Saturday, September 11, 2010

జీవించుటకు దేహము చాలురా అని

జీవించుటకు దేహము చాలురా అని శ్వాస తెలుపున్నది రా
నాకు తెలిసినా దేహా రూపాలు ఎటువంటివో గమనించాను రా
కర్మ కూడా శ్వాసతో దేహాన్ని వెంటాడి హరించును రా
ఆత్మను కూడా వేధించి శరీరాన్ని త్రుంచేసి జీవింపజేయును రా
కాళ్ళు చేతులు కళ్ళు మేధస్సు చెవులు లేకున్నా శ్వాస జీవించును రా
ముక్కు నోరు దేహము ఈ మూడున్నా మనిషి జీవించును రా
గాలి ఆహారం శ్వాస నాళం జీర్ణ వ్యవస్థ ఇవే ముఖ్యము రా
ఇందులో ఏ ఒక్కటి లేకున్నా ఏ జీవి జీవించదు రా
శిరస్సు దేహము మాత్రమే ఉన్నవారున్నారని నాకు తెలిసేను రా
ఎన్నో లేనివారు కర్మతో జీవిస్తూనే ఉన్నారు
అడుక్కోవడానికి కూడా వీలు లేనంతగా జీవిస్తున్నారు
చలనం ఉన్నా చలించుటకు వీలుకాని వారెందరో జీవిస్తూనే ఉన్నారు
కర్మ కుటుంబాలకు రక్త సంబంధాలు లేవురా
విశ్వాన్ని సూక్ష్మంగా తిలకిస్తే దేహ కర్మతో జీవించే వారెందరో తెలియునురా
భావాలకు కూడా అందని కర్మలకు దేహములు విచిత్ర రూపాలతో జీవిస్తున్నాయి
ఎటువంటి సహాయం చేసినా సుఖం ఎరుగని రీతిలో దేహాలు వంకరగా ఉన్నాయి
విశ్వ భాషకు కర్మ విజ్ఞానం చాలదురా అనుభవించినా అర్థం కాదురా
ప్రతి జీవి జీవితాన్ని నేనే జీవిస్తున్నట్లు విశ్వ భాషతో తెలుపుకుంటున్నానురా
ప్రతి భావన నాదే నని నా మేధస్సున ప్రతీది నిలిచిపోతున్నదిరా
జన సంఖ్య తక్కువైతేనే ఎన్నో సమస్యలు తక్కువైతాయి విజ్ఞాన ఎరుకతో గమనించండి
శరీర ఆకృతులు సరిలేని వారు సంపాదన లేనివారు ఒకరిని కంటే చాలు
పిల్లలు లేని తల్లిదండ్రులే సమాజ సమస్యలకు భగవంతులని నా విశ్వాస విశ్వ భావన

No comments:

Post a Comment