హే రామచంద్ర ప్రభో ఏ రామప్రభ ప్రభో శ్రీ రామకాంత ప్రభో
అంతా రామమయం రామా ఈ జగమంతా శ్రీ రామమయం శ్రీ రామా
సీతా రామం శ్రీరామ బంధం సీతా నామం శ్రీ రామామయం
అంతా రామమయం రామా ఈ విశ్వమంతా శ్రీ రామమయం శ్రీ రామా
దేశ ప్రదేశం రామమయం దేశ విదేశం రామమయం దేశ దేశం రామమయం
దేహ ప్రదేశం రామమయం దేహ విదేశం రామమయం దేహ దేశం రామమయం || హే రామచంద్ర ||
ప్రకృతి ఆకృతి రామమయం సుమతి శ్రీమతి సీతా రామమయం
ప్రణతి ప్రసూతి రామమయం భవతి ప్రగతి సీతా రామమయం
జగమంతా శ్రీరామ నామ జప భావం విశ్వమంతా శ్రీరామ నాద జప తత్వం
జగమంతా శ్రీరామ నామ జప కార్యం విశ్వమంతా శ్రీరామ నాద జప కాలం
జన్మ జన్మల రామ నామం జనుల హృదయాలతో కలిగే జగమంతా పవిత్రమయం
జన్మ జన్మల రామ నామం జనుల హృదయాలతో కలిగే విశ్వమంతా పునీతమయం
జీవ భావాల జీవన తత్వం దేహ భావాల జీవిత తత్వం శ్రీ రామ నామ దీక్ష మయం
జీవ బంధాల జీవన నాదం దేహ బంధాల జీవిత నాదం శ్రీ రామ నామ మోక్ష మయం
శ్రీ రామ రామ రామ నామ పరమానందం పవిత్రం పరిశుద్ధం పర్యావరణం
శ్రీ రామ రామ రామ నామ పరమానందం ప్రఖ్యాతం ప్రసిద్ధం పత్రహరితం
రామ రామ రామ రామ ... రామ రామ రామ రామ ... రామ రామ రామ రామ
శ్రీరామమయం ఈ జగమంతా శ్రీరామమయం ఈ లోకమంతట అంతా రామమయం
రామ రామ రామ రామ ... రామ రామ రామ రామ ... రామ రామ రామ రామ
శ్రీరామమయం ఈ విశ్వమంతా శ్రీరామమయం ఈ లోకమంతట అంతా రామమయం || హే రామచంద్ర ||
సూర్యోదయమై ఉదయించెదవు పూర్వోదయమై విశ్వమంతా అంతర్యామివై అవతరించెదవు
మహోదయమై ఉద్భవించెదవు మహోన్నతమై జగమంతా స్వయంభువమై ఆహ్వానించెదవు
పూజ్యోదయమై పరిమళించెదవు నవోదయమై నిరంతరం నడిపించెదవు
కార్యోదయమై ప్రారభించెదవు సర్వోదయమై సర్వాంతరం సమీపించెదవు
జీవోదయమై ప్రయాణించెదవు జ్ఞానోదయమై విస్తరించెదవు జన్మోదయమై శ్రమించెదవు
భావోదయమై ప్రభవించెదవు తత్త్వోదయమై విన్నవించెదవు రూపోదయమై శాంతించెదవు
రామ నామంతో నవ జీవన భక్తిని కలిగించెదవు జీవన మూర్తిగా లక్ష్యాన్ని సాధించెదవు
రామ నాదంతో యువ జీవిత శక్తిని అందించెదవు జీవిత మూర్తిగా ధర్మాన్ని సహించెదవు
రామ రామ రామ రామ శ్రీరామ ... జయ రామ ... దేహ ప్రదేశమంతా రామమయం
రామ రామ రామ రామ శ్రీరామ ... జయ రామ ... దివ్య ప్రదేశమంతా రామమయం
అంతా రామమయం రామా ప్రజల పరిశోధన పరిశుద్ధమైన జ్ఞాన విజ్ఞాన విశ్వమయం
అంతా రామమయం రామా ప్రజల పర్యవేక్షణ పరిపూర్ణమైన జ్ఞాన ప్రజ్ఞాన విశ్వమయం
అంతా రామమయం రామా ఈ జగమంతా శ్రీరామయం అంతా ప్రశాంతమయం
అంతా రామమయం రామా ఈ విశ్వమంతా శ్రీరామయం అంతా ప్రశాంతమయం
ఎవరిని తలచిన ఎవరిని కొలిచిన
ఎవరిని పిలిచిన ఎవరిని పలికించిన రామ నామమే రామా ... అంతా రామమయమే శ్రీ రామ రఘురామ
ఎవరిని అడిగిన ఎవరిని కలిసిన
ఎవరిని స్మరించిన ఎవరిని శృతించిన రామ నామమే రామా ... అంతా రామమయమే శ్రీ రామ రఘురామ
రామ రామ రామ రామ ... రామ రామ రామ రామ ... రామ రామ రామ రామ శ్రీరామ
రామ రామ రామ రామ ... రామ రామ రామ రామ ... రామ రామ రామ రామ శ్రీరామ
జై శ్రీరామ్ ... జై శ్రీరామ్ ... జై శ్రీరామ్ ... జై శ్రీరామ్ ... జై శ్రీరామ్ ... జై శ్రీరామ్
జయ జయ జయ .. జయ జయ జయ .. జయ జయ జయ .. జయహే జై శ్రీరామ్ || హే రామచంద్ర ||