Wednesday, January 5, 2011

రహదారులలో వెళ్ళేటప్పుడు మనకు

రహదారులలో వెళ్ళేటప్పుడు మనకు ఏమైనా తినాలని అనిపిస్తే
తినవచ్చు లేదా తినలేక పోవచ్చు తినడానికి అవకాశం లేక పోవచ్చు
అవకాశం ఉంటే ధర సరైనదైతే తినగలం లేదంటే తినలేకపోవచ్చు
తినలేక పోవుటలో కొన్ని భావాలతో వెనుక తిరిగి వెళ్లిపోవచ్చు
రహదారుల ప్రయాణంలో ఎన్నో కనిపిస్తుంటాయి కనిపించినవన్నీ కొనలేము
కావాలనుకున్న వాటిని కొనటంలో తృప్తి కొనలేకపోతే అసంతృప్తి కలుగుతుంది
మనం ఇలా ఎన్నో భావాలతో తెలుసుకొని అర్థం చేసుకొని ఆలోచనలతో వెళ్లిపోతాము
పిల్లలకు కూడా తినాలనిపిస్తే వారి దగ్గర డబ్బు ఉండదు వారి భావాలు ఎలా ఉంటాయో
కొనడానికి డబ్బే ప్రధాన కారణంగా సమాజంలో ఆర్థిక స్థితి విధాన పరిస్థితి ఇలా ఉంది
పిల్లల భావాలు ఎదుగుటలో ఎలా మారుతూ మేధస్సులో ఎలా ప్రభావితమవుతాయో
జీవన విధానం ఇలాగేనా జీవిత మార్గం ఎలాగే ఒడిదుడుకులతో సాగుతుందా

No comments:

Post a Comment