Thursday, August 29, 2019

మేధస్సులోనే విశ్వ వేదాన్ని వర్ణించుకున్నాగా

మేధస్సులోనే విశ్వ వేదాన్ని వర్ణించుకున్నాగా
మేధస్సులోనే లోక జ్ఞానాన్ని లిఖించుకున్నాగా

మనస్సులోనే అనంత జీవ భావాలను తిలకించానుగా
మనస్సులోనే అసంఖ్య దేహ తత్వాలను తపించానుగా

వయస్సులోనే అఖండ గుణ బంధాలను పంచుకున్నాగా   || మేధస్సులోనే ||

అనంతం నిరంతరం జీవుల మేధస్సులలో విశ్వ వేదాంత విజ్ఞానమేగా
తరంతం నిత్యంతరం జీవుల మనస్సులలో లోక జ్ఞాన్విత విధాంతమేగా

సమయం సమయోచితం జీవుల మేధస్సులలో కలిగే భావన ప్రజ్ఞానమేగా
తరుణం తరుణోచితం జీవుల మనస్సులలో కలిగే తత్వన సందర్భమేగా   || మేధస్సులోనే ||

గమనం గమనార్హం జీవుల మేధస్సులలో ఎదిగే ఉజ్వల కాలజ్ఞానమేగా
సమయం సమన్వయం జీవుల మనస్సులలో ఎదిగే ప్రజ్వల సమజ్ఞమేగా

వచనం వాచకం జీవుల మేధస్సులలో మెలిగే అఖండ ప్రవచనమేగా
కారణం వ్యాకరణం జీవుల మనస్సులలో మెలిగే అపూర్వ ఛందస్సేగా   || మేధస్సులోనే ||

No comments:

Post a Comment