విశ్వ విజ్ఞానం నీదే మరచి ఉన్నావు నేటి జన్మతో
విశ్వాన్ని తిలకించుటకు మరల జన్మించావు
విశ్వ విజ్ఞానంతో విశ్వమున ప్రతి రూపాన్ని తిలకించాలని
పరమాత్మ నుండి ఆత్మగా శరీర దేహంతో జన్మించావు
శరీరం పంచ భూతాలతో నిర్మితమైన మహా దేహం
విశ్వ విజ్ఞానం మరలు గుర్తు రావాలనే పంచభూతాల శరీరం
పంచభూత శరీరంలోనే విశ్వ తత్వ ఆత్మ భావాలు దాగి ఉన్నాయి
పరమాత్మను నీవు గ్రహించేందుకు శరీరంలో శ్వాస ప్రవేశించింది
శ్వాస గమనంతో నీవు విశ్వాన్ని దివ్య భావాలతో తిలకించగలవు
విశ్వ విజ్ఞానం నీదైతే విశ్వము నీదే విశ్వమున ప్రతి రూపము నీదే
విశ్వ విజ్ఞానముకై నీ భావాలతో ధ్యానించు విశ్వము నీదవుతుంది
No comments:
Post a Comment