ఓ శూన్యమా ఎక్కడ నుండి నీకు భావన కలిగింది
మర్మాన్ని జయించి శూన్యాన్ని తలచి ఉదయించావు
భావనతో క్షణాన్ని ఆరంభించి కాలాన్ని సృష్టించావు
భావ స్వభావాలతో విశ్వాన్ని సృష్టించి రూపమిచ్చావు
జీవులను కూడా సృష్టించి జీవితాన్ని కల్పించావు
మానవ మేధస్సుతో విజ్ఞానం సాంకేతిక రంగంతో ప్రయాణిస్తున్నది
భావనలతోనే ధ్యానించే మహా విజ్ఞానాన్ని నీ శ్వాసను గమనించుటలో తెలుస్తున్నది
No comments:
Post a Comment