ఆనాటి నుండి నేటి వరకు మేధస్సుకు విశ్రాంతి లేక
పగలు రాత్రి జన్మ నుండి మరణం వరకు ఆలోచిస్తూనే
భావాలతో స్వభావాలతో విచక్షణతో మనస్సు అన్వేషిస్తూనే
ఆలోచనలతో అర్థాలతో జ్ఞాన విజ్ఞానంతో ఎన్నో రకాల
మేధస్సుననే గత వర్తమాన భవిష్య కాల కార్యాలోచనలు
మనస్సు మేధస్సులోనే నీ జీవిత కాలమంతా అన్వేషిస్తూ
విశ్రాంతికై ఎదురు చూడుటలో నీకు తెలియని సమస్యలే కారణం
నీ విజ్ఞాన జీవితానికి మేధస్సు ప్రశాంతతకై మనస్సుతో ధ్యానించు
No comments:
Post a Comment