ప్రతి జీవి ఆహార పదార్థమే మానవుడు కూడా ఆహార పదార్థమే
ప్రతి జీవి ప్రకృతి నుండి ఉద్భవించినదే
పూర్వం ప్రతి జీవి ఆహారం కోసం అన్వేషించేది
శాఖాహార మాంసాహార జీవులు ప్రకృతిలో ఆహారాన్ని వివిధ రకాలుగా సేకరిస్తూ జీవించేవి
పూర్వం మానవుడు కూడా వివిధ మాంసాహార జీవులకు ఆహారమైనాడు
ప్రతి శాకాహార జీవి మాంసాహార జీవికి ఆహారమయ్యేది
శాకాహార జీవులు భయంతో జీవించేవి మానవుడు విచక్షణతో ఎదుగుతూ మాంసాహార జీవుల నుండి రక్షించుకునేవాడు
మానవుడు విచక్షణతో ప్రకృతి ఆహార పదార్థాలను రుచిస్తూ విజ్ఞానం చెందుతూ సమాజంలో జీవన జీవితాన్ని సాగిస్తూ ప్రకృతి ఆహార పదార్థాలను పండించడం ఆరంభించి ఎదుగుతూ ఎన్నింటినో నేర్చుకున్నాడు
మానవుడు రుచించే ఆహార పదార్థాలు అనంతం
ఆహార పదార్థాలను వివిధ రూపాలుగా వివిధ రకాల మిశ్రమంతో ఆహారంగా వండుతూ [తయారు చేయడం] ఎన్నో సరికొత్త పదార్థాలను సృష్టిస్తూ భుజిస్తున్నాడు ఐనను కొన్ని సమయాలలో రుచి అందుట లేదు
ఆరోగ్యంగా ఉంటేనే ఎన్నో పదార్థాలను రుచించగలం
ఆహారంతో పాటు వివిధ రకాల అలవాట్లను నేర్చుకున్నాడు అధోగతి చెందుతున్నాడు పరిశుద్ధత పవిత్రతను కోల్పోతున్నాడు ప్రదేశాన్ని అపరిశుభ్రతగా మారుస్తున్నాడు
జీవించే ప్రదేశాన్ని జీవించలేని ప్రదేశంగా మారుస్తున్నాడు
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment