విజ్ఞాన ఆలోచనతో ధ్యానించు విశ్వ విజ్ఞానం నీలోనే కలుగుతుందేమో
నీ మేధస్సులోనే విశ్వ విజ్ఞానముకై చాల ప్రదేశం ఖాళీగా ఉన్నదేమో
ప్రదేశమంతా పవిత్రంగా మహా దివ్య ప్రకృతి స్వభావాలతో ఉన్నదేమో
విశ్వము దైవత్వంతో ధ్యానించుటకు నీ మేధస్సులో చేరుతుందేమో
నీ మేధస్సును విశ్వ విజ్ఞాన క్షేత్రంగా మార్చుకునేందుకు ఇదే మహా అవకాశమేమో
అవకాశాన్ని వదులుకోకు సమయాన్ని వృధా చేయకు విశ్వ విజ్ఞానాన్ని మరవకు
No comments:
Post a Comment