నీ శ్వాసలోనే జీవిస్తున్నా
నీ ధ్యాసలోనే ధ్యానిస్తున్నా
నీ భాషలోనే స్మరిస్తున్నా
నీ యాసలోనే గమనిస్తున్నా
నీ రూపంలోనే దైవాన్ని నడిపిస్తున్నా
నీ దేహంలోనే సత్యాన్ని ఆచరిస్తున్నా
ప్రతి జీవంలోనే భావ తత్వాలను ఆలోచనలతో ఊరిస్తున్నా || నీ శ్వాసలోనే ||
ఏ జీవి రూపమైనా మేధస్సుతోనే జీవించేలా ఆధారం కల్పిస్తున్నా
ఏ జీవి దేహమైనా మనస్సుతోనే చలించేలా అవకాశం కల్గిస్తున్నా
ఏ జీవి భావమైనా మేధస్సుతోనే గ్రహించేలా ఆలోచనలను ఊరిస్తున్నా
ఏ జీవి తత్వమైనా మేధస్సుతోనే గమనించేలా యోచనలను మార్చేస్తున్నా || నీ శ్వాసలోనే ||
ఏ జీవి బంధమైనా మేధస్సుతోనే స్పర్శించేలా జ్ఞానాన్ని జోడిస్తున్నా
ఏ జీవి వేదమైనా మేధస్సుతోనే అర్థించేలా గుణాన్ని వివరిస్తున్నా
ఏ జీవి కార్యమైనా మేధస్సుతోనే కృషించేలా సహనాన్ని సాగిస్తున్నా
ఏ జీవి కాలమైనా మేధస్సుతోనే శోధించేలా సమయాన్ని నియమిస్తున్నా || నీ శ్వాసలోనే ||

No comments:
Post a Comment