ఆ పేరు నీకు సరిపోలేదు ఏమిటి ఈ నామార్థం
మన పేర్లకు తగ్గట్లు మనం నడుచుకోలేక పోతున్నాం
మన మేధస్సులోని విచక్షణ భావాలకు మన నామార్థం సరికాదే
మన విజ్ఞానం మన ప్రవర్తన మన భావాలకు మన నామం సరిలేదే
మన భవిష్యత్ బాగా ఉండాలని ఆనాడు మన తల్లి తండ్రులు నామకరణం చేశారు
మన నామం ఏదైనా మనం విజ్ఞానంగా సాగితే ప్రతి నామార్థం విశిష్ట భావాలతోనే
మీరు చేసే కార్యాలలోనే మీ గుణ గణాలు లక్షణాలు ప్రవర్తన విజ్ఞానం ఆధారపడి ఉంటుంది
మీ ఆలోచనలను మీరు గమనిస్తూ మీ భావాలలో విజ్ఞానాన్ని గ్రహించి జీవనాన్ని సాగించండి
అజ్ఞాన భావాలను మానుకొని మంచి అలవాట్లతో మరొకరికి ఉపయోగపడేలా ముందుకు సాగండి
No comments:
Post a Comment