Tuesday, January 4, 2011

కర్మ లోకం ఉందిరా కనిపించని

కర్మ లోకం ఉందిరా కనిపించని విధంగానే మేధస్సులో దాగుందిరా
అజ్ఞాన కార్యాలు మేధస్సులోనే కర్మ లోకాలకు చేరేనురా
విజ్ఞాన కార్యాలు విశ్వ మేధస్సులోని విశ్వ లోకాలకు చేరేనురా
మేధస్సులో కర్మ లోకాలు ఉన్నంతవరకు విశ్వ విజ్ఞానాన్ని పొందలేవురా
కర్మ నీ జీవితాన్ని నశింపజేసి నీ జ్ఞానాన్ని హరించి వేయునురా
విశ్వ విజ్ఞానం నీ మేధస్సును మరో లోకంగా మారుస్తూ స్వర్గాన్ని చేర్చునురా
అజ్ఞానాన్ని మానుకో కర్మను వదిలించుకో విజ్ఞానాన్ని తెలుసుకో స్వర్గాన్ని అందుకో

No comments:

Post a Comment