అదిగో సూర్యునిలోని తేజస్సును నేనే
ప్రకాశించే కిరణాల భావ స్వభావాన్ని నేనే
సూర్యునిలో కలిగే ఊష్ణ తీవ్రతను నేనే
సూర్యరశ్మిలో ఉన్న విశ్వ శక్తిని నేనే
ఉదయిస్తూ అస్తమించే ఆకాశ వెలుగును భావాన్ని నేనే
ఆకాశంగా కనిపించే నీలి రూపాన్ని నేనే
ఆకాశంలో కనిపించే సూర్య కిరణాల మేఘ వర్ణాలను నేనే
సూర్యునిలో కలిగే ప్రతి క్షణ కణ తత్వాన్ని నేనే
కంటికి కనిపించే విశ్వ భావాలు నా మేధస్సులో నావే
No comments:
Post a Comment