అశుభ్రతను తొలగించేవారు మనకెందుకు ఈ జీవితం అనుకుంటే విశ్వం ఏమగును
అశుభ్రతతో విశ్వం ఎలా ఉంటుంది ఎలాంటి రోగాలతో ఎందరు అనారోగ్యులవుతారు
జీవితాల వ్యత్యాసాలలో ఆర్థికంగా వెనుకబడిన వారే అశుభ్రతను తొలగించాలా
ఏనాడు ఎవరి జీవితం ఎలా ఉంటుందో కాల పరిస్థితుల ప్రభావాలే కారణమా
అశుభ్రతను తొలగించేవారు విశ్వానికి ఆరోగ్య ప్రాణ వాయువును శుద్ధి చేసినట్లే
ఆర్థికంగా వెనుకబడిన చేసే మహా విజ్ఞాన కార్యాలలో ముఖ్య నిత్య అవసరమైనదే శుభ్రత
విశ్వాన్ని వీలైనంత వరకు శుభ్రతతో వస్తువుల స్థానాన్ని సరైన ప్రదేశాలలో ఉంచండి
దేహాన్ని శుభ్రంగా ఉంచుకుంటూ విజ్ఞానంగా ఆలోచిస్తూ పర్యావరణాన్ని పరి రక్షించాలి
అశుభ్రతను తొలగించే వారికి నా ఆశిస్సులు ఎప్పుడూ ఉంటాయని నా కృతజ్ఞతా భావం
No comments:
Post a Comment