అవగాహన లేనప్పుడు అలవాటు చేసుకున్నావు
ఒక అలవాటుతో ఎన్నో అలవాట్లను నేర్చుకున్నావు
విజ్ఞానంతో అవగాహన కలిగినా అలవాట్లను వదలలేక పోతున్నావు
సమస్యలు ఎన్నున్నా అలవాట్లను దీర్ఘ కాలంగా సాగిస్తూనే ఉన్నావు
అలవాట్లతో అనారోగ్యం కలిగినా అనారోగ్యాన్ని కూడా ఒక (ఓ ) గొప్ప అలవాటుగా చేసుకొని దేహాన్ని వంచనతో సాగిస్తున్నావు
దేహమే లేనట్లు చేసే అలవాటు ఏ జీవికి అవసరం లేదు - ఎందుకు అంతటి అజ్ఞాన వ్యసనం
అలవాట్లతో పరిశుద్ధమైన విశ్వ ప్రదేశాన్ని స్మశానంగా [చూడలేనంతగా, నడవలేనంతగా, ఉండలేనంతగా జీవించలేనంతగా - అసభ్యకరంగా] మారుస్తున్నావు కలుషితం చేస్తున్నావు [సహజమైన మరణాలు ఎక్కడ ఉన్నాయి - శతాబ్దాలుగా ఎవరు ఆరోగ్యంతో ఉన్నారు ఎవరు దీర్ఘ కాలంతో మంచి అలవాట్లతో జీవిస్తున్నారు]
[సహజమైన జననం లేదు - సహజమైన మరణం లేదు]
జీవించుటకు వీలు కానట్లు ప్రదేశమంతా పరిశుభ్రతతో సాగుతున్నది
తరతరాల వారికి అందించే విజ్ఞానం ప్రదేశం కలుషితమైనదేనా
విజ్ఞానంతో ఎన్నో అనుభవాలు కలిగినా వదులుకోలేని అలవాట్లు మరెందరికో అందిస్తూ తరతరాల వారిగా సాగించే అపవిత్రమైన కార్యక్రమాలు
ఎంతో కాలం శ్రమించి ఇంకా శ్రమిస్తూ నేర్చుకున్నది చదువుకున్నది విజ్ఞానం ఐతే చేసే కార్యక్రమాలు, అలవాట్లు కూడా పరిశుద్ధమైన విజ్ఞాన అనుభవంతో సాగాలి కదా
-- వివరణ ఇంకా ఉంది!
No comments:
Post a Comment