విశ్వ స్థితిని మార్చేస్తున్నారు ఇంకా ఎలా మార్చుతారో
ప్రకృతి భావ స్వభావాలు తగ్గిపోయి కృత్రిమ జీవితాన్ని కల్పిస్తున్నారు
రాబోయే తరానికి ప్రకృతి భావాలు గురించే తెలియుటకు ఓ అధ్యాయమే
ప్రకృతిని చెట్లుగా చూస్తూ తెలిసిన వారేగాని వాతావరణ పర్యావరణం అంటే తెలియదు
విశ్వ ప్రకృతిలో ఎన్నో రకాల విశ్వ భావ స్వభావాలతో జీవ తత్వాలతో ఎన్నో రూపాలున్నాయి
అటవి సంపదలో విశ్వ ప్రకృతి ప్రాణ వాయువుగా ఆయుర్వేదంగా ఎన్నో భావ స్వభావాలు
నీటితో చెరువులు నదులు సముద్రాలు రాళ్ళతో కొండలు లోయలు పర్వతాలు అన్నీ ప్రకృతియే
పంచ భూతాలుగా విశ్వమున సూక్ష్మం నుండి మహా రూపాల వరకు ఎన్నో ప్రకృతి భావాలతో
విశ్వ తత్వాల భావ స్వభావాలలోనే విశ్వ స్థితి జీవ ప్రాణ రక్షణగా ఉన్నదని ప్రకృతి సిద్ధాంతం
విశ్వ స్థితి సిద్ధాంతం నా మేధస్సులో ఓ గ్రంధము వలే విశ్వ విజ్ఞానంగా దాగి ఉన్నది
వాతావరణ కాలుష్యాన్ని తగ్గించి పరి రక్షించండి ప్రకృతి భావాలతో జీవించండి
No comments:
Post a Comment