ఒక్క క్షణం ఆనందం కోసం ఎంతో కాలం శ్రమిస్తున్నావు
సంవత్సరాలుగా ఓ కార్యాన్ని పూర్తి చేయుటలో నీకు కలిగే ఆనందం ఓ క్షణమే
విజయం కలిగినప్పుడు నీవు గ్రహించే దివ్య భావన మేధస్సుకు ఓ క్షణ ఆనందమే
మళ్ళీ తీరిక సమయాలలో నీ విజయాన్ని ఆలోచిస్తే అంత గొప్పగా అనిపించదు
ఇంకా ఏదో మహా గొప్ప అద్భుత విజయాన్ని సాధించాలని నీలో తపన కలుగుతుంది
తపనలో ఉన్న ఉత్సాహం కంటే నీవు సాధించిన విజయం చాలా చిన్న భావనగా తోస్తుంది
ఒక కార్యాన్ని నెరవేర్చుకొనుటకు యుగాలుగా ఎన్నో జన్మలు పొందుతూనే ఉన్నావు
విశ్వ విజ్ఞానిగా అన్నీ క్షణాలు ఆనందంగా కలిగే అద్భుతాలకై ఎన్నో జన్మలు పొందుతున్నావు
నేడు విశ్వ విజ్ఞానిగా నీవు ఎదగలేవా తెలుసుకోలేవా మేధస్సును అభివృద్ధి చేసుకోలేవా
క్షణాన్ని విజ్ఞానంగా మార్చుకో ప్రతి క్షణం నీకు మహా విజ్ఞానంగా మారుతూ సాగుతుంది
ఎంత కాలం జీవించినా ఎన్నో జన్మలు పొందినా ఓ క్షణం మోక్షం పొందాలనే విజ్ఞానం
No comments:
Post a Comment