Friday, January 17, 2025

మీరు ఎవరికైనా ఏమైనా ఇవ్వాలనుకుంటే ముందుగా మీ తల్లికి ఆ తర్వాత అక్కా చెల్లెళ్ళకు ఇచ్చ్చుకోవాలి

మీరు ఎవరికైనా ఏమైనా ఇవ్వాలనుకుంటే ముందుగా మీ తల్లికి ఆ తర్వాత అక్కా చెల్లెళ్ళకు ఇచ్చ్చుకోవాలి 
ఇలా చేస్తే జన్మకు శుభప్రదం 
ఆ తర్వాత మీ తండ్రికి అన్న తమ్ముళ్ళకు ఇచ్చుకోవాలి ఎలా చేస్తే జన్మకు శుభకరం  

ఆ తర్వాత తల్లి వాళ్ళ అక్కా చెల్లెళ్ళకు వాళ్ళ కూతురులకు ఆ తర్వాత  [తల్లి వాళ్ళ అక్కా చెల్లెళ్ళ] భర్తలకు కుమారులకు ఇచ్చుకోవాలి  - ఇలా చేస్తే జన్మకు శుభయోగం 

ఆ తర్వాత తల్లి వాళ్ళ అన్న తమ్ముళ్ళకు వాళ్ళ కూతురులకు ఆ తర్వాత  [తల్లి వాళ్ళ అన్న తమ్ముళ్ళ] భార్యలకు కుమారులకు ఇచ్చుకోవాలి  - ఇలా చేస్తే జన్మకు శుభత్రయం  

ఆ తర్వాత తండ్రి వాళ్ళ అక్కా చెల్లెళ్ళకు వాళ్ళ కూతురులకు ఆ తర్వాత  [తండ్రి వాళ్ళ అక్కా చెల్లెళ్ళ] భర్తలకు కుమారులకు ఇచ్చుకోవాలి  - ఇలా చేస్తే జన్మకు శుభగుణం  

ఆ తర్వాత తండ్రి వాళ్ళ అన్న తమ్ముళ్ళకు వాళ్ళ కూతురులకు ఆ తర్వాత  [తండ్రి వాళ్ళ అన్న తమ్ముళ్ళ] భార్యలకు కుమారులకు ఇచ్చుకోవాలి  - ఇలా చేస్తే జన్మకు శుభభాగ్యం 


తండ్రివారి తరుపున తర్వాత తల్లివారి తరుపున అక్కా చెల్లెళ్ళకు అన్న తమ్ముళ్ళకు క్రమంగా ఇచ్చుకోవచ్చు 

ఇందులో ఆలోచించుటకు ఎటువంటి సందేహం లేదు 
అందరు ఆనందంగా జీవించుటకు ప్రధానమైన సుఖ సంతోష భాగ్యములతో జీవించుటకే 

అందరు తల్లి వేరు కలవారే [వేరు అంటే బంధం - చెట్టు కాండ కొమ్మలకు వేర్లు [వేళ్ళు, మూలాలు] లాగా ]

తల్లి - వేర్లు 
తండ్రి - కాండం 
అన్న తమ్ముళ్ళు అక్కా చెల్లెళ్ళు - కొమ్మలు 
కూతురులు కుమారులు [పిల్లలు] - ఆకులు 

అందరు కలిసి చెట్టులాగా జీవిస్తూ వృక్షంగా విజ్ఞానంగా ప్రశాంతంగా చెట్టు ఎలా ఉపయోగపడుతుందో కుటుంబం కూడా బంధుత్వం కూడా అలాగే వృక్షమై ఎదుగుతూ అభివృద్ధి చెందుతూ తరతరాలుగా పరిశుద్ధంగా సమయ స్ఫూర్తితో జీవిస్తూ స్వచ్ఛమైన వాతావరణంతో పరమార్థ భావ తత్త్వాలతో సాగాలి 


-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment