Sunday, January 5, 2025

ప్రదేశం ప్రశాంతంగా ఉంటేనే ఏకాగ్రత

ప్రదేశం ప్రశాంతంగా ఉంటేనే ఏకాగ్రత కలుగుతూ విచక్షణకు అవగాహన కలుగుతూ అర్థాలను గ్రహిస్తూ జ్ఞాపకాలతో జ్ఞాపక శక్తిని పెంచుకుంటూ వివిధ సమయాలలో జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ వివరిస్తూ సంభాషిస్తూ విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటుంది 

ఏకాగ్రతతో ఉన్నప్పుడే ఎన్నింటినో గ్రహిస్తూ ఎన్నో తెలుసుకుంటాం ప్రకృతి ధర్మమైన భావ తత్త్వాల శాస్త్రీయ సిద్ధాంతాలను అవగాహనతో అర్థం చేసుకుంటాం 

మన ఇంటిని అధిక శాతం ప్రశాంతంగా ఉంచుకోవాలి ఏకాగ్రత వహిస్తూ విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలి 

మన సమాజాన్ని కూడా అధిక శాతం ప్రశాంతంగా పరిశుభ్రతగా పరిశుద్ధంగా విజ్ఞానంగా ఉంచుకోవాలి 

ప్రశాంతమైన ప్రదేశం పరిశుభ్రతగా పరిశుద్ధంగా ఉండాలి 

ఎంత ఎక్కువ శాతం ప్రశాంతంగా ఉంటే అంతటి విజ్ఞానాన్ని గ్రహించవచ్చు అన్ని రకాలుగా అభివృద్ధిని సాధించవచ్చు [ఆరోగ్యంగా ఆనందంగా ఆర్థికంగా అద్భుతంగా ప్రజ్ఞానంగా]


-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment