Tuesday, January 4, 2011

విశ్వ వేదం విశ్వ భావం విశ్వ జ్ఞానం

విశ్వ వేదం విశ్వ భావం విశ్వ జ్ఞానం నీదిరా
విశ్వ నేత్రం విశ్వ లోకం విశ్వ క్షేత్రం నీదిరా
విశ్వమే జగతిగా విశ్వ విజ్ఞానమే నీ మేధస్సున కలుగుతున్నదిరా
విశ్వమే ఆకాశాముగా నీ నేత్రమున భావమై మేధస్సులో దాగేనురా
విశ్వ కాంతుల భావ స్వభావాలు విశ్వ జీవుల రూపాలే
విశ్వ జ్యోతుల దివ్య వెలుగులు మహాత్ముల జ్ఞాన విజ్ఞానమే
విశ్వమే నీవై నీ శ్వాసలో విజ్ఞానిగా జీవించరా
విశ్వమే నీదై నీ మేధస్సున దీవిగా నిలుచునురా
విశ్వ వేదం విశ్వ భావం విశ్వ జ్ఞానం నీదిరా
విశ్వ నేత్రం విశ్వ లోకం విశ్వ క్షేత్రం నీదిరా

No comments:

Post a Comment