Friday, January 31, 2025

ఎప్పుడు ఎవరు సరైన శ్రమను గుర్తించి సరైన జీతాన్ని ఇవ్వగలరు ఉన్నత స్థానాన్ని కలిపించెదరు

ఎప్పుడు ఎవరు సరైన శ్రమను గుర్తించి సరైన జీతాన్ని ఇవ్వగలరు ఉన్నత స్థానాన్ని కలిపించెదరు  
సరైన సమయానికి సరైన శ్రమను గుర్తించి సరైన జీతాన్ని సరైన స్థానాన్ని ఎవరు ఎలా ఇవ్వగలరు 

ఒక దశాబ్దం ఉత్తేజమైన ఆలోచనల విజ్ఞానంతో ఆరోగ్యంతో శ్రమించాను 
ఒక దశాబ్దం ఉత్తేజమైన రుధిరంతో విజ్ఞానంతో అనుభవంతో శ్రమించాను 
ఒక దశాబ్దం ఉత్తేజమైన అవయవాలతో విజ్ఞానంతో సంస్కారంతో శ్రమించాను 
ఒక దశాబ్దం ఉత్తేజమైన ఎముకలతో ప్రజ్ఞానంతో వినయంతో శ్రమించాను
ఒక దశాబ్దం మరో దశాబ్దం శతాబ్దాలుగా ఉత్తేజమైన భావ తత్త్వాలతో శ్రమిస్తున్నా గుర్తించేవారు లేరు ఇక నేనే గుర్తించలేని విధంగా నా రూపంతో మారిపోతున్నాను 

ఆయుస్సు ముగిసే వారికి [కుటుంబానికి] ఐశ్వర్యం ఆరోగ్యం ప్రశాంతం అనుబంధం చాలా అవసరం 

శరీరం శూన్యమౌతున్నా విశ్వ భావ తత్త్వాలతో అనంత జీవుల మేధస్సులలో ఉత్తేజమైన విజ్ఞాన భావ తత్వాలతో శ్రమిస్తూనే జగతిలో పర రూపంతో ప్రకృతి అనుభవాలతో నిరంతరం జీవిస్తూనే ఉంటాను 

ఒకరి శ్రమతో ఎందరో శ్రమతో ఎదుగుతున్నావు - ఎదిగిన తర్వాత వారి శ్రమకు సరైన జీతాలు ఇవ్వకపోతే వారి కుటుంబాలకు అర్థం లేదు ఎదిగిన నీకు పరమార్థం లేదు 

విజ్ఞానంగా ఆర్థికంగా విలాసవంతంగా ఎదిగినా ఒకరి శ్రమను ఒకరు చెప్పేంతవరకు నీవు ఎదగలేనప్పుడు నీవు తెలుసుకోలేనప్పుడు నీవు సామాన్యుడివే 

నేటిది నీదైతే రేపటిది నీది కానప్పుడు నీతో శ్రమించిన వారికి రేపటికి భవిష్య జీవితాన్ని ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందంతో అందించు 

ఒక సంస్థలో అందరు అభివృద్ధి [ఆరోగ్యం విజ్ఞానం ఐశ్వర్యం] చెందాలి అందరి కుటుంబాలు ఆనందంతో సాగాలి అందరిని గౌరవించుకోవాలి 

ఒకరు ఉన్నప్పుడే ఆనందాన్ని [ఆరోగ్యం విజ్ఞానం ఐశ్వర్యం] అందించు లేనప్పుడు ఏమి ఇవ్వలేవు చూడలేవు తలచలేవు చేయలేవు [నీవు చేయగలిగేది కూడా ఎంతో మిగిపోతుంది - నీవు అదృశ్యమై పోతావు]

నీతో శ్రమించిన వారిని నీవు ఆదుకుంటే నీ తరాల వారిని వీరి [వాళ్ళ] తరాల వారు ఆదుకుంటారు 

ఎప్పుడు ఎవరికి ఏ ఆపద ఎలా సంభవిస్తుందో ఎవరికి తెలుసు - ఎవరు ఆదుకుంటారా ఆదుకోరో తెలియని స్థితిలో నీవు జీవిస్తావు 


-- వివరణ ఇంకా ఉంది!

No comments:

Post a Comment