Wednesday, January 5, 2011

ఏమిటి ఈ ఆకర్షణ మనస్సుకు

ఏమిటి ఈ ఆకర్షణ మనస్సుకు మేధస్సుకు తెలియని అన్వేషణ
ప్రతి క్షణం అన్వేషణలో ఆకర్షణ వికర్షణ భావ స్వభావాలు ఎన్నో
అజ్ఞాన విజ్ఞాన భావాలుగానే ఆకర్షణ వికర్షణలు ప్రతి క్షణం ఎన్నో
జీవితంలో ఎన్నో తెలుసుకోవాలని ఆకర్షణ అలాగే మరొక దానికై వికర్షణ
ఆకర్షణ వికర్షణల ద్వారా జీవితాన్ని విజ్ఞానంగా మార్చుకోవాలనే అన్వేషణ
అన్వేషణ లేని మేధస్సు తక్కువ కార్యాలతో అల్ప విజ్ఞానంతో సాగుతుంది
మనస్సును మేధస్సును ఉత్తేజంగా ఉంచుకుంటేనే అన్వేషణ వేగంగా సాగును
విజ్ఞాన అన్వేషణను విశ్వమంతా సాగించు నీలో విశ్వ విజ్ఞానం కలుగుతుంది

No comments:

Post a Comment