ఎవరి మాట సత్యమో ఎవరి మాట నిత్యమో
ఎవరికి తెలిసేను ఏది సత్యమో ఎవరికి తెలిసేను ఏది నిత్యమో
ఎవరికి ఎలా ఏది తెలియునో ఎవరు ఎలా ఏది గ్రహించునో
ఎవరికి ఎవరు ఏది తెలుపునో ఎవరికి ఎవరు ఏది బోధించునో
ఎవరిలోని విజ్ఞానం ఎవరికి ఎలా చేరునో ఎవరిలోని ప్రభావం ఎవరికి ఎలా అందునో
ఎవరిలోని ప్రవర్తన ఎవరికి ఎలా ఉపయోగమో ఎవరిలోని సంకీర్తన ఎవరికి ఎలా అవసరమో (ప్రయోజనమో)
ఎవరు ఎలా ఏది తెలిపినా సత్యాన్ని గ్రహించు ఎవరికీ ఎలా ఏది తెలిసినా నిత్యం పరిరక్షించు
ఎవరు ఎలా ఏది కలిగినా సత్యాన్ని పాఠించు ఎవరు ఎలా ఏది జరిగినా నిత్యం పరిశోధించు
ఎవరికి ఎవరు లేకున్నా నీవే అందరికి అండగా ఉండాలి ఎవరికి ఏది లేకున్నా నీవే అందిరికి ఆచరణ కావాలి
ఎవరికి ఎవరు తెలిసినా నీవే సత్యమని తెలియాలి ఎవరికి ఎవరు తెలిపినా నీవే నిత్యమని నిలవాలి
ఎవరు ఎవరిని మార్చినా సత్యాన్ని మార్చలేరు ఎవరు ఎవరిని [దేనిని] దాచినా నిత్యం ఉంచలేరు
ఎవరు ఎవరిని చేర్చినా సత్యాన్నే పంచగలరు ఎవరు ఎవరిని వదిలినా నిత్యం ఉండలేరు [బంధం]
-- వివరణ ఇంకా ఉంది!