Friday, January 17, 2025

మానవా! పూర్వం నీవు భగవంతుడు కావచ్చు

మానవా! పూర్వం నీవు భగవంతుడు కావచ్చు కానీ ఇప్పుడు అందరు నిన్ను మనిషిలాగే చూస్తున్నారు  

మనిషి మనిషిని గుర్తించటంలో ఆనాటి భావ తత్త్వాలు మేధస్సులలో నేడు సాగటం లేదు కలగటం లేదు 

 నేటి భగవంతుడు కూడా శ్రమించడమే జీవితం గౌరవం ఆదర్శం  


-- వివరణ ఇంకా ఉంది!

మీరు ఎవరికైనా ఏమైనా ఇవ్వాలనుకుంటే ముందుగా మీ తల్లికి ఆ తర్వాత అక్కా చెల్లెళ్ళకు ఇచ్చ్చుకోవాలి

మీరు ఎవరికైనా ఏమైనా ఇవ్వాలనుకుంటే ముందుగా మీ తల్లికి ఆ తర్వాత అక్కా చెల్లెళ్ళకు ఇచ్చ్చుకోవాలి 
ఇలా చేస్తే జన్మకు శుభప్రదం 
ఆ తర్వాత మీ తండ్రికి అన్న తమ్ముళ్ళకు ఇచ్చుకోవాలి ఎలా చేస్తే జన్మకు శుభకరం  

ఆ తర్వాత తల్లి వాళ్ళ అక్కా చెల్లెళ్ళకు వాళ్ళ కూతురులకు ఆ తర్వాత  [తల్లి వాళ్ళ అక్కా చెల్లెళ్ళ] భర్తలకు కుమారులకు ఇచ్చుకోవాలి  - ఇలా చేస్తే జన్మకు శుభయోగం 

ఆ తర్వాత తల్లి వాళ్ళ అన్న తమ్ముళ్ళకు వాళ్ళ కూతురులకు ఆ తర్వాత  [తల్లి వాళ్ళ అన్న తమ్ముళ్ళ] భార్యలకు కుమారులకు ఇచ్చుకోవాలి  - ఇలా చేస్తే జన్మకు శుభత్రయం  

ఆ తర్వాత తండ్రి వాళ్ళ అక్కా చెల్లెళ్ళకు వాళ్ళ కూతురులకు ఆ తర్వాత  [తండ్రి వాళ్ళ అక్కా చెల్లెళ్ళ] భర్తలకు కుమారులకు ఇచ్చుకోవాలి  - ఇలా చేస్తే జన్మకు శుభగుణం  

ఆ తర్వాత తండ్రి వాళ్ళ అన్న తమ్ముళ్ళకు వాళ్ళ కూతురులకు ఆ తర్వాత  [తండ్రి వాళ్ళ అన్న తమ్ముళ్ళ] భార్యలకు కుమారులకు ఇచ్చుకోవాలి  - ఇలా చేస్తే జన్మకు శుభభాగ్యం 


తండ్రివారి తరుపున తర్వాత తల్లివారి తరుపున అక్కా చెల్లెళ్ళకు అన్న తమ్ముళ్ళకు క్రమంగా ఇచ్చుకోవచ్చు 

ఇందులో ఆలోచించుటకు ఎటువంటి సందేహం లేదు 
అందరు ఆనందంగా జీవించుటకు ప్రధానమైన సుఖ సంతోష భాగ్యములతో జీవించుటకే 

అందరు తల్లి వేరు కలవారే [వేరు అంటే బంధం - చెట్టు కాండ కొమ్మలకు వేర్లు [వేళ్ళు, మూలాలు] లాగా ]

తల్లి - వేర్లు 
తండ్రి - కాండం 
అన్న తమ్ముళ్ళు అక్కా చెల్లెళ్ళు - కొమ్మలు 
కూతురులు కుమారులు [పిల్లలు] - ఆకులు 

అందరు కలిసి చెట్టులాగా జీవిస్తూ వృక్షంగా విజ్ఞానంగా ప్రశాంతంగా చెట్టు ఎలా ఉపయోగపడుతుందో కుటుంబం కూడా బంధుత్వం కూడా అలాగే వృక్షమై ఎదుగుతూ అభివృద్ధి చెందుతూ తరతరాలుగా పరిశుద్ధంగా సమయ స్ఫూర్తితో జీవిస్తూ స్వచ్ఛమైన వాతావరణంతో పరమార్థ భావ తత్త్వాలతో సాగాలి 


-- వివరణ ఇంకా ఉంది!

స్నేహత్వం సమయానికి సహాయం సరలంగా సహకరించేను

స్నేహత్వం సమయానికి సహాయం సరలంగా సహకరించేను [అందించేను]

స్నేహత్వానికి బంధుత్వం అవసరం లేదు - పరిచయం లేకున్నా కొన్ని సందర్భాలలో సహాయం అందించి వెళ్ళిపోయెదరు ప్రాణాలను బ్రతికించి తెలియకుండానే కనిపించకుండా వెళ్ళిపోయెదరు 

సహాయం అందించే ప్రతి జీవికి అన్ని విధాలా అన్ని క్షణాల కృతఙ్ఞతలు 
సహాయం అందించే వారికి కూడా మరో సహాయాన్ని అందించే వారు ఉదయించాలి 

-- వివరణ ఇంకా ఉంది!

నీవు ఉన్న స్థానంలో సక్రమమైన ఎదుగుదల ఉన్నప్పుడు ఆ స్థానాన్ని వదులుకోవద్దు

నీవు ఉన్న స్థానంలో సక్రమమైన ఎదుగుదల ఉన్నప్పుడు ఆ స్థానాన్ని వదులుకోవద్దు 

నీవు అభివృద్ధి ఉన్న స్థానాన్ని వదులుకుంటే ఇక ఎప్పుడూ అభివృద్ధి చెందలేవు [కాలం కలసి రాకపొతే తప్ప] 

అభివృద్ధి ఉన్న స్థానాన్ని కుటుంబానికి అన్ని విధాలా సామర్థ్యం కలిగే వరకు వదులుకోవద్దు 

కుటుంబానికి ఆరోగ్యం విజ్ఞానం ఉద్యోగం ఐశ్వర్యం సత్ప్రవర్తన [బంధుత్వం సంతానం ప్రశాంతత సౌఖ్యత] కలిగే వరకు ఆర్థికంగా నీ స్థానాన్ని అభివృద్ధి చేసుకో ఆరోగ్యంగా విజ్ఞానంగా ప్రశాంతంగా సాగిపో 

స్నేహత్వం కూడా ఒక బంధుత్వమే - సమయానికి సహాయం సహకరించేను [అందించేను]


-- వివరణ ఇంకా ఉంది!

Thursday, January 16, 2025

ప్రకృతి ఇచ్చే మంచి చెడులలో చెడును పెంచుకోవద్దు మంచిని వదులుకోవద్దు

ప్రకృతి ఇచ్చే మంచి చెడులలో చెడును పెంచుకోవద్దు మంచిని వదులుకోవద్దు మంచిని వృధా చెందనివ్వద్దు 

చెడును పెంచుకుంటే మనిషిని కూడా వృధాగా మారుస్తుంది 


-- వివరణ ఇంకా ఉంది  

ప్రకృతికి నీటిని సరైన విధంగా సరైన సమయంలో భిక్షంగా అందించి చూడు

ప్రకృతికి నీటిని సరైన విధంగా సరైన సమయంలో భిక్షంగా అందించినా వృక్ష సంపదగా అభివృద్ధి చెంది ఎన్నో జీవులకు ఆహారంగా వివిధ సౌకర్యాలను వసతులను అందిస్తుంది రక్షిస్తుంది 

ప్రకృతి పరిశుద్ధమైన ప్రాణవాయువును నిరంతరం  అందిస్తుంది అలాగే అపూర్వమైన అమరమైన ధీర్ఘ కాల ప్రయోజనం కలిగే అపారమైన ఔషధాలను మూలికలను అందిస్తుంది 

ప్రకృతిలోని గుణాలు లక్షణాలు అనంతం వాటిని పొందే జీవులకు ఆహారం ఆరోగ్యం ఆనందం ప్రశాంతత పరిశుద్ధత అవసరం 

ప్రకృతి సర్వస్వాన్ని అందిస్తుంది - మనం పొందే ప్రతీది ప్రకృతి భిక్షమయే 


--- వివరణ ఇంకా ఉంది!   

Friday, January 10, 2025

ఎవరికి ఎక్కడ ఎప్పుడు ఎందుకు ఎటువంటి స్థానం ఎలా కలుగునో ఎవరికి తెలుసు

ఎవరికి ఎక్కడ ఎప్పుడు ఎందుకు ఎటువంటి స్థానం ఎలా కలుగునో ఎవరికి తెలుసో పరమాత్మ ఎలా తెలుసో పరంధామ  


-- వివరణ ఇంకా ఉంది!

అల్పాన్ని సమపాళలో పంచితే సమానత్వం ప్రశాంతమైన విజ్ఞాన వినయత్వాన్ని కలిగిస్తుంది

అల్పాన్ని (అల్పత్వమైన భాగాన్ని) సమపాళలో పంచితే సమానత్వం ప్రశాంతమైన విజ్ఞాన వినయత్వాన్ని కలిగిస్తుంది  

అల్పము అమృతమై అధికమై సందర్భానికి సమయోచితంగా ప్రయోజనాన్ని కలిగిస్తుంది 
అల్పము ఆలస్యమైతే అనాగతమై సమాయానికి వృధాగా నిష్ప్రయోజనాన్ని కలిగిస్తుంది [అందిస్తుంది]

మేధావుల మహాత్మ తత్వం సమయస్ఫూర్తితో సమపాళలో సదృశ్య భావాలతో ఉంటుంది   

ఇంటిలోనైనను ఎక్కడైనను సమపాళలో పంచుకుంటే సమయానికి అర్థం చేసుకుంటే సదృశ్యంగా చూసుకుంటే ఏ జీవికైనా ఆనందమైన పరమ ప్రశాంతత కలుగుతుంది 


-- వివరణ ఇంకా ఉంది!

ఆరోగ్య ధాత అభివందనం ఆలోచనకు అపూర్వమైన ఆనంద సమ్మేళనం

ఆరోగ్య ధాత అభివందనం ఆలోచనకు అపూర్వమైన ఆనంద సమ్మేళనం  

ఆరోగ్యం ఉంటేనే మేధస్సులో ఆలోచనల ఉత్తేజం దేహస్సులో ప్రక్రియల సామర్థ్యం రూపంలో కదలికల కాంచనం 
ఆరోగ్యం ప్రతి జీవికి దేహాన్ని ధృడ పరిచే అపార శక్తి గల శ్వాస సంభూతమైన పరమ ఔషధం 
ఆహారాన్ని ప్రశాంతతను ఆరోగ్యానికై పంచితే మహా యోగ ధాతవై మహాత్ముడివై జీవిస్తావు 

-- వివరణ ఇంకా ఉంది!

ప్రణాయకుడవై విశ్వ ప్రణాళికను క్రమ విధంగా పరిశుద్ధమైన విజ్ఞానంతో పరిశోధించి

ప్రణాయకుడవై విశ్వ ప్రణాళికను క్రమ విధంగా పరిశుద్ధమైన విజ్ఞానంతో పరిశోధించి జీవన పరిపూర్ణతకై కాలజ్ఞాన  కార్యక్రమాలను సామరస్యంగా సహజమైన ప్రకృతి అభివృద్ధితో అనంత భవిష్య జీవితాలకై నిష్ఠతో అవలంబించవా మహాప్రభూ!


-- వివరణ ఇంకా ఉంది! 

చీకటితో [లో] ఆలోచించే మేధస్సు పర ధ్యాస ప్రభావమై రక్షణతో సాధన చేస్తూ శ్రమించునూ

చీకటితో [లో] ఆలోచించే మేధస్సు పర ధ్యాస ప్రభావమై రక్షణతో సాధన చేస్తూ శ్రమించునూ  



-- వివరణ ఇంకా ఉంది!

పాదముల క్రింది అంచుల నుండి శిరస్సు పై అంచుల వరకు శ్వాస ప్రయాస

పాదముల క్రింది అంచుల నుండి శిరస్సు పై అంచుల వరకు శ్వాస ప్రయాసపై ధ్యాసను గమనించే ఏకాగ్రత ఇంద్రియముల నవ రంధ్రముల విచక్షణకు ఆరోగ్య అభివృద్ధి చేసే సాధన ఉచ్చ్వాస నిచ్ఛ్వాస ప్రభావములలోనే ఉంది పురుషోత్తమా పురంధి పురోగమనమా 


-- వివరణ ఇంకా ఉంది!

ఇచ్చిన కానుకలు వరములై తిరిగి వచ్చేనా మహాదేవా ఓ మహాత్మా

ఇచ్చిన కానుకలు వరములై తిరిగి వచ్చేనా మహాదేవా ఓ మహాత్మా 
సమర్పించిన కానుకలు వరములై మానవ జీవితాలనే మార్చేనా 

వరములే సరైన సమయానికి సందర్భములై జీవన అభివృద్ధి ప్రగతికై తోడ్పడేనా దేవా 
ముడుపులే మనిషికి మంచిని కలిగించే మహోత్తరమైన శక్తి సామర్థ్యాలై ఎగిసేనా 


-- వివరణ ఇంకా ఉంది!

Thursday, January 9, 2025

జీవితంలో ఏమున్నది విజయం లేని జీవం వివిధ పరిస్థితుల బంధాలతో సాగడం తప్పా!

జీవితంలో ఏమున్నది విజయం లేని జీవం వివిధ పరిస్థితుల బంధాలతో సాగుతున్న దేహ శ్రమయానికి సరిపోని జీతాల ఖర్చులతో సాగే అనారోగ్య శరీరం తప్పా!...  అశాశ్విత అల్ప (క్షణ) కాల సంతోషాల సమయ శ్రమయ కారణ కార్యక్రమాలేగా 

శ్రమించడంతో సంతోషాలు కూడా పొందలేని అనారోగ్య దేహం వివిధ బంధాల పరిస్థితుల జీవన విధానం 

మేధస్సు ఒకటి తలిస్తే కార్యం కాలం ప్రదేశం ప్రయాణం బంధం మరొకటి విధిగా ఎదురౌతూ అఖండమైన శ్రమకు ఫలితం లేనట్లుగా మార్చేస్తుంది (దేహం ప్రశాంతతను కోల్పోతుంది అనారోగ్యాన్ని వహిస్తుంది)



-- వివరణ ఇంకా ఉంది!

మనిషికి పరిశుభ్రత పరిశుద్ధతయే ప్రదానం ఆ తర్వాతే క్రమశిక్షణ విజ్ఞానం విద్యాభ్యాసం ఆచరణ

మనిషికి పరిశుభ్రత పరిశుద్ధతయే ప్రదానం ఆ తర్వాతే క్రమశిక్షణ విజ్ఞానం విద్యాభ్యాసం ఆచరణ 

ఏ వయస్సు వారికైనా ప్రతి కార్యాన్ని పరిశుభ్రత పరిశుద్ధతతో నేర్చుకునేలా శిక్షణ ఇవ్వండి  

ఎంతటి అద్భుతమైన విజ్ఞానం ఉన్నా పరిశుభ్రత పరిశుద్ధత లేన్నప్పుడు విశ్వానికి అద్భుతాలు విజ్ఞానం అవసరం లేదు 

విశ్వ ప్రకృతి ఎల్లప్పుడూ పరిశుభ్రత పరిశుద్ధతనే కోరుకుంటుంది అందులోనే అద్భుతమైన పరిశోధన విజ్ఞాన భావ తత్త్వాలు దాగి ఉన్నాయి 

విశ్వాన్ని ఎంత అద్భుతంగా సువర్ణముతో సృష్టించినా మానవ అలవాట్లతో విశ్వ ప్రకృతి ప్రదేశమంతా అశుద్ధమై జగమంతా కాలుష్యమౌతుంది 


-- వివరణ ఇంకా ఉంది!

కాల కృత్యములను పరిశుభ్రతగా ముగించుకోవాలి ప్రదేశాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి

కాల కృత్యములను పరిశుభ్రతగా ముగించుకోవాలి  ప్రదేశాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి  




-- వివరణ ఇంకా ఉంది!

Sunday, January 5, 2025

మేధస్సుతో ఎంతటి విజ్ఞానవంతమైన అద్భుతాలను సృష్టిస్తున్నా దేహా జీర్ణక్రియ అంతకన్నా గొప్పగా జీర్ణించాలి

మేధస్సుతో ఎంతటి విజ్ఞానవంతమైన అద్భుతాలను సృష్టిస్తున్నా దేహా జీర్ణక్రియ అంతకన్నా గొప్పగా జీర్ణించాలి 

దేహస్సు జీర్ణక్రియ ఎంత గొప్పగా ఉంటుందో అంత గొప్పగా ఆరోగ్యాంగా విజ్ఞానంగా జీవిస్తూ అద్భుతాలను సృష్టిస్తూ ఎంతో కాలం శ్రమించగలవు అందరికి అండగా ఉండగలవు 


-- వివరణ ఇంకా ఉంది! 

దేహం ప్రశాంతగా వివిధ ప్రక్రియలతో జీవిస్తున్నది

దేహం ప్రశాంతగా వివిధ ప్రక్రియలతో జీవిస్తున్నది 
మేధస్సు విజ్ఞానంగా వివిధ ఆలోచనలతో జ్ఞానిస్తున్నది 

స్వరం విభిన్నంగా వివిధ ప్రభావాలతో స్పందిస్తున్నది 

-- వివరణ ఇంకా ఉంది!  

ప్రతి అణువుపై ధ్యాస ఉంచి జీవన విధాన జీవితాలను యుగయుగాలుగా

ప్రతి అణువుపై ధ్యాస ఉంచి జీవన విధాన జీవితాలను యుగయుగాలుగా తరతరాలుగా భావ తత్త్వాలను గమనిస్తూ సాగుతున్నావా మహాదేవా!  


-- వివరణ ఇంకా ఉంది!

శరీరంలో ప్రతి అణువు అనారోగ్యమౌతున్నా

శరీరంలో ప్రతి అణువు అనారోగ్యమౌతున్నా యుగాలుగా జీవించుటకు ఆరోగ్యవంతమైన ప్రకృతి ప్రభావిత పరిశుద్ధ ప్రాణ వాయువుతో దివ్యమైన భావ తత్త్వాలను కలిగిస్తున్నందుకు దేహం ఉత్తేజంతో నిరంతరం సాగుతున్నది దేవా!  



-- వివరణ ఇంకా ఉంది!

ప్రదేశం ప్రశాంతంగా ఉంటేనే ఏకాగ్రత

ప్రదేశం ప్రశాంతంగా ఉంటేనే ఏకాగ్రత కలుగుతూ విచక్షణకు అవగాహన కలుగుతూ అర్థాలను గ్రహిస్తూ జ్ఞాపకాలతో జ్ఞాపక శక్తిని పెంచుకుంటూ వివిధ సమయాలలో జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ వివరిస్తూ సంభాషిస్తూ విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటుంది 

ఏకాగ్రతతో ఉన్నప్పుడే ఎన్నింటినో గ్రహిస్తూ ఎన్నో తెలుసుకుంటాం ప్రకృతి ధర్మమైన భావ తత్త్వాల శాస్త్రీయ సిద్ధాంతాలను అవగాహనతో అర్థం చేసుకుంటాం 

మన ఇంటిని అధిక శాతం ప్రశాంతంగా ఉంచుకోవాలి ఏకాగ్రత వహిస్తూ విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలి 

మన సమాజాన్ని కూడా అధిక శాతం ప్రశాంతంగా పరిశుభ్రతగా పరిశుద్ధంగా విజ్ఞానంగా ఉంచుకోవాలి 

ప్రశాంతమైన ప్రదేశం పరిశుభ్రతగా పరిశుద్ధంగా ఉండాలి 

ఎంత ఎక్కువ శాతం ప్రశాంతంగా ఉంటే అంతటి విజ్ఞానాన్ని గ్రహించవచ్చు అన్ని రకాలుగా అభివృద్ధిని సాధించవచ్చు [ఆరోగ్యంగా ఆనందంగా ఆర్థికంగా అద్భుతంగా ప్రజ్ఞానంగా]


-- వివరణ ఇంకా ఉంది!

శరీరం దృఢత్వం కావాలంటే సరైన విధమైన ఆహారం సరైన సమయానికి సమపాళతో దేహానికి అందించాలి

శరీరం దృఢత్వం కావాలంటే సరైన విధమైన ఆహారం సరైన సమయానికి సమపాళతో దేహానికి అందించాలి 

శరీరానికి ఆహారంతో పాటు శ్రమించడం వ్యాయామం చేయడం అలవాటుగా ఉండాలి 

శరీరం సరైన నిద్ర విశ్రాంతి తీసుకోవాలి దేహాన్ని ఆరోగ్యాంగా ఉంచుకోవాలి 
 
శరీర ఆరోగ్యంతో పాటు మేధస్సును ఉత్తేజం చేసుకుంటూ ఏకాగ్రతను పెంచుకుంటూ అర్థాలను గ్రహిస్తూ విజ్ఞానంతో అభివృద్ధి చెందాలి   


-- వివరణ ఇంకా ఉంది!

ఏ విధమైన మలినమైనను ఎంతటి మలినమైనను ప్రకృతియే పరిశుద్ధం చేయగలదు

ఏ విధమైన మలినమైనను ఎంతటి మలినమైనను ప్రకృతియే పరిశుద్ధం చేయగలదు సహజంగా పరిశుభ్రతగా మార్చగలదు 

ప్రకృతియే మలినాన్ని పరిశుద్ధం చేస్తున్నది  [ఏ విధమైన ఎంతగా ఉన్నా ఎక్కడ ఉన్నా ]

మానవుడు జీవించుటలో వ్యర్థమైన వృధా ఐనా ఏ విధమైన పదార్థాలను గాని  వస్తువులను గాని ఇతర నిర్మాణ మిశ్రమములను గాని  ప్రకృతియే వివిధ తత్త్వాల ప్రభావాలతో పరిసర ప్రాంతాలను పరిశుభ్రత చేయగలదు పరిశుద్ధంగా మార్చగలదు 


-- వివరణ ఇంకా ఉంది!

నేను మనిషిని కానా మనిషిగా లేనా

నేను మనిషిని కానా మనిషిగా లేనా 
నేను మనిషిగా మారలేనా మనిషిగా ఉండలేనా 

మనిషిని మనిషిగా చూసుకోనా మనిషిని మనిషిగా మార్చుకోనా 
మనిషిని మనిషిగా చేర్చుకోనా మనిషిని మనిషిగా చాటుకోనా 

మనిషియే మనిషిగా ఉండటం మానవత్వం 
మనిషియే మానవుడితో జీవిచడం సహజత్వం 

ప్రతి మనిషిని మరో మనిషియే జాగ్రత్తగా చూసుకోవాలి 
ప్రతి మనిషిని మరో మనిషియే అర్థం చేసుకోవాలి 

ప్రతి మనిషికి మరో మనిషి అవసరం 
ప్రతి మనిషికి మరో మనిషి ఆశ్రయం 


 -- వివరణ ఇంకా ఉంది!

Saturday, January 4, 2025

ప్రకృతిలోని అనంత అణువుల భావ తత్త్వాలను ఎన్ని తెలుసుకున్నా మానవ విజ్ఞానం సూక్ష్మమే

ప్రకృతిలోని అనంత అణువుల భావ తత్త్వాలను ఎన్ని తెలుసుకున్నా [ఎంతగా అర్థాలను గ్రహించినా] మానవ విజ్ఞానం సూక్ష్మమే 

ప్రతి అణువు ఒక చరిత్రగా జీవిస్తుంది 


-- వివరణ ఇంకా ఉంది!

సర్వ కార్యాలకు ప్రకృతియే కారణం

సర్వ కార్యాలకు ప్రకృతియే కారణం 
ప్రకృతిలోని ఆకార వ్యవహార ప్రక్రియల భావ తత్త్వముల నుండే అజ్ఞాన విజ్ఞాన స్వభావాలను గమనిస్తూ ఎదుగుతూ తరతరాలుగా సాగుతున్నాం 


-- వివరణ ఇంకా ఉంది! 

Friday, January 3, 2025

మానవుడికి ఒక్క భాష అర్థవంతంగా తెలిస్తే ఎన్ని భాషలైనా అర్థాన్ని గ్రహించి తెలుసుకోగలడు

మానవుడికి ఒక్క భాష అర్థవంతంగా తెలిస్తే ఎన్ని భాషలైనా అర్థాన్ని గ్రహించి తెలుసుకోగలడు 
ఎన్ని భాషలలోనైనా అర్థవంతఁగా మాట్లాడగలడు వ్రాయగలడు చదవగలడు ఆ భాషతో శ్రమించగలడు 

ఒక భాషతో తెలియని విజ్ఞానం మరో భాషతో తెలుసుకోగలడు గ్రహించగలరు జీవించగలడు ఎదగగలడు 
మరో భాషతో మరొకరితో కలసి శ్రమిస్తూ ప్రయాణిస్తూ విజ్ఞానం చెందుతూ ఎన్నో అనుభవాలతో జీవించగలడు 

మానవుడు ఎన్నో రకాలుగా జీవించగలడు ఎన్నో భాషలతో ఎందరినో పలకరించగలడు స్నేహంతో కలిసిపోగలడు 

మానవుడు మాధవుడే మహాత్ముడే మహర్షుడే మహానీయుడే మహానుభావుడే మహారాజుయో మహాయోగియే మహాగురువే మహాజ్ఞానియే మహాధ్యానియే మహాధ్యాసియే 

భాషతో దేనినైనా సాధించవచ్చు 


-- వివరణ ఇంకా ఉంది! 

మానవుడు అనంత భావముల భవిష్య విజ్ఞాన అర్థభ్రంశ జీవి

మానవుడు అనంత భావముల భవిష్య విజ్ఞాన అర్థభ్రంశ జీవి  

మానవుడు జీవించే విధానములు అనేకం అసంఖ్యాక పరిస్థితుల కార్యాచరణ ప్రభావితం 



-- వివరణ ఇంకా ఉంది!

అనంత జీవరాసులకు మేధస్సులోని భావ తత్త్వములే జీవన విజ్ఞాన ఆలోచన విధానములు

అనంత జీవరాసులకు మేధస్సులోని భావ తత్త్వములే జీవన విజ్ఞాన ఆలోచన విధానములు 
విజ్ఞానము లేకున్నను ఆకలి భావ తత్త్వములు జీవన విధాన ప్రధాన దినచర్య కార్యక్రమములు 

జీవుల భావ తత్త్వములే బంధములై తరతరాలుగా సాగే జీవన విధాన ప్రధాన కార్యక్రమాల ప్రభావములు 

జీవులకు మేధస్సు లేకున్నను ఆకార శరీర గుణ తత్త్వ భావ లక్షణములే జీవన ఉపాధి విధాన కార్యక్రమాల కాల ప్రభావితములు తరతరాల భవిష్య బంధముల రూపములు 


-- వివరణ ఇంకా ఉంది!

మట్టిలోనే అమృత్వం మట్టిలోనే మాతృత్వం అనంతముగా ప్రకృతి ప్రభావంతో లభిస్తున్నాయి

మట్టిలోనే అమృత్వం మట్టిలోనే మాతృత్వం అనంతముగా ప్రకృతి ప్రభావంతో లభిస్తున్నాయి 
మట్టిలోనే విషత్వం మట్టిలోనే అశుద్ధత్వం అనంతముగా ప్రకృతి ప్రభావాలకు దోహదపడుతున్నాయి 

మట్టిలోని గుణములు తేమకు తెలియునట్లు మానవ మేధస్సుకు తెలియుటలేదు 

మట్టిలోని గుణములు లక్షణములు అనంతమైన వివిధ రకాల అణువుల జాతి ప్రభావాలు ప్రకృతి ఆకార పరిణామాలు 

స్వచ్ఛమైన మట్టి గుణములు తరతరాల జీవులకు మానవ మేధస్సుకు విజ్ఞాన ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి బంధములు 



-- వివరణ ఇంకా ఉంది!

Wednesday, January 1, 2025

ఎన్నో యుగాలుగా అవతరించిన నీ అపురూప విశ్వ స్వరూప శిల్పం

ఎన్నో యుగాలుగా సాగుతూ అవతరించిన నీ అపురూప విశ్వ స్వరూప శిల్పం ఇంకా ఎంత కాలమైనను పరిశుద్ధమైన పరిపూర్ణమైన పరిమళమైన సౌందర్య శృంగారంతో స్వయంభువ సంభూతమై నిత్యం శుభోదయమై సూర్య ప్రకాశ ప్రజ్వల తేజస్సుతో మహాలోచన భావ తత్త్వాలతో అనంత ప్రజలకు అఖండ నిలయమై దర్శనమిస్తున్నావుగా మహోన్నత మహోదయ మధుర మనోహర మహనీయ మూర్తి ... నమో! శుభాన్వితః 


వివరణ ఇంకా ఉంది!