విశ్వంలో ఓ రూపానికి మరో రూపానికి ఉన్న కలయికయే స్నేహ భావం
తీరానికి సముద్రానికి ఒడ్డుకు నదికి గట్టుకు చెరువుకు స్నేహ భావమే
కొండకు మట్టికి చెట్లకు నీటికి ఎన్నో విధాల స్నేహ సంబంధాల భావాలే
భూమికి ఆకాశానికి గ్రహానికి నక్షత్రానికి ఎన్నో రకాల స్నేహ బంధాలే
ఒక్కొక్క రకమైన రూపంలో ఎన్నో స్నేహ భావాలు ప్రేమ స్వభావాలు
విశ్వమున ఉన్న రూపాల స్థితి తత్వాలను పరిశీలించి విజ్ఞానాన్ని అన్వేషించు
విశ్వ విజ్ఞానం నీ మేధస్సున చేరేందుకు కాలం ఎదురుచూడదు నీవే గ్రహించాలి
No comments:
Post a Comment