Tuesday, January 4, 2011

మానవులుగా అవతరించడానికి విశ్వ

మానవులుగా అవతరించడానికి విశ్వ పరిణామ కాలం యుగాలే
ఆనాటి కాలంలో శూన్యం ఉద్భవించడానికి మర్మ కాల యుగం
బ్రంహాండ లోకాలుగా వివిధ స్థాన ప్రదేశాలుగా లోక కాల యుగం
విశ్వ రూపాల నిర్మాణం ఎర్పడుటకు విశ్వ రూప కాల యుగం
విశ్వ రూపాల తీవ్రతలతో జల ప్రభావాల నుండి వృక్షాలుగా వృక్ష కాల యుగం
వృక్షాలతో ప్రాణ వాయువు ద్వారా క్రిమి కీటక పక్షుల జంతువల పరిణామాలు
జంతువుల పరిణామాల కాల ప్రభావాలకు జీవ భావ స్వభావాల ఎదుగుదలయే
జంతువల అనేక జీవ పరిణామ జీవన కాల పరిస్థితులచే జంతు నాగరిక కాల యుగం
జీవ భావ స్వభావాలతో విచక్షణ మేధస్సు ఎదుగుటచే మానవ పరిణామం
మానవ పరిణామం నుండి ఆది యుగంగా సాగుతూ నేటి యుగాలుగా
మానవుల కార్య కలాపాల కాల పరిస్థితులు ఎలా సాగితే అలా ఆ నామ యుగంగా
మానవ విజ్ఞానంతో యుగాలను వివిధ పేర్లతో వివిధ చరిత్రలతో తెలుపుకుంటారు

No comments:

Post a Comment