద్రలో వెళ్ళినపుడు ద్వితియ ఎరుక పనిచేస్తుంది -
ద్వితియ ఎరుక పనిచేస్తున్నప్పుడు ప్రథమ ఎరుక మరో ధ్యాసలో వెళ్లి పోతుంది అప్పుడు ప్రథమ ఎరుకకు ధ్యాస ఉండదు -
ప్రథమ ఎరుకపై ఏకాగ్రత ఉంటేనే కొంత మెలకువగా ఉండి కొన్ని విషయాలు తెలుస్తాయి అలాగే నిద్రలో కొన్ని కళలను గుర్తు పెట్టుకోగలం -
మనం ఎప్పుడైతే నిద్ర పోవాలనుకుంటామో ఆ సమయాన ఒక ఆలోచన ప్రథమ ఎరుక నుండి ద్వితియ ఎరుకకు మరియు ఆత్మ ఎరుకకు వెళ్ళుతుంది -
ఆలోచనను ఆత్మ ఎరుకను గ్రహించిన తర్వాత కళ్ళు మూయగానే మరో ధ్యాసతో నిద్రపోగలుగుతాం అలాగే ద్వితియ ఎరుక మొదలవుతూ పనిచేస్తుంది -
నిద్రలో ద్వితియ ఎరుక పని చేస్తున్నప్పుడు ఆత్మ ఎరుక శరీర శక్తిని పెంచగలుగుతుంది రోగాలను నయం చేస్తుంది -
మరోధ్యాస అంటే ప్రథమ ఎరుక మెళకువను మరలించి ద్వితియ ఎరుకను మెళకువగా పని చేయించడం (ఆత్మ ఎరుకయే మరలిస్తుంది) -
ఈ విధంగా మనం నిద్ర పోగలం అలాగే మరోధ్యాసలో శరీర శక్తిని పెంచి రోగాలను నయం చేసుకుంటాం కలలుగంటాం మేధస్సుకు ఉత్తేజాన్ని కలిగిస్తాం -
మనకు మెళకువ రావడానికి కూడా ఒక ఆలోచన ఆత్మ ఎరుక నుండి లేదా ద్వితియ ఎరుక నుండి ప్రథమ ఎరుకకు కలగవలసిందే -
మెళకువ వచ్చిన తర్వాత మరల లేవడానికి కూడా ఒక ఆలోచన మనకు తోచినట్లుగా కలగవలసిందే లేదంటే మెళకువగా ఉన్నా అలాగే మరల నిద్రపోతున్నట్లు -
దేనికైనా ఆలోచన కలగాలి లేదంటే ఆ పనిని చేయలేం కనుకనే మేధస్సు ఉత్తేజమునకై సరైన నిద్ర అవసరం ప్రతి జీవికి -
కొన్ని సందర్భాలలో లేదా కొన్ని క్షణాలలో ఆలోచనలలో మరో ధ్యాసగా తెలిసి తెలియనట్టుగా గ్రహచారముగా ప్రమాదాలు జరుగుతూ ప్రాణాలకే మతి కలిగి మరణానికి దారి తీస్తాయి : జాగ్రత్త సుమా!(పగలైనా రాత్రైనా : నడిచేటప్పుడైనా ప్రయాణముననైనా మెట్లు ఎక్కి దిగే టప్పుడైనా కాల కృత్యముల సమయమునైనా) ముందు చూస్తూ దూర ద్రుష్టి తో వెళ్ళండి యే సమయమునైనా ఎక్కడైనా ఎరుకతో ఆత్మ జ్ఞానంతో -

ఆనాటి ప్రాణవాయువుల

ఆనాటి ప్రాణవాయువుల సుమగంధ పుష్పాల సువాసనలు నేటికి నాయందే వికసిస్తున్నాయి -
ఎప్పటికి నన్ను నా మేధస్సును ఉత్తేజముగా జీవింప జేయుటకే నాయందు సుమగంధాలుగా -
విశ్వమున ఏ చోట ఉన్నా నాతోనే నవ విధాల సుమగంధ సువాసనలుగా ప్రాణవాయువువలె -
భావంతో జీవించేవాడినని అనంత భావనల సువాసనలు నేనున్న ప్రదేశమున దివ్యగంధాలుగా -

Monday, February 22, 2010

నా దేహము ధైవాలయముగా

నా దేహము ధైవాలయముగా పరమాత్మ తత్వంచే విశ్వాంతరమున ఎదుగుతున్నది -
నాలో ఐక్యమగుటకు ఏరూపములేని స్వభావమైన దివ్యధ్యాన శ్వాసయే చైతన్యముగా -
నన్ను చేరినవారు మరో విశ్వభావనలో అమరధ్యానులుగా నిరంతరాత్మ తన్మయముచే -
శూన్యాంతర కేంద్ర సత్యాన్వేషణలో మర్మముగా మాణిక్యమువలె కాంతి స్వరూపాలుగానే -

గాలితో మరోగాలి వేరేగాలికై

గాలితో మరోగాలి వేరేగాలికై మరగాలిలా గాలించెను భూగోళమున
వేరేగాలి గిలిగింతగా గోలగా గంగతో గేలిగా గంగాలయమున
గాలాడక గంగ గంగి గోవుల గళమున గలగలమని ఘల్లుఘల్లున
చలిగాలికై గంగాధర గంగను శిరగంగా గోకుళమున గోవులతో

Sunday, February 21, 2010

లలిత తల్లి తాళినే తలచగా

లలిత తల్లి తాళినే తలచగా తొలిసారి తల త్రుల్లెనటా
లలిత తలుపుకున్న తాళం తీసి తైలమును తల్లికిచ్చే
తైలంతో తల్లి తళుక్కున తేలిపోగా తిలక్ లలితకు తాళికట్టే
తిలకం తలంబ్రాలతో తెల్లనితేటగా లలిత తలతలమనేను

ధైర్యమున ధోరణి దరహాసంలా

ధైర్యమున ధోరణి దరహాసంలా ధరణి
దొర ధరణిని ధరకై గోదారివైపే
దారిలో ధీరేంద్ర ధీరుడిలా ధర్మముగా
గంధర్వ ద్వారమున ధీరేంద్ర ధరణిని అర్ధాంగిగా ధరించెను

Saturday, February 20, 2010

* ఆత్మ - ఆరు "ఎరుక" లు

ఆత్మ : కనిపించని శక్తివంతమైన విశ్వ వాయువు : ఈ వాయువు ఆత్మగా యే అణువులలోనైనా చేరగలదు -
ఈ విశ్వశక్తి ప్రాణ వాయువుగా తల్లి ద్వార శిశువులో చేరి జీవంగా మారుతుంది -
ప్రతి అణువు పరమాణువులో సూక్ష్మ కణములలో జీవులలో ప్రకృతి రూపాలలో ఆత్మలుగానే వివిధ ఆకార రకాల స్వభావాలతో -
శిశువులో ఆత్మ చేరిన తర్వాతనే శ్వాస మొదలవుతుంది అలాగే ఇతర జీవులలో -
శ్వాస ఆగిన తర్వాతనే మరణం చెంది ఆత్మ శరీరాన్ని వదిలి మరల జీవముగా కొత్త శిశువులో ప్రవేశించుటకు ప్రయత్నిస్తుంది -
ఆత్మ శరీరాన్ని వదిలిన తర్వాత (పరమాత్మ నుండి) విశ్వ శక్తిని పొంది మరల ఆత్మ ఎరుకగా మరో శిశువులో ప్రవేశిస్తుంది లేనిచో ప్రవేశించదు (విశ్వ శక్తియే ఆత్మ ఎరుక) -
ఆత్మ ఎరుక తోనే శ్వాస మొదలవుతుంది -

-----
ఆరు "ఎరుక" లు
విశ్వ/ప్రకృతి ఎరుక (సృష్టిలోనే మొదటి ఎరుక) : "క్షణం - అంతా తెలిసిపోయేనా" చదవండి (జనవరి 2010) -
ప్రకృతి ప్రభావాలుగా చలి ఎండ వాన గాలి కలిగేది ప్రకృతి ఎరుక తోనే -
ఆత్మ ఎరుక : మన శరీరము ఆత్మతో కూడి శ్వాసను కలిగించేది (గత జన్మ ప్రభావాలు గుర్తుకు వచ్చేది దీని వలెనే) -
ముఖ్య/ప్రథమ ఎరుక : ప్రతి జీవి మానవుడు ఆలోచించేది అర్థం చేసుకోవడం దీని వలెనే ("మేధస్సు ఎలా పనిచేస్తుంది" : చదవండి) -
ద్వితీయ ఎరుక : కలలు వచ్చేది దీని వలనే (చదవండి : "కల" ల లోకం ఎక్కడ?) -
మహా/ధ్యాస ఎరుక : చాలా గొప్పదైన దివ్యమైన ఎరుక ధ్యానమున కలిగేది
ఆరవ ఎరుక : దూరసృష్టి ముందుచూపు కలిగినది (అనుభవము అవగాహన సమయాలోచన ఏకాగ్రత కార్యస్థితిలో కలిగేది) -

* ఆహారం ఎందుకు?

శిశువుగా తల్లి కడుపున తొమ్మిది నెలల తర్వాత అన్ని అవయవాల భాగాలతో శరీరం పూర్తి నిర్మాణమైన తర్వాతనే తల్లి శ్వాస ద్వారా విశ్వశక్తి శిశువుకు చేరుతుంది -
తల్లి ఆత్మ ధ్యాసలో(తెలియని ధ్యాన స్థితిలో) ఉన్నప్పుడే విశ్వశక్తి మరో ఆత్మగా శిశువులో చేరి శ్వాసగా జీవమై శరీరానికి చలనం కలుగుతుంది -
విశ్వశక్తి అనేది పరమాత్మ యొక్క "రూపం లేని వాయుశక్తి" /"ప్రాణ వాయువు" -
తల్లి శ్వాసతో శిశువు ఆత్మకు ఎరుక కలిగినప్పుడే శ్వాస నాభి స్థానము నుండి నాసికము వరకు మొదలవుతుంది ప్రాణవాయువులా -
మొదటి శ్వాసతో అన్ని భాగాలకు స్పర్శతో చలనం ఏర్పడి అవయవాలు పని చేయడం ప్రారంభిస్తాయి -
అవయవాలు శ్వాస ఉన్నంతవరకు పని చేస్తూనే ఉంటాయి -
ఎప్పుడైతే శరీరం ఎక్కువగా కదులుతుందో ఆ సమయాన శరీరంలో శక్తి తగ్గి ఆకలి వేస్తుంది కనుక ఆహరం అవసరం అలాగే ఎక్కువగా కదలడానికి ఎదగడానికి పని చేయడానికి రోజు తినవలసి వస్తుంది -
ఎప్పుడైతే ఆహారం తీసుకోలేకపోతామో శరీరం శక్తి లేక ఉత్తేజము లేక మేధస్సు సరిగా పని చేయక క్రమంగా లీనమై నశిస్తూ అనారోగ్యంగా మారుతుంది -
ప్రతి రోజు అవసరమైన పరిణామంలో సరైనా సమయాలలో ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా ఉల్లాసంగా పనులు చేసుకుంటూ జీవించగల్గుతాం -

రాజైనా రోజాయైనా రోజూ

రాజైనా రోజాయైనా రోజూ "రోజా"తోనే
రోజాయే రాజుకై రోజూ "రోజా" తో
రంజాన్ రోజున రాజుకైనా "రోజా"లేక
రారాజు "రోజా"ను రాజుకై రజాక్ తో
ఏరోజైనా రాజైనా రోజాయైనా రోజూ "రోజా"తోనే
రాజు రోజా రోజూ "రోజా"తోనే రోజంతా
ఒకరోజు రాజా రోజాకు రాజేశ్వరి "రోజా"లా
రాజేశ్వరికైనా ఓరోజూ రాజేంద్ర "రోజా"తోనే
ఏరోజైనా "రోజా"తోనే ఓరోజు రాజ్యమంతా
"రోజా"లేని రాజు ఆ రోజు రాజాస్తాన్ లో నిరాజనంతో

* "కల" ల లోకం ఎక్కడ?

నిద్రలో చూడగలుగుతున్న వాటిని ఆధారంగా చేసుకొని మనకు తెలియకుండా మన ప్రమేయమ లేకుండా వస్తున్నాయి కనుక వీటిని కల గా భావిస్తాం -
కల లు వివిధ రకాలుగా కనబడేవి వినబడేవి కనపడినా వినపడనట్లుగా వినపడినా కనబడనట్లుగా చిత్రములుగా ఎన్నో విధాలుగా భయంకరంగా కూడా కలుగుతాయి -
నేడు మనం చూస్తున్న సాంకేతిక యంత్రముల వలె మనకు కలలు వస్తుంటాయి అందులో కొన్ని గుర్తుంటాయి కొన్నింటిని మరచిపోతాం మరికొన్ని తెలిసినట్టే జరుగుతున్నట్టే ఉంటాయి -
కల ల లోకం మన కంటి రెప్ప వెనుకనే ఉంది ఎందుకనగా మనం కళ్ళు మూసినప్పుడే మన కంటి రెప్ప కంటికి ఎదురుగా లోపలి భాగాన ఉంటుంది కంటిరెప్ప ఒక తెర లా చిత్రాలకై -
కళ్ళు మూసినప్పుడు మనం చూసేది చీకటిని : చీకటిలేకపోతే మనకు నిద్ర రావడం కష్టం : చీకటితోనే మనం కల ల లోకానికి వెళ్ళినట్టే : చీకటిని ఎక్కువ సేపు చూస్తే తెర మొదలవుతుంది -


కల ల లోకం ఎందుకు కంటి రెప్ప వెనుక ఉందంటే రెప్ప తెరవగా కల మాయమగునే వెంటనే నిద్ర ఆగిపోవునే కనుక రెప్ప వెనుకనే కల ల లోకం -
మన మేధస్సున ముఖ్యంగా మూడు రకాల ఎరుకలు ఉన్నాయి ప్రథమ ద్వితీయ ఆరవ : మనం ఆలోచించే తీరును ప్రథమ ఎరుక పనిచేస్తుంది : నిద్రించేటప్పుడు ద్వితీయ ఎరుక పనిచేస్తుంది -
నిద్రించే సమయంలో ప్రథమ ఎరుక నిదానముగా/తక్కువగా ఆలోచించడంవల్ల విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా దాని స్థితి మారుతూ ద్వితీయ ఎరుక ఆలోచించడం మొదలుపెడుతుంది -
ద్వితీయ ఎరుక మనం పగలు ఆలోచించిన వాటిని తిరగేసి మనం ఏవైతే మరల చేయాలనుకున్న పనులను గుర్తు చేసేలా చేస్తుంది అలాగే ప్రథమ ఎరుకకు ఉత్తేజాన్ని కల్పిస్తుంది -

మనకు తెలియని వాటిని కూడా ఆలోచిస్తూ అలాగే గతంలో ఆలోచించిన వాటిని మన మేధస్సున దాగిన సమాచారాన్ని వివిధరకాలుగా ఆలోచిస్తూ మనకు కలగా ఏదో తెలపటానికి ప్రయత్నిస్తుంది -
గత జన్మలకు సంభందించిన వాటిని కూడా ఆలోచిస్తూ మన ఊహకు అందని వాటిని కూడా ఎన్నిటినో ఆలోచిస్తూ వివిధరకాలుగా ద్వితీయ ఎరుక నిద్రలో పని చేస్తూనే ఉంటుంది -
మనయొక్క తత్వంను బట్టి మనఆలోచనల తీరును బట్టి మనయొక్క పనితీరును బట్టి మన ఉద్దేశ్యాలకు తగినట్లుగా ఆలోచిస్తూనే మనల్ని నిద్రింపజేస్తుంది -
మనం నిర్ణయించుకున్నవి సాధించవలసినవి వృత్తి రిత్యా చేయవలసిన పనులను కూడా వివిధ రకాలుగా ద్వితీయ ఎరుకకు అర్థమైన భాషలో తెలుపుతుంటుంది -
కొందరు నిద్రావస్థలో లేచి నడుస్తూ ఉంటారు ఆ సమయాన ద్వితీయ ఎరుక పనిచేస్తూనే ఉంటుంది ప్రథమ ఎరుకకు మెలకువ రాక ఒక ఆలోచన ద్వారా మనల్ని నిద్ర నుంచి లేపేస్తుంది -
మనం లేచిన వెంటనే ద్వితీయ ఎరుకను ఆపితేగాని ప్రథమ ఎరుక యొక్క ఆలోచనలను గమనించలేము ఉత్తేజముగా ఏ పనిని మొదలుపెట్టలేము ఇది మన ఆలోచనల తీరుపైననే ఆధారపడి ఉంటుంది -

కొందరు నిద్రలో అరుస్తూ లేదా తమలో తామే మాట్లాడుతూ లేదా తిడుతూ ఉంటారు కొందరైతే పల్లు కొరుకుతుంటారు -
ఇదంతా ఆ రోజు గడిచిన విధానంలో ఒత్తుగా పలికిన పదాలుగా, పదే పదే పలికిన పదాలుగా, చాలా సార్లు వాడిన పదాలుగా, ఆవేశంగా మాట్లాడిన పదాలుగా వివిధ రకాలుగా -
వీటినన్నింటిని ద్వితీయ ఎరుకయే చేస్తుంది ఇవన్నీ మనలో దాగిన స్వభావాలే : మనకు తెలియని స్వభావాలు మనలోనే ఎన్నెన్నో : కొన్ని మనకు తెలియకుండా వివిధ పనుల స్థితిని బట్టి వస్తుంటాయి -
ఒక రోజు నిద్రలో ఎన్నో రకాల కలలు ఎన్నో విధాల వస్తుంటాయి కొన్ని గుర్తుంటాయి కొన్ని వచ్చినట్టే ఉండవు కొన్ని మరచి పోయినట్టే ఉంటాయి ఇలా కొన్ని క్షణాలలో నిమిషాలలో గంటలలో లెక్కలేనన్ని -
కలలు ఎందుకు ఎలా ఆగిపోతాయి (ద్వితియ ఎరుక స్వభావం) :-
మనం ఒక ఆసనంలో ఎక్కువ సమయం నిద్రించడం వల్ల నొప్పి కలిగి కదలడం వలన ఆగిపోతాయి -
భయంకరమైన కలలు రావడం వలన మనం వాటిని చూడలేకపోతే ఆగిపోవడం -
మనకు దాహమైనా ఆకలి వేసినా లేదా కాల కృత్యములకై లేచిన లేదా ఏదైనా గుర్తుకు రావడం వలన -
ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడం వలన లేదా మన ప్రదేశాన ఏదైనా శబ్దం వినిపించడం వలన లేదా ఎవరైనా పిలవడమో లేపడమో -
నిద్రా సమయం పూర్తి కావడం వలన మనం లేచి పోవుటలో మెలకువ రావటం వలన -
మనం ఆలోచించే విధానానికి సరైనా ఆలోచనలు రాకపోయినా కలలకు సరైన సమాచారం అందక ఆగిపోతాయి (కలలు త్వరగా వస్తుంటాయి కనుక ఆలోచనల వేగం ఎక్కువగా ఉండాలి ) -
-----
కలలు ఆటగా పాటగా ఆటపాటగా నటనగా చిత్రంగా చిత్రాలుగా మాటగా వివిధ రకాలుగా ఎలాగైనా ఉంటాయి వస్తాయి -
మనం ఊహించి చూసే చిత్రము కూడా ద్వితియ ఎరుక స్వభావముగా నిద్రలోనైనా పగలైనా (మనకు కొన్ని అర్థం కావడానికి ఊహించి చూసుకుంటాం నేర్చుకునేటప్పుడు : కంటిరెప్ప వెనుక తెర లోనే) -
ఆరవ ఎరుక ముందుచూపు లేదా దూరదృష్టి ని తెలిపే స్వభావంతో ఉంటుంది ఒక్కోసారి తొందరగా ఏదైనా గుర్తు పట్టేస్తుంది లేదా తెలుపుతుంది గ్రహిస్తుంది -

మేధస్సున ఆత్రేయ(చురుకుదనం) వివేకము వలన ఆరవ ఎరుక స్వభావాన్ని కలిగిఉంటుంది -

Friday, February 19, 2010

* మేధస్సు ఎలా పని చేస్తుంది

మేధస్సు ఎలా పని చేస్తుంది :- ఆలోచనలతో మేధస్సు ఎలా పని చేస్తుంది -
మూడు ఆలోచనలు ఒకేసారి పధ్ధతి ప్రకారంగా పని చేస్తాయి -
ఒకే క్షణానికి మూడు ఆలోచనలు అలా ప్రతి క్షణము పని చేస్తూనే ఉంటాయి -
మూడు ఆలోచనలు క్రమముగా/వరుసగా పనిచేస్తేనే అర్థం లేదా సందేహముగా -
-----
మొదటి ఆలోచన ముందుకు వెళ్లి పోతుంటుంది ఏం జరుగుతుందో తెలుసుకుంటూ (ముందుకు వెళ్ళిపోతుంది) -
రెండవ ఆలోచన జరిగిన దానిని మరిచిపోతుంటుంది (మరచిపోతుంది) -
మూడవ ఆలోచన మరిచిపోతున్న దానిని గుర్తు పెట్టుకుంటుంది కొంత కాలం వరకు (గుర్తు పెట్టుకుంటుంది) -
-----
ఈ మూడు ఆలోచనలు క్షణానికి లేదా క్షణముకన్నా తక్కువ సమయంలో పని చేస్తుంటాయి -
ప్రతి పనిని ఈ మూడు ఆలోచనలు క్రమముగా పని చేస్తేనే మనకు ఏదైనా అర్థం అవుతుంది లేదంటే అర్థం కాక జరిగిందేదో గుర్తుకురాక మరిచిపోతుంటాం -
దేనినైతే అర్థం చేసుకుంటామో అది గుర్తుండిపోయి మనకు జ్ఞానంగా మన మేధస్సు "ఎరుక" ను గ్రహిస్తుంది -
ఎరుక ఎన్నిటినో అర్థం చేసుకుంటూ ఎన్నిటినో గుర్తు పెట్టుకుంటూ మేధస్సును విజ్ఞానవంతంగా వివేకంగా చేసుకుంటుంది -
ఎరుక ద్వారా మనం చాలా కాలంగా ఎన్నిటినో గుర్తు పెట్టుకుంటాం మరచిపోకుండా -
ఒక క్షణానికి మనలో కొన్ని వేల పనులు ఆలోచనలుగా జరిగిపోతూనే ఉంటాయి -
మనకు అర్థమైనవి గుర్తుండిపోయేవి తెలిసినవి గ్రహించేవి అన్ని ఎరుకగా పైన తెలిపిన మూడు ఆలోచనల క్రమం ద్వారానే -
మరచి పోయే వాటిని కొన్నింటిని మనం అర్థమయ్యే వరకు మరల ఆలోచిస్తూనే ఉంటాం ఈ మూడు ఆలోచనల క్రమం విధానం ద్వారానే -
ఈ మూడు ఆలోచనల వరుస క్రమం పనితీరు ఎకాగ్రతతోనే జరుగుతుంది (ఏకాగ్రతకు కూడా : సాధన ద్వారా) -
ఏవైతే ఎక్కువ సార్లు జ్ఞాపకం తెచ్చుకుంటామో అవి చాలా కాలంగా గుర్తుండిపోతాయి -
ఎరుక అంటే మూడు ఆలోచనల క్రమాన్ని వేగంగా సమర్ధవంతంగా పని చేయించడం (పని అంటే ఆలోచించడమే ) -
ప్రతి పనికి మూడు ఆలోచనల క్రమాన్ని ఎరుకయే కలిగిస్తుంది : యిలా చేస్తేనే మేధస్సు ఉత్తేజంగా ఉంటుంది -
క్షణానికి మనలో కలిగే లక్ష ఆలోచనలలో కొన్ని వేల ఆలోచనలను ఎరుక గ్రహించి పని చేయించగలుగుతుంది (వివిధ రకాల పనులను) -
మన శరీరంలో ప్రతి అణువు కణం అవయవాల పని తీరు మరియు మనం ఆలోచించే ఆలోచనలను సైతం ఎరుకయే క్షణానికి వేల పనులుగా -
మనం ఒక పనిని ఆలోచించేటప్పుడు మన చుట్టూ జరిగిన సంఘటనల ద్వారా మన ధ్యాస వాటి మీద మరలి మళ్ళీ మనం చేసే పనిపైననే -
ఇక్కడ చేసే పని మీద మూడు ఆలోచనలు మళ్ళీ ఇతర సంఘటన ద్వారా ధ్యాస మరలిన వాటి మీద మూడు ఆలోచనలు గా ప్రతి పని మీద -
ప్రతి పని మీద మూడు ఆలోచనలుగానే ఆలోచిస్తూ ప్రతీది అర్థం చేసుకొనుటకు ప్రయత్నిస్తూ క్షణానికి ఎన్ని ఆలోచనలో ఎరుకకు -
ఎరుక పని తీరు పైననే మన మేధాశక్తి జ్ఞాన విజ్ఞానం ఆధారపడివుంటుంది అలాగే ఎంత కాలమైనా తెలుసుకుంటూనే ఎంతైనా ఎంతటిదైనా -
ఉదాహరణ : ఒక విద్యార్ధి తన తరగతి గదిలో ఎలా ఎన్ని ఆలోచనలతో తన మేధస్సును మెరుగు పరుచుకోగలడు -
వినడం చదవడం చూడడం అర్థం చేసుకోవడం గుర్తు పెట్టుకోవడం వ్రాసుకోవడం వీటితోపాటు చుట్టూ జరిగే వాటిని గమనించడం -
చూట్టూ జరిగే వాటిపైన గమనమనగా బయట గంట మ్రోగిన తెలుసుకోవడం ఇలా అన్నిటిని మూడు ఆలోచనలతోనే ఎరుకతో వేగంగా ఆలోచింపచేసుకోవడం -
ఏ ఒక్క దాని మీద మూడు ఆలోచనల క్రమం లేకున్నా అర్థం కాకపోవడం సమస్యగా ఎన్నో మన మేధస్సులోనే -
మరో ఉదాహరణ : "వినాయక" ను అక్షరాలుగా పదాన్ని చదవండి -
"వి" అని మొదటి ఆలోచనతో చదివి మరిచిపోయిన తర్వాతనే "నా" అనే అక్షరాన్ని చదవగలం -
"వి" ని రెండవ ఆలోచనగా మరిచిపోతాం కనుకనే మూడవ ఆలోచనతో గుర్తుపెట్టుకోగాలుగుతాం -
అలా "నా" ను చదివి అదేవిధంగా "యక" చదవగలం లేదంటే మొదటి అక్షరంలోనే ఉంటాం -
ఈ విధానం ఒక క్షణంలోనే జరుగుతుంది కనుక మీరు సరిగా ఈ మూడు ఆలోచనల క్రమాన్ని గుర్తించలేకపోవచ్చు -
ఈ విధానాన్ని గుర్తించగల్గితే నే తెలిపిన దానిలో సందేహము లేదు -
సూచన : ఒక చిన్న పాప జన్మించిన తర్వాత మేధస్సు విధానమున ఎరుక ను గ్రహించుటకు ఒక సంవత్సరం పట్టవచ్చు -
మూడు ఆలోచనల క్రమ విధానాన్ని ఆలోచనలుగా అర్థం చేసుకుంటూ మననం చేసుకుంటూ ఎరుకను గ్రహించాలి -
ఆలోచనల క్రమవిధానం లేకపోతే ఏది అర్థం కాదు : మనం పలికిన వాటినే పలుకుతూ గుర్తు పెట్టుకుంటూ జ్ఞానంగా ఎదగగల్గుతారు -

వేళ్ళతో వెళ్ళు వెళ్ళమని వేలెత్తి

వేళ్ళతో వెళ్ళు వెళ్ళమని వేలెత్తి వెళ్ళమని
వాలుగా వేలెత్తిన వాళ్ళు వెళ్ళమని వేళ్ళతోనే
వేలసార్లు వేళ్ళతోనే వెళ్ళమన్నా వాళ్ళు వెళ్ళమనే
వేలసార్లు వేలెత్తక వెళ్ళమనగా వాళ్ళు వెళ్లి పోయెనే
వాళ్ళు వెళ్ళగా వేళ్ళు వాలగా వాళ్ళులేక వేళ్ళుపోయే
వేళ్ళకై వేలుపోయే వాళ్ళుపోయే వేళ్ళుపోయే
వెళ్లకపోయినా వేల్లెత్తకు వెళ్ళమని వెళ్లిపోతావ్

వెన్నెల వానలో వన్నెల వాణి

వెన్నెల వానలో వన్నెల వాణి వేణువుగా
వీణేశ్వరి వీణతో వాననే వణికించగా
వీణల వాణిలో వెన్నముక వైనముగా
వెన్న వెనుకనే వెనువెనకనే వనముగా
వానలో వీణ వీణతో వేణువు ఓంనమః

మొలకతో మల్లె మల్లెగా

మొలకతో మల్లె మల్లెగా మల్లెల మల్లెలుగా
మల్లెలు మాలగా మౌలీకముగా మల్లెలతోనే
మల్లెల మాలయే మైళ్ళుగా మల్లెలుగా
మల్లెల మాలతో మల్లికా మల్లీయముగా
మళ్ళీ మల్లెల మాలతో మల్లీశ్వరిగా
మల్లెలే మేలుగా ముళ్ళలోనైనా మాలతిగా
మల్లెల మాలగా మాలతితో మల్లికార్జునకే

విశ్వమంతా అణు పరమాణువుల వేద సిద్ధాంతములు

విశ్వమంతా అణు పరమాణువుల వేద సిద్ధాంతములు
అణువుల స్వభావ తత్వాల పరమాణువుల ప్రక్రియలు
ప్రతి అణువున ఆత్మ స్వభావాల వివిధ పరమాణువులు
పరమాణువుల అణు స్వభావాలే వివిధ శాస్త్రీయములు
శాస్త్రీయముల విజ్ఞానము నేటి ఆలోచనల విధానములు
విజ్ఞాన శాస్త్రీయ సిద్ధాంతాలు అణు పరమాణు స్వభావాలు 

కవితో కవిగా కవినై

కవితో కవిగా కవినై కవి కవితతో కవితనై
కవితలతోనే కవులను కోవెలలో కవలించి
కవిగా కావాలని కవులతో కవితలను కవ్వించి
కవినై కవితలతో కెవ్వున కవులచే కవిత కావ్ వని
కవులకు కవితలే కవిగా కవికవితగా వికటకవిగా

Thursday, February 18, 2010

వాదనతో ఆవేదన వేదమై

వాదనతో ఆవేదన వేదమై వేదాంతముగా
వాదోప వేదనలు వేదాలుగా వేధతత్వములై
వేధించే వేధనకూడా వాదోప వేదనల వేదమే
వాదించే వేదనను వేదాంతముగానే వేదములో
వివేధములైనా వేదాంతములోనే వేదాలుగా
వాధనైనా వేదనైనా వివిధమైనా వేదాలుగా వేదంలోనే

కాలం కలలుగా కలకాలం కాలమై

కాలం కలలుగా కలకాలం కాలమై
కలలుగానే కాలం కలగా కలికాలమై
కాలి కాలి కాలిపోతూ కలగా కాలిపోవాలనే
ఆకాలమున కలగా కలిగే కాలమును కాలంగా కలేనా
కలలోనైనా కాలం కల కాదని కలియుగంగా కాలముగానే కాలంతో

ప్రతి జీవిని ప్రకృతిని ప్రశాంతంగా

ప్రతి జీవిని ప్రకృతిని ప్రశాంతంగా ప్రతి క్షణం జీవింప జేస్తే కర్మ శూన్యముగానే
నీలోని కర్మ అధికమగుట వల్ల సమస్యలెన్నో ప్రశాంతత లేక అత్యాశ గానే
ఆధ్యాత్మిక భావనలు నీలో లేక ప్రతి జీవి సుఖానికే నని తెలియక అజ్ఞానమే
ఎంతగా ఎదిగిన నీవే కర్మతో జీవిస్తే మిగతా జీవుల కర్మ ఎప్పటికి తరుగును
నీ కర్మ వల్ల మరో జీవి మరో కర్మను చేసి కర్మలుగానే పెంచుకుంటూ పోతే
కర్మలతో జీవిస్తూనే "కర్మ" యుగంగా మార్చేస్తున్నారు నేటి "కలి" యుగాన్ని
ప్రతి క్షణాన్ని ఆలోచిస్తూ భావన స్వభావముతో జీవించుటకు ప్రయత్నించండి
కర్మలను క్రమముగా తగిస్తూ ప్రతి జీవిని ప్రశాంతముగా జేవింపజేస్తే శూన్యముగా

ఏ క్షణమైనా మరల రాదని

ఏ క్షణమైనా మరల రాదని మరో క్షణమునే అడిగినా తను నేను ఆ క్షణమును కాదనే
రాబోయే ఏ క్షణమును అడిగినా ఆ క్షణమును నేను కాదని ఆ క్షణమే మరల రాదనే
ఏ క్షణమును చూసినా ఆ క్షణములాగే అంతే సమయంతో ప్రతి క్షణము ఆ క్షణమనే
మరల రాని క్షణముకై మరో క్షణమును దాని కన్నా గొప్పగా ఉపయోగించుకోవాలనే

పదము పదముగా పదమై

పదము పదముగా పదమై పదముతో పదాలుగా
పదమే పదాలుగా పదాలెన్నో పదముగానే పదాలై
పదము పదముగానే పదమై పదాలెన్నైనా పదమేనని
పదముతో పదము పదములా పదాలుగా పదమే పదం

Wednesday, February 17, 2010

ఏది తెలిపినా విశ్వమే నాలో

ఏది తెలిపినా విశ్వమే నాలో నుండి పలుకుతుందని
తెలుపాలని లేకున్నా తనకు తానే తెలుపుతున్నది
నాకు తెలియాలని తానూ తెలుసుకోవాలని ఎందరికో
నాలో నుండి తెలుపుతూ విజ్ఞానాన్ని పంచుతున్నది

Monday, February 15, 2010

ఇది ఒక ఆలోచనయేనా

ఇది ఒక ఆలోచనయేనా హో! వినపడిందా అనిపించిందా తెలిసిందా గుర్తించానా
తెలియబోతుందా జరుగుతుందా జరిగిందా ఎలా కలిగింది నాలో కలనా
పలికారా పలకబోతున్నారా చెబుతున్నారా చెప్పారా ఎక్కడి నుండి వచ్చింది
నాలో నేనే అనుకున్నానా నాకు మాత్రమే వినిపించిందా లేదా ఆలోచనగా కలిగినదా

* My Mind

No one can determine my Mind because I get knowledge from Universe by different way of thinking -
Deternination of knowledge is various in different way of thinking according to research an Universe -
The observation of Universe gives some minute points so I think everytime to get innovative points -
Whenever the mind gets wonderful points so I think forever to get minute point for guess something -
The flow of thoughts just like water falls to get something each and every second for catch the points -
The intention of thoughts are infinity in my mind, that's why I will express wonders in different way always -

"My Mind is extranet it connects with infinity internets, it searches from universal outernets and make sure by brilliant persons for knowledge to the people(I have to use by Intanet)" -

మహా తత్వ విజ్ఞానమును

మహా తత్వ విజ్ఞానమును భోధిస్తూ గుణాక్షర సత్యాలతో లిఖిస్తున్నారు
ఆనాటి కాల యుగాన దాగిన జీవన శాస్త్రీయములను పరిశోధిస్తున్నారు
గుణగణాలచే కూడిన వేద సారాంశాన్ని వివిధ గ్రంథాలలో అన్వేషిస్తున్నారు
ప్రతి మానవుడు నేటినుండి మహాతత్వవేత్తగా విజ్ఞానమేధస్సుతో జేవించాలనే
అర్థం పరమార్ధంతో అక్షర సత్యాన్ని అవగాహన కలిగేలా లిఖించగల్గుతున్నారు

Sunday, February 14, 2010

ఆ క్షణాన నేను ఒక్కడినే

ఆ క్షణాన నేను ఒక్కడినే నిలిచానని కలియుగాంతమున తెలిసేనే
ఎందరో కనుమరుగై నా యందే దిక్కులు లేని విధంగా మరణించేనే
నా వారు తెలియని వారు అందరూ నన్ను విడిచిన శ్వాస వారినే వదిలెనే
ఏ జీవిని రక్షించినా మరో జీవిని రక్షించుటలో ఎన్నో జీవులు మరణంతోనే
భయంకరంగా వివిధ ధ్వనులతో భీభత్సం సృష్టిస్తున్న ప్రకృతి ప్రశాంతమైనది
అడుగులు వేయటానికి కూడా లేకున్నా ఎవరైనా ఉన్నారా అని పలుకుతున్నా
నిలిచిన చోటే నిలిచి చీకటిలో నిరాశగా నిద్రిస్తూ మరో ఆశతో రేపటి సూర్యోదయానికే
నా చుట్టూ ఉన్న ప్రాంతం గట్టి పడేంతవరకు రోజులుగా వేచి అడుగులతో సాగిపోయా
ఏ జీవి లేక నా జీవం ఎదురు చూస్తున్నది ఒంటరిగా కొత్త చిగురుకై ఆహారముగా
మరో యుగం ఆరంభం వరకు నే ఒంటరిగా జీవిస్తూనే ఉన్నా ఒక యోగిగా మరో జీవిగా

A second silently stops - కలియుగాంతమున నిలిచిపోయింది

A second silently stops at the end of "Kali Yuga"
No one is there, atleast atom of place also not
The feel also wonder to think atleast, nothing
The dark is also too magic, without secret
Even second also not known because second also not completed
-----

కలియుగాంతమున నిలిచిపోయింది మౌనంగా ఒక క్షణం
ఎవరూ లేరు ఏది లేదు అణువంత ప్రదేశ మైనను లేదు
వింతగా తలుచుటకు భావమైనను ఎలాగైనను లేనే లేదు
చీకటిని కూడా మాయం చేసి మర్మము కూడా లేకుండా
ఆగిన క్షణానికి కూడా తెలియకుండా క్షణం అంతం కాకుండానే

ప్రతి ఒక్కరు ఆధ్యాత్మికంగా

ప్రతి ఒక్కరు ఆధ్యాత్మికంగా ఎదగలేనంత వరకు సమాజంలో వింత సంఘటనలే
ఆధ్యాత్మికము లేని చోట ప్రాపాంచికము తీరని సమస్యలతో విచార అనర్థాలుగా
అర్థంకాని జీవిత సత్యాలను తెలియని విధంగా ఆశల తీరులలో వ్యర్థపు ఆలోచనలే
ప్రతి ఒక్కరికి తెలియని జీవిత సత్యము భోధించుటకు కూడా అర్థంకాని విధంగానే
విజ్ఞాన గ్రంథాల వేద సారాంశాన్ని పటనం చేసి ఆధ్యాత్మికంగా ఎదుగుటకు కదలండి

అజ్ఞానంతో సాగలేను

అజ్ఞానంతో సాగలేను నేటి కాలమున విజ్ఞానులతో
నేర్చుకుంటూనే జ్ఞానంతో ఎదుగుతూ అందరితో
అనుభవముగా ఎదిగిననాడే నేను విజ్ఞానులతో సమముగా
ఏదైనను ఇంకను అర్థం చేసుకుంటూనే విశ్వ విజ్ఞానముకై

Saturday, February 13, 2010

ఎవరు ఎన్ని తెలిపినను

ఎవరు ఎన్ని తెలిపినను ఏది తెలిపినను అర్థమైతే ఆచరణ లేదే
ఒక సత్య భావననైనను మనసులో విజ్ఞానపరిచితే విశ్వ భీజమే
విశ్వభీజమును శ్వాసతో గమనిస్తే మరెన్నో విశ్వభావములు ఎదిగే
అనంత భావములలో ఒక భావనను నిరంతరం ధ్యానింపజేయగా
అమర విజ్ఞానము నీలో అఖండమై నిరంతర్యానంత సత్యజ్యోతిగా

ఎన్నో తెలిపాను విజ్ఞానముగా

ఎన్నో తెలిపాను విజ్ఞానముగా మరల ఏది తెలిపినా ఒకే విధముగానే
సృష్టిలో ఉన్న వాళ్ళందరికి అజ్ఞానము తొలిగే వరకు సత్యం ఒకలాగే
ఎన్ని భోధనలు విన్నా సరైన ప్రణాళిక మనలో లేదా విజ్ఞానమున లేకనే వేరుగా
క్రమముగా ఒక అర్థాన్ని కలిగించే విజ్ఞాన విధానమును ఎవరు వివరించగలరు
ఎందరో ఎన్ని విధాలుగా తెలిపినను విజ్ఞానమున సత్య భావన ఒకటే

నేడు మనకు తెలిసిన

నేడు మనకు తెలిసిన కాల గడియములు కార్యములు సాగుటకే
నేను నేటి కాలమును ఆచరించిన ఆలోచనకై విశ్వ కాలమే
విశ్వకాలమున సాగుతూ గతమున ప్రయాణించి విజ్ఞానమునే గ్రహించగా
భావనలు శూన్యమును చేరి మొదటి క్షణముతో మరల విశ్వకాలముగా నేటి వరకు

మరల తెలుపలేను

మరల తెలుపలేను మరోజన్మ ఉన్నా కార్యములు ఎన్నో వేరే విధముగా
నేడు తెలిపిన దానినే అవగాహన చేసుకొనే పరిశీలించండి సూక్ష్మముగా
ఎవరు తెలిపిన విజ్ఞానమును గ్రహించి సత్యాన్ని తెలుసుకోండి
సత్యాన్ని పాటించగల్గితే ఆచరణతో మరెన్నో భావములు కలుగునే

నన్ను ఎవరైనా నీవు ఎవరివి

నన్ను ఎవరైనా నీవు ఎవరివి అని అడిగితే ఏమని చెప్పగలను
శూన్యం నుండి నేటి వరకు తెలిసిన వాడినని తెలిపెదనా
భావనతో మొదలైన ఆలోచనను నేనే అని తెలుపవలెనా
అణువణువునా స్వభావ ప్రభావమును గమనించిన వాడిని నేనేనని

Friday, February 12, 2010

* How Nature starts in universe

How Nature starts in universe -
Before knowing this you read the topic "Second - Everything knows" for understood the base -
"Magical Wonderful Secret Power" : zero world (void) : from first second originates intention : intention with different expressions(thoughts) -
Different thoughts having different kind of characters, properties, adjectives and so many -
The analysis of thoughts in different ways to get something and understanding with so many views, directions, variations to search thought by thought and compare within then finally identification of thoughts got the "Sense" as confidence by procedure -
Sense means it can't forget and it knows everything and also intention(expressions of thoughts their actions) of feelings in anytime and with identification also -
Whenever sense to create something it wants power and also soul because that shape having the stability to stand -
Without soul nothing creates, nothing happens -
For great power the sense once closes and starts itself within that period (less than second) to get power through Supreme soul state (Inner feel of meditation) -
The power is nothing but enlightenment of sense, it is an atom(visualization of Supreme soul) of Light/Brightness -
After getting power the sense first creates Place (Universe, Great-Supreme world, Space) -
The place having with so many small atoms and every atom having special kind of activity, intention with characteristics, properties and adjectives of the soul (without atom nothing is there even place also : atom having soul, its need otherwise nothing creates) -
How much space wants to create, it means the sense implementing in all ways of the infinity thoughts by atoms in future also (everything is preplanned) -
For changing the intention(feel) of atom(change the raw state) it requires variation of temperature -
The temperature needed primarily Cool(Moon) and Heat(Sun) -
Here main point is the moon(first) and sun(after moon) created in this period of time (moon and sun also group of atoms) -
Here the moon and sun are created by light/brightness it means the light energy produced by enlightenment of Supreme soul -
The intensity of moon temperature(cool) makes very high in different variations by sense intentions, some atoms starts to change the raw state as air (the air and water intents first starts in this period : first air then change to water) -
The heavy cool of air forms into minute water drops and it finally forms into ice -
After getting ice again change into hard state as solid by heavy cool intensity with different intentions -
The hard solid state becomes/forms into mountains, hills and so., in different places with different shapes -
The intensity of sun temperature(heat) makes very high in different variations by sense intentions, the vibrations(earthquakes, volcanoes) starts making cracks in mountains and hills (The valley's are formed this situation) -
For this vibrations valley's, water falls, caves are formed and also big, small stones, sand particles, pebbles, precious stones, soil, dust and so many ..(by various frictions, blasts) -
The "ice mountains" are melting as water, it flows from ridge to valley and the water catchments are formed as seas, rivers, pond, canals, and so many .. -
The variations of sea shells are formed by so many variations of water actions and inside mineral of sea (this is a variety formation of shells) -
Here according to heat clouds are formed and then started as rains like Tsunami, the heavy rain flow makes soil in different colors(red, black and mixed) in different places -
The soil types are so many like loose soil, hard soil, sandy soil, sand lands(deserts) also -
These types of changes happen by so many frictions in mountains and hills and also water flows (the colors also changes) -
According this situations as a long period the minerals, oil mines and so many formed in various colors -
Here the water flows in different soil layers the raw dust(also raw stones) formed into minerals(different type of mines)by so many frictions and the wastage of liquid forms into oil minerals (here the frictions are happen by flow weight according to temperatures as a long period of time) -
whenever soil and water mixing the atoms are changes as minute seed formation as its growth to form as with roots and small leafs then finally it becomes a plant -
The plants are grown in different types in different ways and form in to forests (area of trees ) -
After formation of trees : micro organisms, insects, birds, animals are developed in different fields (air, water, earth/land) then so many changes happened for a long time -
-----
Some Important points :
The space before it is dark(entire day), after moon and sun the space having half day dark and half day light -
Whenever atoms forms into ice(water drops) the group of atoms weight increases then the mass starts to rotation by gravitational force -
The mass was become as earth, to control the gravitational force the earth is rotating by "moment of force" -
From the moment of force the earth rotation itself, it takes one day time as per observation (the rotation is vertical way, one cycle rotation : one day)-
The mass(ice mountains) contents are different places in different shapes, these also making rotation in different areas and forming into planets -
As per the earth, other planets are not sufficient to live for any living thing because of atoms reaction (if any possible to live, that is also changes of atoms from time) -
According to planets the moon and sun are created before, the energy of stars having more brightness so the stars also created as long time before than moon and sun (as per my intent) -
Here any intent is not good for you, I will be living an atom of thought in your knowledge -

కపాలమున సెగలు రేగే

కపాలమున సెగలు రేగే చలిలో దట్టమైన అరణ్యమున ధ్యానము చేయగా
హిమ బిందువులు జ్ఞాన నాడుల ద్వారా ప్రవహించి మేధస్సునే వణికించగా
సాధనా దీక్షలో మనో దేహమున శరీరముపై అగ్ని సెగలు ఆవిరిగా రాగా
దివ్య తేజస్సుతో మంచు శిఖరము సెలయేరులా నిరంతర విజ్ఞాన ప్రవాహమైనది

నా యందే ప్రతీది

నా యందే ప్రతీది ఉన్నది అలాగే ప్రతిదాని యందు నే ఉన్నాను
నా యందే సృష్టి ఉన్నది అలాగే సృష్టి యందు నే ఉన్నాను
సృష్టితో నే ఎలాగ ఉంటానో నాతో కూడా సృష్టి అలాగే ఉండాలని
నా యందే అందరు ఉన్నారు అలాగే అందరి యందు నే ఉన్నాను
అందరితో నే ఎలాగ ఉంటానో వారు కూడా నా లాగ ఉండాలని

Wednesday, February 10, 2010

నేనే పరమాత్మ అనే భావన

నేనే పరమాత్మ అనే భావన నాలో ఎందుకు కలుగుతుంది పదే పదే ఎందుకు గుర్తొస్తుంది -
నా ఆలోచనలలో దాగినది ఏది నా భావనలలో ఉన్న పరమ సత్యం ఏమిటి ఎందులకు -
ఎంతో తెలుసని భావిస్తున్నందుకా ఎన్నో తెలుసుకోవాలని నిత్యం అలోచిస్తున్నందుకా -
జ్ఞానవిజ్ఞాన విశ్వవిధాత సత్యమునకై అన్వేషిస్తూ పరమాత్మతత్వ భావన నాలో కలిగినందుకా -

Sunday, February 7, 2010

* ప్రకృతిగా పంచభూతములు ఎలా

ప్రకృతిగా పంచభూతములు ఎలా వచ్చెను -
ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే ముందుగా "క్షణం - అంతా తెలిసిపోయేనా" చదివిఉంటె అర్థమవుతుంది -
మర్మము : శూన్యము : మొదటి క్షణముతో భావము : భావమున కలుగు స్వభావములే ఆలోచనలుగా కాలంతో సాగుతూ -
ఆలోచనలలోనే గుణాలు లక్షణాలు విశేషణములు విచక్షణ రూప భావ స్వభావములు ఎన్నో ఎన్నెన్నో అనంతముగా -
ఆలోచన(భావన) స్వభావాలను మార్పులుగా వివిధ రకాలుగా సూక్ష్మముగా అర్థం చేసుకొనుటలో కలిగినదే "ఎరుక" -
"ఎరుక" అంటే అన్ని తెలిసి ఉండడం "మరుపు లేనిది" స్వభావ అర్థాన్ని కలిగి ఉండడం గుర్తించడం (ఆలోచనైనా భావమైనా అణువైనా) ఎప్పటికైనా ఏ క్షణమైనా -
ఎరుక ఏదైనా సృష్టించడానికి ఒక శక్తి కావాలి దానిని తట్టుకోవడానికి ఒక ఆత్మ ఉండాలి లేదంటే ఏది జరగదు నిలబడదు సృస్టించబడదు -
ఎరుక శక్తి కోసం తనకు తానుగా(దానికదే) మరణించి మరల అదే క్షణాన ఉదయించి మహా శక్తిని పరమాత్మ తత్వంతో పొందినది -
ఎరుక ఎప్పుడైతే శక్తిని పొందుతుందో అప్పుడు ఎరుక ఏదైనా సృస్టించ గలదు -
ఎరుక మొదటగా సృష్టించినది "కాంతి"(ఆరా) ఈ కాంతి అణువంతయే : ఇదే పరమాత్మ స్వభావం -
ఈ కాంతి స్వభావముతో కూడిన పరమాత్మ తత్వంతోనే ఏదైనా సృస్టించ గలదు వివిధ ఆత్మలుగా -
కాంతి ద్వారా మొదటగా సృస్టించబడినది ప్రదేశము ( జగతి బ్రంహాండము విశ్వము మహాలోకము అంతరిక్షము ) -
ప్రదేశ మంతయు సూక్ష్మాతి సూక్ష్మమైన అణువులతో ప్రతి అణువుకు ఒక ప్రత్యేకమైన ఆత్మ తో వివిధ స్వభావాలుగా నిర్మితమైనది -
ఆత్మ లేనిచోట ప్రదేశము లేదు కనుకనే ఆత్మ అవసరం ఆత్మ లేకుండా దేనిని సృష్టించలేము -
ఈ ప్రదేశము ఎంత ఉందంటే ఎరుక దాని స్వభావాలను వివిధ రకాలుగా కల్పించుటకు ఎన్ని అణువులు కావాలో అన్ని అణువులు పట్టే ప్రదేశం -
ప్రదేశము కూడా ఎంతో కాలానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడే విధంగా ముందస్తు ప్రణాళిక గా కాలంతో పాటు భవిష్యత్ కార్యాలకు అనుకూలంగా -
ప్రదేశమంతా దాగిఉన్న అణువులకు కొన్ని స్వభావాలతో పాటు రూపాలను కలిగించుటకు కాల ప్రభావ ఉనికిని కొన్ని రకాలుగా కొన్ని సంవత్సరాలుగా కల్పించుకుంది -
"ఉనికి" ని వివిధ రకాలుగా ప్రథమముగా చలి(చంద్రుని ప్రభావంతో) వేడి(సూర్యుని ప్రభావంతో) గా వివిధ ప్రభావాల తీవ్రతతో ప్రదేశములోని అణువుల మీద ప్రయోగించడం జరిగింది -
ఇక్కడ గమనించ వలసిన గొప్ప విషయం ఏమిటంటే సూర్య చంద్రులు ఉదయించిన(ఏర్పడిన) సమయ కాలము ఇక్కడే ఆరంభమైనదని తెలుసుకోవచ్చు -
చలి యొక్క ఉనికిని వివిధ తీవ్రతలతో అత్యధికంగా చేయడం వల్ల గాలి స్వభావము అణువులలో చలనముగా (ఆరంభమై) కలిగి హిమ(నీరు) బిందువులుగా మారుతూ చాల పెద్ద పరిణామాలతో వివిధ రకాలుగా ఆకార రూపాలతో మార్పు చెందుతూ వచ్చాయి -
హిమమును కూడా వివిధ రకాల స్వభావాలతో అతి చలి తీవ్రతతో మహాగట్టిదనముగా ఘనరూపంగా మార్చుటలో రూపాంతరం చెందుతూ పర్వతాలుగా శిఖరాలుగా కొండలుగా ఏర్పడుతూ వచ్చాయి -
వేడి తీవ్రతను వివిధ స్వభావాలతో అత్యధికం చేయడంవల్ల పర్వతాలలో శిఖరాలలో కొండలలో పగుళ్ళు ఏర్పడి లోయలుగా పెద్ద చిన్న రాళ్ళుగా గులకరాళ్లుగా ఇసుక రేణువులు మట్టి ధూళి సూక్ష్మ కణాలు ఇలా ఎన్నెన్నో -
వేడి తీవ్రతకు పర్వతాలలో వివిధ ప్రకంపనాలకు పగుళ్ళు ఏర్పడి లావా జ్వాలలు విజ్రంభించి మంచు కరుగుతూ నీరుగా మారి ఆవిరి అవుతూ మేఘాలుగా ప్రభావం చెంది వర్షాలుగా ప్రభావం చెందాయి -
పగుళ్ళు వివిధ రకాలుగా భూ ప్రకంపనాలు లావా జ్వాలలు వర్ష ప్రభావాలు (వర్షాలు ఆరంభమైన కాలం) ఏర్పడుతూ కొన్ని అణువుల రాపిడిలో మలినములు వివిధ రంగులతో రూపాంతరం చెందుతూ వచ్చాయి -
మలినముల యొక్క ప్రభావాలు చలి వేడి తీవ్రతలో అనేక రకాలుగా స్వభావం చెంది ఎంతో కాలంగా నేల రకాలుగా (ఎర్ర నల్ల మిశ్రమ నేలలుగా వివిధ స్వభావాలతో) ఖనిజాలుగా ఇంధనములుగా భూ పొరలలో విస్తృతంగా ఏర్పడినాయి -
వర్షాల ప్రభావాలతోనే సముద్రాలు నదులు జల పాతాలు సెల యేరులు గుహలు లోయలు చెరువులు వాగులు వంకలు కాలువలు నీటి ప్రవాహ ధారలుగా కొన్ని సంవత్సరాలతో పాటు మార్పులు చెందుతూ వచ్చినవే -
"చలి, వేడి" తీవ్రత ప్రభావాలు కొన్ని సంవత్సరాలుగా ప్రభావితం చెందుతూ సృష్టిలో పంచభూతాలుగా ప్రదేశంతో పాటు అణువుల ద్వారా గాలి నీరు భూమి అగ్ని వివిధ రకాల మార్పులతో కాలంతో పాటు వచ్చినవేనని తెలుస్తుంది -
చలి వేడి తీవ్రత ను ఎరుక యే వివిధ స్వభావాలతో కలిగించి ప్రకృతి పంచభూతాలుగా మారుస్తూ ఏర్పరిచింది -
మట్టి నీరు ఎప్పుడైతే కలిసినాయో దాని ప్రభావానికి కాలానుగునంగా అణువులలో సంకోచ భావాలుగా పరిణామం చెందే చలన తత్వం ఏర్పడి సూక్ష్మ భీజములుగా మొక్కలుగా వేర్లతో ప్రభావం చెందుతూ చెట్లు వృక్షాలు అడవులుగా ఏర్పడ్డాయి -
చెట్టుగా పరిణామం చెందిన తర్వాతనే సూక్ష్మ జీవులు క్రిమి కీటకాలు పక్షులు జంతువులు ఎన్నో రకాలుగా నీటిలో మట్టిలో గాలిలో ఎన్నో ఎన్నెన్నో -
ఇంకా ఉంది ..!

------

గమనించవలసిన ముఖ్య మైన విషయాలు :
చలి వేడి ఉనికి కై చంద్రుడు సూర్యుడు ఉదయించినట్లు తెలుస్తుంది - నక్షత్రాలు చంద్రుడు సూర్యుడు : కాంతి ప్రభావాలతో ఏర్పడిన అణువుల సముదాయమే -
ప్రదేశము మొదట చీకటిగా ఉన్న తర్వాతనే వెలుగుగా మారినది(సూర్యునితో అర్ధ రోజు వెలుగుతో) -
చీకటి వల్ల చంద్రుడు వెలుగు వల్ల సూర్యుడు మనం చూస్తున్నవే -
భూమి యొక్క ప్రదేశాన్ని చాలా వెలుగుతో నింపుటకు సూర్యుడు అగ్నిగోళంగా మారిపోయాడు(అణువుల యొక్క శక్తి విస్పోటనమే) -
అణువులు ఎప్పుడైతే హిమముగా మారుతాయో దాని వల్ల బరువు పెరుగుతుంది -
బరువు వల్ల గురత్వాకర్షణ శక్తి మొదలవుతుంది కనుక ప్రదేశము లో ఒక ప్రాంతమున హిమము తిరుగుటను ప్రారంభించి రూపాంతరము చెందుతూ కాల ప్రభావము వలన భూమిగా నేటికి తిరుగుతూనే ఉంది -
"సర్వాంతర దిశ శక్తి" తో నే భూమి తిరుగుట వలన బరువును సమపాలలో మోస్తుంది -
ప్రదేశమున వివిధ ప్రాంతములలో వివిధ రకాలుగా హిమము గా మారుట వలన భూమిగానే కాక ఇతర గ్రహాలుగా రూపాంతరం చెందాయి -
భూమిలో కలిగిన ప్రభావాలుగా ఇతర గ్రహాలలో అణువులు రూపాంతరం చెందక జీవ సృష్టిలేక గ్రహాలుగానే మిగిలి పోయాయి -
ఒక వేల ఇతర గ్రహాలలో కూడా ఏ జీవి ఐనా జీవించగలిగినచో అది కాల క్రమేణ జరుగుతూ వచ్చిన అణువుల ప్రభావమే -
ఇక్కడ ముఖ్యమైన విషయమేమిటంటే భూమి గ్రహాలకన్నా చంద్ర సూర్యులు ముందుగా ఉదయించారు (చంద్రుడు తర్వాతనే సూర్యుడు కూడా) -

ఇంకో విషయమేమిటంటే చంద్ర సూర్యులకన్నా నక్షత్రాలే ముందుగా ఏర్పడ్డాయని ఒక ఆలోచనగా కాంతి ప్రభావంతో గమనించవచ్చు -
నక్షత్రాల యొక్క ప్రకాశ శక్తి కాంతివంతంగా ఉన్నందువల్ల దాని ప్రభావమునకు చాలా కాల సమయంతో ఏర్పడ్డాయని తెలుపగలను -
ఇంకా సూక్ష్మముగా పరిశీలించి ఆలోచిస్తే గాని కొన్ని విషయాలు తెలియగలవు -
మీకు ఏదైనా నా భావన సరి కాకపోతే మీ జ్ఞానమే నా భావనగా మీలో ఒక అణువుగా ఆలోచనా ప్రభావంగా నిలిచిపోతుంది -










పరిశుద్ధ పరిపూర్ణ పవిత్రత

పరిశుద్ధ పరిపూర్ణ పవిత్రత : విచిత్రం విభిన్నం విశిష్టత : విజ్ఞానం వివేకం విశేషణం -
మహా గుణములు కలది, సంపూర్ణ మైనదిగా పూర్తిగా, గొప్ప స్థానము కలది -
కొత్తగా చూడునది, వేరైనా మరోకొత్తగా ఉండేది, మహా గొప్పది -
కావలసిన జ్ఞానంకంటే ఎక్కువ, తెలియనిది తెలుసుకోవడం, మహా గుణ స్వభావములు కలిగి ఉండడం -
మహా గుణ విశేషణ స్వభావ విశిష్టత స్థానము కలవాడు పరమాత్మ గా భావించవచ్చు -

ఊహకు అందని ఆలోచనలతో

ఊహకు అందని ఆలోచనలతో ఎవరికి తోచని భావనలతో నా మేధస్సు మహా విజ్ఞానముతో అమర దివ్యత్వంవలె -
విశ్వమున ఆలోచిస్తూ సత్యాన్ని గమనిస్తూ ప్రకృతిని చూస్తూ అనుభవాన్ని తెలుసుకుంటూ మేధస్సున దాచితిని -
భావంతో ప్రతి జీవి ప్రకృతి స్వభావాలను గమనిస్తూ అసాధ్యమైన సూక్ష్మ పరిశీలనచే మరెన్నో భావాలను గుర్తించా -
ప్రతి ఆలోచనలో కలుగు ఎన్నో తెలియని భావాలను సేకరిస్తూ ఊహను కూడా పరమాత్మ తత్వముచే కొనసాగిస్తున్నా -

మన కోసమే మన దేశమే

మన కోసమే మన దేశమే మన ప్రపంచమే విజ్ఞానముగా మరో చరిత్రకై చైతన్యమైతే -
మనలోని జ్ఞానంతో మనమంతా ఒకటైతే దేశవిదేశాలతో ప్రపంచం ఒకటైతే విశ్వవిజ్ఞానమేగా -
ప్రతిదేశ విజ్ఞానం అందరికి అందేలా వివిధరకాలుగా ప్రసారణ చేయగల్గితే ప్రపంచానికే ఖ్యాతి -
ఒకరికి ఒకరు ఏ సమస్యనైనా విజ్ఞానవంతంగా పరిశీలించి పరిష్కారించుకోగల్గితే ప్రపంచమున దేశవిదేశ సమస్యలులేక మరోచరిత్రగా -

Saturday, February 6, 2010

* Quotation By -

You change the Knowledge, but you can't change the mind -
Everyone knows other's mistake/fraud but it depends on time -
Think for wonderful thought, it changes any way -
Create something new yourself then only you recognize in society -
What you think about yourself, express something great otherwise no one care -
One attempt is not an experience, because you learn more from failure and success in different times -
Life is going forward but achievements went behind yourself, If you reached/got otherwise zero -

ఆలోచించి ఆలోచించరా

ఆలోచించి ఆలోచించరా లేదంటే ఆలోచనలోని అర్థాన్ని గ్రహించలేవురా లేదంటే మనకు తోచిన ఆలోచనలకు అర్థాలు ఉండవురా -
ఆలోచించి ఆలోచించడమంటే ధ్యాసతో ఆలోచనలను గ్రహిస్తూ సమయాలోచనలుగా మనకు ఆ క్షణం కావలసిన ఆలోచనలని -
ఆలోచనలను కూడా ఆలోచింప జేసే ఆలోచనలే మనలో కలుగుటవలన మన మేధస్సు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది -
ఆలోచనలను అర్థం చేసుకునే సామర్థ్యం ఎప్పుడైతే వస్తుందో అప్పటి నుండి మన మేధస్సు జ్ఞానవంతగా ఎదుగుతూ వస్తుంది -
అర్థంకాని ఆలోచనలను కూడా సరైన జ్ఞానంగల వారితో చర్చిస్తే విజ్ఞానంతో పాటు అనుభవం కూడా కలుగుటకు ఉపయోగపడుతుంది -
ఆలోచనలను గూర్చి నేను కొన్ని యుగాలుగా చెప్పగలను ఇక ఆలోచించి ఆలోచనలను గమనించు అద్భుతాలకు ఆలోచనలేనని -
ఆలోచన లేకపోతే శూన్యం ఆలోచించకపోతే అజ్ఞానం ఆలోచనలే లేకపోతే నిర్జీవం ఆలోచనలు అర్థం కాకపోతే వ్యర్థం ఆలోచనలలోనే సర్వం -

ఆత్రేయముగా తోచిన ఆలోచనలను

ఆత్రేయముగా తోచిన ఆలోచనలను అర్థముగా చేసుకొని మేధస్సున అప్పుడే జ్ఞాపక పరచితే మరల విశ్రాంతి సమయాన విశదీకరించగా దాని విజ్ఞాన ప్రభావము ఎప్పటికైనా ఉపయోగకరమే -
మేధస్సు యొక్క శక్తి క్షణమున ఎన్నో వేల ఆలోచనలను సేకరిస్తూ కొన్నిటిని జ్ఞానముగా గ్రహిస్తూ ఎన్నో కార్యములను ఎన్నో విధాల చేయుటకు మరెంతో విజ్ఞానం కల్పిస్తూ సహకరించును -
ఆత్రేయముగా కలుగు ఆలోచనలపై ఏకాగ్రత లేకపోతే అద్భుతమైన ఆలోచనలను గ్రహించలేక మేధస్సు యొక్క వేగ ప్రవాహ ఆలోచన తీరును గుర్తించలేక తెలియని విచారమే -
ఆలోచనల శక్తి వలనే ప్రతి జీవి జీవిస్తూ ప్రపంచాన్ని జ్ఞానవంతంగా వివిధ రకాల అద్భుతాలతో ముందుకు నడిపిస్తూ మేధస్సు విజ్ఞానాన్ని విశ్వ జగతిలో కూడా అన్వేషిస్తూ పరిశీలిస్తున్నారు -

ఆలోచనలనే కదిలించరా

ఆలోచనలనే కదిలించరా లేదంటే శిఖరములా ఎన్నో ఆలోచనలు ముడివేసుకొని ఒక ఆలోచన కూడా అర్థంకాక ఎప్పటికి సందేహమువలె -
ఆలోచనలు అర్థం కాకపోతే ఆలోచనలోని భావన తెలియక వాటిని జ్ఞానముగా మలుచుకో లేక అనుభవాన్ని గ్రహించలేక అజ్ఞానమే -
అజ్ఞానంతో కూడిన అనేకమైన ఆలోచనలు మేధస్సున దాగితే ఆలోచన ప్రవాహములేక ఉత్తేజ భావము కోల్పోయే అవివేకమే -
నా ఆలోచన విధానమును మీరు గ్రహించి ప్రతి జీవిని ఉత్తేజముగా జీవింపజేసి అజ్ఞానాన్ని శూన్యపరచి ఆలోచనలను ప్రవహింపజేయండి -

Friday, February 5, 2010

జగమేలే పరమాత్మయే నను తాకగా

జగమేలే పరమాత్మయే నను తాకగా విశ్వమంతా తనలోనే నే చూడగా
నా భావనలే కదలక క్షణాలే తెలియక భయాలు శూన్యమై కరుణామృతమాయే
కళ్ళు మూస్తే మాయమగునట్లు కనురెప్పలు వాలక దివ్యదృష్టితో ముల్లోకాలను దర్శించి -
శ్వాస విడిచాను ఒక ఆలోచనతో నిత్యం సృష్టిలో నిలిచే ఒక రూపాన్ని నాకు కలిగించు నీ వలె -

గాలిలో ఒక అణువును గుర్తించి

గాలిలో ఒక అణువును గుర్తించి ఆ అణువు నశించి శూన్యమయ్యే వరకు నే దానితోనే ఉన్నా -
ఆ అణువు యొక్క భావాలను గుర్తిస్తూ దాని స్థితి ప్రభావాలను గమనిస్తూ ఉపయోగ నిరుపయోగములను తెలుసుకున్నా -
ప్రతి అణువును అదే విధంగా జన్మించిన నాటి నుండి నశించిపోయే శూన్యము వరకు నా మేధస్సున ఆలోచిస్తున్నా -
జగతిలోనే శూన్యము నుండి నేటి వరకు సాగుతూనే ఎంతో కాలంగా మరల శూన్యమయ్యే వరకు ప్రతి అణువు భావన నాలోనే ఏనాటికైనా స్థిరంగా -

నా మేధస్సున జలక్

నా మేధస్సున జలక్ ఉన్నదని విశ్వనాధుడే జల ప్రవాహమున మత్స్యముగా నన్ను చేరుకోవాలనే -
మేఘాలు కురిసినవేళ మత్స్యముగా ప్రవేశించి అన్వేషించగా నా ఆలోచనలు ఎగిరి పడుటలో జలక్ కలదే -
నాలో ప్రవేశించే ఎన్నో ఆలోచనలను నిలిపి సత్య వాఖ్యపు ఆలోచనలుగా మలిచి మరల నే స్వీకరించుటలో జలక్ -
ఎటువంటి ఆలోచనలనైనా జ్ఞానవంతంగా మలిచి సత్యముగా నా మేధస్సున నిత్యం నిలిచేలా కలిగే భావన జలక్ -

2112 - కలియుగం దూరమైతే

21 12 2012 : కలియుగం దూరమైతే ఎన్నాళ్ళు ఎందుకు ఎలా! -
నా భావనలో నాకు తెలియునట్లుగా నా విశ్వాస విధాన గమనము -
కవిగా ఆలోచించినా "వికటకవి" గా ఆలోచించిన ఒకే విధముగానే -
రోజు నెల ను కలుపగా సంవత్సరముతో చూడగా అద్ధమునైనను వేరుగానే -
అద్దమును చూడకనే అమర్చితిని "21 12 : 2112" ఇలా సరిపోవునని -
ఎప్పుడు సంభవించిన భయమును మరచుటకు నా భావన సరియేనని -
కల్పితమైనను జాగ్రత సుమా! మరో సారి ఆలోచించి అనుభవాన్నే పరిశీలించుమా! -

ఎవరో బ్రహ్మ ముహూర్తమున

ఎవరో బ్రహ్మ ముహూర్తమున సువర్ణమును కరిగించి నక్షత్ర ప్రకాశములతో నా నుదుటిపై సత్య వాఖ్యములను లిఖిస్తున్నారు -
ఘాఢనిద్రలో ఉన్నసమయాన మరోధ్యాసలో వెళ్ళుతూ మెళుకువగా తెలుస్తున్నది సంగీత స్వరములతో ఏదో లిఖించబడుతున్నదని -
మర్మముగా సృష్టి మూల రహస్యమువలె గుణాతీతములచే మహా వేద విజ్ఞాన ప్రజ్ఞాన పరిశుద్ధ పరిపూర్ణ ధర్మ భావాల గీతములవలె -
స్వప్నమువలె గోచరించినను నిత్య సత్యముతో జీవించవలలేనని రహస్యమున ఒక భావమును కలిగించి నిద్రించుటలో తెలియకపోయేను -

Thursday, February 4, 2010

ఈనాడు నేడై రోజుగా

ఈనాడు నేడై రోజుగా ప్రతిరోజై ఈ రోజులా మరో రోజై ఏ రోజైనా ఒకే రోజులా
రోజులెన్నైనా ప్రతిరోజూ ఒక రోజుగానే రోజులెన్నో నేడేనని ఈనాడే ఈరోజే
రోజులతోనే మరో రోజులు ఆనాడు ఈనాడు ఏనాడో ఒకనాడేనని ఈరోజు
రోజంటే ఏరోజైనా ఈ రోజుగానే ప్రతిరోజు ఒక రోజేనని రోజులుగా ఎన్నోరోజులు

దేశంలో మరో దేశం

దేశంలో మరో దేశం ఆ అవకాశం ఏ దేశానికో ఎటువంటి బంధమో -
ఒక దేశ ప్రజలు నివసించుటకు మరో దేశానికై వేచి ఉన్నారు ఏదీ తెలియక -
ఆ దేశ పరిస్థితుల ప్రభావాలు దిక్కు తోచని విధంగా మారిపోతున్నాయి ఎందుకో -
భూ ప్రకంపనాలు వాయు జల అగ్ని(లావా) ప్రళయ ప్రమాదాలు తలెత్తుతున్నాయి -
ఎక్కడ చూసిన ఘోర మరణాలు భయంకర దృశ్యాలు ప్రకృతి వికృతాలు మతి చెదురునట్లుగా -
భవనాలు కూలిపోవటం భూ పొరలలో చిక్కి పోవటం బరువైనవేన్నో మీద పడటం -
కాలిపోవటం శ్వాస ఆడకపోవటం గుండె ఆగిపోవటం భయం కలగటం నీటిలో కొట్టుకుపోవటం ఎన్నెన్నో -
మరణించినవారు మరణించబోయేవారు సురక్షింతంగా ఉన్నా బయటికి రాలేనివారు ఎందరో -
చిన్న పిల్లలు వయసుగలవారు పెద్దలు ముసలివారు ఎందరో ఎన్నోవిధాల ఎన్నిరకాల ఇబ్భందులో -
అంగవైకల్యముతో పోరాడినవారు గురైనవారు అంగవైకల్యము చెందినవారు అవస్థలతో ఎంత భారమో -
కన్నీరు రక్తపు మడుగులు భూడిద కుప్పలు కళేభరాలు జంతు జీవముల మరణాలతో స్మశానము వలె -
తిండి గుడ్డ వసతి ధనం విలువైన వస్తువులు కుటుంభాలు బంధువులు అనాధలు ఏమియులేవు శూన్యము వలె -
లక్షలలో ఉన్నవారు వేలలో మిగిలిపోయారు ఆశతో జీవిస్తున్నవారు నిరాశతో పరతత్వ యోగులవలె -
ఆ దేశాన్ని వీడితే గాని మరో దేశంలో బ్రతకగలమనే ఆశ చిగురించటం లేదు -
అక్కడే జీవిస్తే మరో సమయానికి అదే పరిస్థితి అన్నట్లు భయంతో మిగిలిపోయారు -
దేశాన్ని వీడకపోతే వేలలో ఉన్నవారు వందలలో మరో వేదనలో మరణించేదరు -
ఆ దేశాన్ని ప్రకృతి ప్రభావాలకు అతీతమైనా ప్రదేశంగా వదిలిపెడదాం మరో ప్రాంతానికి వెళదాం -
ప్రపంచంలో ఎక్కడైతే ప్రకృతి వికృతాలు ఎక్కువగా సంభవిస్తాయో ఆ ప్రదేశాన్ని సృష్టికే అంకితం చేయండి -
అంతా పోగొట్టుకున్న ఆ దేశ ప్రజలను మరో దేశస్తులు ఆహ్వానించండి కనీస సదుపాయాలు కల్పించండి -
అందరు మనవారే ఎవరినుండి దేనినుండి ఏది జరిగినా శాంతి ప్రభావాలతో శ్రమిస్తూ జీవిద్దాం -
దేశంలో మరో దేశ ప్రజలు జీవించునట్లుగా ఆ దేశాలు చరిత్రలో నిలిచిపోతాయి -
దేశమే కాకపోయినా కొన్ని ప్రాంతాలను వదిలి వెళ్ళండి ప్రకృతి ప్రభావాలు దూరంగా -
శాస్త్రవేత్తలే భూ ప్రాంతాన్ని పరిశీలించి సరైనా జాగ్రతలు తీసుకునే విధంగా జ్ఞానించండి -

నేనే లిఖించుకున్నాను సత్యాన్ని

నేనే లిఖించుకున్నాను సత్యాన్ని నా నుదిటిపై ఆత్మ జ్ఞాన పరమాత్మ స్వభావముతో -
ఎన్ని ప్రళయాలు సంభవించిన చెక్కుచెదరనిరీతిగా నే నిలిచి ఉంటానని లిఖించుకున్నా -
ఎవరికి కావలసిన జ్ఞానాన్ని ఆ క్షణమే వివరించుటలో లేదా గ్రహింప జేయుటలో నేనే -
విశ్వ విజ్ఞానంపై దృష్టిని కేంద్రీకరించి సత్యం యొక్క మూల రహస్యాన్ని సేకరించా -

విశ్వ ప్రపంచమున నా వేద

విశ్వ ప్రపంచమున నా వేద వాక్యములు లిఖించబడెను నిత్యము సత్యమువలె
అమర జ్ఞానమున ప్రతి అణువు విజ్ఞాన శాస్త్రాన్ని పరిశీలించాను వివేకముతో
ఏ జీవి ఆలోచనలలోనైనా లేని భావనలను యుగాలుగా క్రుషించి ఎన్నిటినో సేకరించాను -
అనంతమునకే అనంతముగా ఆలోచనలను సేకరిస్తూ భావనలను పరిశోధించా ఆత్మజ్ఞానిగా -

కలియుగాంతమున విశ్వఖగోళ

కలియుగాంతమున విశ్వఖగోళ వేదవిజ్ఞాన చరిత్రగ్రంధ నిఘంటువులు శూన్యమైతే భావనగా నా ఆలోచనలలో నిలిచే ఉంటుంది -
ఎన్ని ప్రళయాలు ఎన్నిచోట్ల ఎన్నివిధాలుగా సంభవించినను అణువణువునా దాగిన సూక్ష్మవిజ్ఞాన రూపభావములతో సహా నాలోనే -
ఎందరో ఎంతో కాలంగా శ్రమించిన విజ్ఞానములు భూ జల వాయు అగ్ని ప్రళయాలకు అంతమైతే నా మేధస్సునే చేరుకుంటాయి -
కలియుగాంతమున జగతి శూన్యమైతే శూన్యముననే వేచి మరల భావనగా నేనే క్షణమై మరో జగతిని యుగాలుగా విజ్ఞానమై నడిపిస్తా -

Wednesday, February 3, 2010

అప్పుడెప్పుడో సృష్టించిన

అప్పుడెప్పుడో సృష్టించిన విశ్వ జగతిని మళ్లీ నేనే జన్మించి తలిచేటట్లు ఉందా లోకం -
నేను సృష్టించిన విధానాన్ని జగతిలో దాగిన విజ్ఞానాన్ని క్రమమైన విధంగా తెలుసుకోలేకపోయారు -
మరల నేనే జన్మించి భావాలతో ఆలోచిస్తూనే గత కాల ప్రయాణ మయ్యాను -
నే గతమున జన్మించిన స్థానాన్ని శూన్యమేనని తెలియగా నాకు తెలిసినది సర్వం -
సర్వమును వివరించుటలో మొదటి క్షణము నుండి నేటి వరకు క్రమముగా తెలిపాను -

అహో సూర్య తేజం

అహో సూర్య తేజం మహా దివ్య రూపం నమో శివుని ధ్యానం ఆహా ఎంత మౌనం -
ఏదీ విశ్వ భీజం శ్వాసే మహా వృక్షం ధ్యాసే నిత్య గమనం అదే పరమ తత్వం -
ఇదే జీవ రహస్యం జీవులకే తెలియని మర్మం తనలోనే సదా జీవం సాగించే ప్రయాణ లోకం -
అదే విశ్వ లోకం ఓ కైలాస శిఖరం శివుని మహా గమ్యం చేరుకో కాంతి భావం మనస్సే ఆత్మ స్థానం -

పెళ్లి చేసుకునే వారినుండి

పెళ్లి చేసుకునే వారినుండి ముసలివారి వరకు ప్రతి పురుషునికి ఒక ప్రత్యేక గృహము కావలెనని తపన -
ప్రతి పురుషునికి ఒక గృహము కావలసివస్తే నేటి సమాజమున ఎందరికో ఎన్ని గృహములు కావాలో -
పురుషుడు సంపాదించే ధనంతో ఒక సొంత గృహము నిర్మించుకోవాలనుకుంటే నేడు భూమి వేల ఎంతవరకో -
సంపాదనలో జీతములే తక్కువగా ఉంటె ఇక సొంత గృహము లేక భూ స్థలాన్ని కొనలేక ఇబ్బందిగానే -
భూ స్థలాన్ని కొనలేని జీత భత్యములు జీవించుటకె సరిపోతే సొంత గృహములేని వారికి పెళ్లి ఇబ్బందులే -
జీతములు ఎక్కువగా ఉన్నను భూ స్థలాన్ని కొనగల్గితే ఎంతవరకు ఎందరు కొనగలరు పేదవారికి ఎలా -
భూప్రదేశాన గృహములే ఎక్కువైతే చెరువులు ఉధ్యానవనములు ఆటస్థల రంగములు వ్యవసాయ భూములు ఎలా -
ఒక తండ్రికి ఎంత పెద్ద గృహమున్నను తన కుమారులకు మరొక ప్రత్యేక గృహములు కావలసివస్తే ఎలా -
కుమారుడు ఒక్కరైనను తండ్రి విడిపోతే ఒక గ్రామముననే ఇద్దరికి ప్రత్యేక గృహములు అవసరమా -
కొందరి గృహములు విశాలములేక ఇక్కట్లుగా ఉంటె కొందరి గృహములు విశాలమైనా ఒక్కరే -
ఎందరో శాస్త్రవేతలు మేధావులు మహాత్ములు ఉన్నను సరైన ప్రణాళిక లేకపోతే సమాజమే లేదే -
అద్దె గృహములకు జీతములు సరిపోక పోతే తన జీవిత సమస్యలు తీరేదెలా సాధించే ప్రగతి ఎన్నటికి -
సరిపోని జీతముగల వృత్తిలో ఎదుటి వారి ధనమున ఆశతో అతిశయోక్తిగా తప్పులెన్నో దేశ విదేశాలలో సాగే -
చిన్న చిన్న రహదారులలో చిన్న చిన్న గృహాలు అంతస్తులుగా నిర్మిస్తే శుభ్రత లేక రోగములే గతి -
జానాభ సమస్యను తగించగల్గితే చిన్న కుటుంభాలుగా చట్టాన్ని అమలుపరిస్తే గాని గృహ సమస్య తీరదు -
ఎలాంటి సమస్య కైనా జనాభాను తగ్గించ గల్గితేగాని అబివృద్ధి సాధ్యం కాదు ఏ వ్యకికైనా గృహమునైనా సమాజమునైనా -

* జన గణమున

జన గణమున గణతంత్ర స్వాతంత్ర్యములకు జయహే
భారత రాజ్యాంగమున ధర్మనీతి శాస్త్రములకు జయహే
దేశ విదేశమున మన దేశ సత్య శాంతులకు జయహే
విశ్వమున మన దేశ సహజ వనరులకు జయయే
ప్రతిదేశమున మనదేశ పౌరుల విజ్ఞాన మేధస్సుకు జయహే
దేశ రాష్ట్రాలయందు చరిత్ర గ్రంధముల వేదములకు జయహే
మన దేశముననే ఖ్యాతి గాంచిన శాస్త్రవేత్తలకు జయహే
మహాత్ములుగా దేశాన్ని రక్షించిన అమరవీరులకు జయహే
జయహే జయహే జయ జయ జయ జయహే
జయ జయ జయ జన గణమున జగమంతా జయహే
జయ జయ జయ జన గణమున జనులంతా జయహే
జయహే జయహే జయ జయ జయ జయహే
( This goes to get an Award in my intent )