Friday, September 13, 2019

కాలం నీదేనయ్యా! ఓ విశ్వ మానవా

కాలం నీదేనయ్యా! ఓ విశ్వ మానవా
జీవం నీదేనయ్యా! ఓ విశ్వ మానవా
రూపం నీదేనయ్యా! ఓ విశ్వ మానవా
దేహం నీదేనయ్యా! ఓ విశ్వ మానవా

కాలంతో సాగే కార్యాలలో కలిగే మార్పులకు కారణం మనదేనయ్యా  || కాలం ||

కాలం ఇచ్చిన రూపమే జీవం ధరించిన దేహం
కాలం నేర్పిన జ్ఞానమే భావం వహించిన వేదం

రూపం తలచిన మోహమే దేహం సహించిన మౌనం
రూపం వలచిన తత్వమే యోగం తపించిన దైవం    || కాలం ||

బంధం ఇచ్చిన రూపమే కాలం సాగించిన ఆకారం
బంధం తెచ్చిన ప్రతిష్టే దేహం కలిగించిన గౌరవం

కార్యం సాగిన విధమే రూపం అలిగిన వైనం
కార్యం కోరిన మార్గమే జీవం చెదిరిన విధానం  || కాలం ||

No comments:

Post a Comment