Friday, September 20, 2019

మరణం ఉందని తెలిసిన నాడే శ్వాసను స్మరించెదవు

మరణం ఉందని తెలిసిన నాడే శ్వాసను స్మరించెదవు
జననం ఉందని తెలిసిన నాడే ధ్యాసను గమనించెదవు

మరణం ఎప్పుడో తెలియకనే నిత్యం శ్వాసతో ధ్యానించెదవు
జననం ఎప్పుడో తెలియకనే సర్వం ధ్యాసతో సందర్శించెదవు

ఉచ్చ్వాస నిచ్చ్వాసాలతో సాగే నీ దేహం శ్వాస ధ్యాసతో జీవమై నిలిచినది
శ్వాస ధ్యాసతో సాగే నీ రూపం మహా భావాల తత్వంతో ఆత్మగా నిర్మితమైనది  || మరణం ||

మేధస్సుతో ఎదిగే నీ రూప దేహం నీ జీవన విధానాన్ని తెలిపేను
ఆలోచనతో ఒదిగే నీ భావ తత్వం నీ జీవిత వైఖరిని తెలియజేసేను

రూపంతో నీవు నడిచే కాలం నిన్ను అనేక కార్యాలతో సాగించేను
దేహంతో నీవు నిలిచే కాలం నిన్ను అనేక బంధాలతో నిలిపేను    || మరణం ||

మరణం ఏనాటికో అని గ్రహించినా నీ జీవన విధానం శ్వాస ధ్యాసతోనే సాగించేను
జననం ఎక్కడిదో అని గమనించినా నీ జీవిత వేదనం భావ తత్వంతోనే వృద్ధించేను 

శ్వాసతోనే నీ ధ్యానం గమనం అదే మనస్సుకు ప్రశాంతమైన సుదీర్ఘ కాల జీవనం
ధ్యాసతోనే నీ యోగం చలనం అదే వయస్సుకు సౌభాగ్యమైన సుందర కాల జీవితం  || మరణం || 

No comments:

Post a Comment