విశ్వమున నీవే బ్రంహా విష్ణు మహేశ్వర
నీవే కర్త కర్మ క్రియ కాల జ్ఞాన నిర్ణేతవు
విశ్వము నీవే విశ్వమందున్నది నీదే
నీలో ఆత్మ జ్ఞానం లేక అజ్ఞాన ధ్యాసలో ఉన్నావు
నీలో ఆత్మ జ్ఞానమునకై విశ్వమే శ్వాసగా నీలోనే
శ్వాసను గమనించుటలో నీలో ఆత్మ జ్ఞానిస్తుంది
ఆత్మ జ్ఞానంతో విశ్వ పరమాత్మను దర్శించు
బ్రంహా విష్ణు మహేశ్వరులంతా కాల విజ్ఞానులే
ప్రతి అణువున నీవే ప్రతి జీవ పరమార్థమున నీవే
ఎంత తెలిపినా విశ్వ అర్థాన్ని గ్రహించుటకు మానవ మేధస్సు చాలదు
నాలోని విశ్వార్థమే నన్ను విశ్వమున ప్రయాణింపజేస్తూ విశ్వ విజ్ఞానాన్ని కలిగిస్తున్నది
No comments:
Post a Comment