Sunday, January 2, 2011

ఆకలిని హిమాలయాలలో ధ్యానిస్తూ

ఆకలిని హిమాలయాలలో ధ్యానిస్తూ వదిలేస్తానేమో
దాహాన్ని ఎడారిలో ప్రయాణిస్తూ మానుకుంటానేమో
ఆలోచనలను సముద్రంలో తేలుతూ మరచిపోతానేమో
భావాలను ఆకాశాన్ని తిలకిస్తూ అలాగే నిలిపేస్తానేమో
స్వభావాలను ప్రకృతిలో వెళ్ళుతూ ఆపివేస్తానేమో
శ్వాసను విశ్వ లోకాలను దర్శించి అప్పగిస్తానేమో
మేధస్సును కాలానికే అంకితం చేస్తానేమో
శరీరాన్ని జగతికే వదిలేసి పోతానేమో

No comments:

Post a Comment