ఏ భావన ఎక్కడ కలిగినా అక్కడే వదిలేస్తున్నా
మహా భావనైతే అవసరమైతే జ్ఞాపకంగా నాలోనే
వీలైనప్పుడు మరల ఆ భావనను జ్ఞాపకం చేసుకుంటా
కొన్ని క్షణాలు ఆ భావనతో అద్భుతంగా సాగిపోతా
మరో కొత్త భావాలకై విశ్వమున అన్వేషిస్తూ వెళ్ళిపోతా
మహా భావాలే జీవితాన్ని మలుపు తిప్పగలవు
ఏ భావనలో ఏ విజ్ఞాన అర్థమున్నదో మేధస్సుకే తెలియాలి
మేధస్సుకున్న అనుభవంతోనే ఇంకా విశ్వార్థాన్ని గ్రహిస్తుంది
భావనలో ఉన్న సూక్ష్మ భావార్థం ఆత్మ ధ్యాసకే తెలియును
No comments:
Post a Comment