Tuesday, August 20, 2019

విశ్వమా అడగవా నీవే

విశ్వమా అడగవా నీవే
జగమా తెలుపవా నీవే
లోకమా నిలువవా నీవే

మీకు ఏది కావాలో ... ఏది ఎక్కడ ఎలా ఎంత ఉండాలో ... !

అడగవా తెలుపవా నిలువవా నవ జీవుల కాలంతో
నిరంతరం జీవుల జనన భోగముల యోగ రక్షణమే

ప్రకృతి అడుగుతున్నది పరిమళాల పర్యావరణం
ఆకృతి తెలుపుతున్నది పరిరక్షణాల పత్రహరితం  || విశ్వమా ||

విజ్ఞానమా విశ్వమై పరిశోధించవా తరతరాల పర్యావరణం
వినయమా జగమై పరిశీలించవా యుగయుగాల పత్రహరితం

వేదనమా విశ్వమై పర్యవేక్షించవా స్థిరత్వమైన పర్యావరణం
భావనమా జగమై పరిమళించవా నిత్యత్వమైన పత్రహరితం  || విశ్వమా ||

జీవమై అన్వేషించవా అనుభవాల ప్రకృతి పరధ్యాన శాస్త్రీయం
ధ్యాసవై అన్వేక్షించవా అవసరాల ప్రకృతి పరధ్యాస సిద్ధాంతం

జీవమై సాగించవా అనుబంధాల ప్రకృతి పర్యావరణ రక్షణం
ధ్యాసవై గమనించవా సంబంధాల ప్రకృతి పత్రహరిత శరణం   || విశ్వమా || 

No comments:

Post a Comment