Monday, January 10, 2011

ఎంత శ్రమించినా ఎంత విజ్ఞానం పొందినా

ఎంత శ్రమించినా ఎంత విజ్ఞానం పొందినా ప్రతి రోజు మూడు పూటల ఆహారానికై వేచినట్లే
ఎవరైనా ఎంతటి విజ్ఞానులైనా ఎంత శ్రమించినా రోజు మూడు పూటల ఆహారం తప్పనిసరి
ఏ అవసరాలు తీరినా తీరకపోయినా ఏ కార్యాలు సాగినా సాగక పోయినా ఆహారం తప్పదు
ఆహార శక్తి లేదంటే శ్రమించలేక ఏ కార్యాలు చేయలేక ఆఖరికి నిద్ర కూడా రాని విధంగానే
ఆహార శక్తితోనే ఎన్నో కార్యాలు ఎంతో విజ్ఞానం ఎన్నో భావ స్వభావాలు సాగిపోతున్నాయి
కనీస అవసరాలకే మానవుడు ప్రతి రోజు శ్రమిస్తూ ఎన్నింటినో అధిగమిస్తూనే ఉన్నాడు
ఆహారాన్ని భుజిస్తూ విజ్ఞానిగా ఎన్నో కార్యాలు చేపట్టి విశ్వానికి మహాత్మగా నిలిచిపో

No comments:

Post a Comment