Tuesday, January 11, 2011

ఎందరో మహాత్ములు ఎన్నో భావాలతో

ఎందరో మహాత్ములు ఎన్నో భావాలతో ఎన్నో గ్రహించి వెళ్ళిపోయారు
నీవు అలాగే వెళ్ళిపోతే నీ భావాలు ఇంకొకరికి తెలియకుండా పోతాయి
మానవులు మానవులుగా ఇంకా అజ్ఞానంగానే ఆలోచిస్తూ జీవిస్తున్నారు
విజ్ఞానాన్ని కూడా సరిగ్గా తెలుసుకోలేని సమస్యలతో జీవిస్తున్నారు
తమ విజ్ఞానంతో తమ జీవితాన్ని చక్క బెట్టేందుకే నిత్యం ఆలోచిస్తున్నారు
ఇక భావ స్వభావాలను తెలుసుకోవడం ఆత్మ జ్ఞాన అన్వేషణ చేయడం శూన్యమే
విశ్వ విజ్ఞానం అంటే ఏమిటని ప్రశించే జనులు ఎందరో లెక్కకు సరిపోని మాటే
మహాత్ముల భావాలను గ్రహించి ధ్యానిస్తూ విశ్వ విజ్ఞానాన్ని తెలుసుకో
మానవుడు మహాత్మగా ఎదగాలంటే విశ్వ భావాల ఆత్మ విజ్ఞానమే మార్గం

No comments:

Post a Comment