ఒక మనిషి మరో మనిషి (ఇంకో మనిషి) నుండి ఉపయోగం కలగాలని ఆశిస్తాడు
ఒక మనిషి నుండి నీవు ఉపయోగం పొందినప్పుడు అతనికి మరో విధంగా నీవు ఎప్పుడైనా ఉపయోగపడాలి సహాయపడాలి
నీవు ఈ రోజు ఒకరికి ఆహారం పెడితే అతనో మరో విధంగా ఎప్పుడైనా ఎలాగైనా సహాయపడవచ్చు
ఒకరి నుండి ఫలితం పొందిన వాడు ఇతరుల అవసరానికి ఎప్పుడైనా తిరిగి సహాయం చేసే విధంగా ఉండాలి
సహాయం చేయకుండా ఫలితాన్ని పొందుతూ వారికి ఎల్లప్పుడూ నష్టాన్ని కల్పిస్తూ ఉంటే జీవించుటలో ఫలితార్ధం లేదు ఉండదు
ఉద్యోగం చేస్తున్నా జీతం ఆర్జిస్తున్నా చిన్న చిన్న స్వంత ఖర్చులకు ఇతరులను అడుగుట తిరిగి ఇవ్వకుండా ఉండుట చేస్తే మనిషిగా అర్థాన్ని చూడరు ఏ అర్థం కనిపించదు అలాగే ఇతర అలవాట్లకు వాడుకుంటే మనిషిగా ఉన్నావని ఆలోచించరు వీలైతే మరచిపోతారు
మంచి వాటికి మంచి వారిని ఉపయోగించుకోవాలి అలాగే వాళ్ళకు మంచిని చేకూర్చాలి అప్పుడే కుటుంబం బంధం సంబంధం స్నేహం సమాజం బాగుంటుంది విజ్ఞానానికి అర్థం పరమార్థం ఉంటుంది
అభివృద్ధి ప్రతి వారికి వివిధ కాల సమయాలలో కలుగుతుంది ప్రశాంతతను పొందగలుగుతారు జన్మకు సార్థకం ఉంటుంది చివరకు ఆత్మ సంతృప్తి చెందుతారు
తాను అభివృద్ధి చెందలేడు అలాగే ఇతరులను అభివృద్ధి చెందనివ్వడు
తాము అభివృద్ధి చెందలేరు అలాగే ఇతరులను అభివృద్ధి చెందనివ్వరు
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment