Sunday, September 12, 2010

బంధాలు విడిపోయినందుకే

బంధాలు విడిపోయినందుకే సంతోషంగా జీవించకలేక పోతున్నాము
మనవారంతా మనము వెళ్లలేనంత దూరానికి వెళ్ళిపోయారు
వారు ఎప్పుడు వస్తారో జ్ఞాపకాలలోనే చూసుకుంటున్నాము
వారే మనవద్దకు రావాలి మనం వెళ్ళాలన్నా ఒకరు లేదా ఇద్దరు
ఆర్థికంగా ఆ దూరాన్ని చేరుకోవడానికి చాలా ఖర్చవుతుంది
సాంకేతిక జ్ఞానము ద్వారా మాట్లాడవచ్చ్చు చూసుకోవచ్చు
అక్కడ సామాచారాన్ని తెలుసుకోవచ్చు వారి చిత్రాలను చూడవచ్చు
కొంత దూరాన ఉన్నా వెళ్ళడానికి సమయం చాలటం లేదు
పాత వారు కొత్త వారు యిలా ఎన్నో కలిసాయి విడిపోయాయి
కనిపించినా మాట్లాడలేని రోజులు గడిచినా గ్రహించలేక పోతున్నాము
జ్ఞాపకాలలో ఉన్నవారిని కలుసుకోలేక మేధస్సులోనే ఊహా భావాలు
జ్ఞాపకాలలో లేనివారు మన ఎదుట ఉన్నామాట్లాడలేక పోతున్నాము
నేడు తల్లిదండ్రులకు ఇష్టం లేని విధంగా ఎందరో వెళ్ళిపోతున్నారు
ఇరవై ఏళ్ళు దాటితే మన పిల్లలు మనతో ఉండరు ఎక్కడికో వెళ్ళిపోతారు
మానవ విజ్ఞానం ఎక్కడికో ఎన్నో విధాల వెల్లిపోతూనే ఉన్నది

No comments:

Post a Comment