ఓ విజ్ఞాని! ప్రయాణాన్ని విశ్వమున ఏ దిక్కున సాగిస్తావు
ప్రాపాంచిక సమాజమా ఆధ్యాత్మ జీవితమా నిర్ణయించుకో
ఇరువైపులా సమానత్వంతో జీవించగలిగితే గొప్పవాడివి
సమాజమున జీవిస్తూ విశ్వ విజ్ఞానాన్ని అన్వేషించు
మానవుడిగానే నీలో మాధవుని గుణాలను సమాజానికి తెలుపు
నీ గుణాలు ప్రతి ఒక్కరిలో కలిగేలా ఎన్నో జీవితాలను తీర్చిదిద్దు
అందరి జీవితాలతో విశ్వమున సద్గుణ ప్రయాణాన్ని సాగించు
సద్గుణ భావమే మహా దిక్కుగా నీకు కాలమే సూచిస్తుంది
No comments:
Post a Comment