ఆకాశం ఓ విజ్ఞాన తెరగా ఎప్పుడూ విజ్ఞానాన్ని తెలుపుతూనే ఉంటుంది
భావాలను తనదైన రీతిలో ఎన్నో వర్ణాలతో ఎందరికో కనిపించేలా చిత్రిస్తుంది
నీలి ఆకాశపు తెరగా నలుపు ఆకాశపు తెరగా ఎన్నో చూపిస్తూనే ఉంటుంది
ఎవరు చూస్తున్నారో ఎవరు భావాలను గ్రహిస్తున్నారో ఎవరికి అర్థమవుతుందో
ఆకాశపు అంచులలో కూడా సూర్య చంద్ర నక్షత్రాలను మహా గొప్పగా చిత్రీకరిస్తుంది
మేఘాలతో ఎన్ని భావాలను తెలుపుతుందో క్షణాలకు కూడా తెలియకున్నాయి
ఆకాశాన్ని చూస్తూ జీవిస్తే మేధస్సు గమనంతో విశ్వ విజ్ఞానం కలుగుతుంది
ఆకాశం నీకు గురువైతే అంతరిక్షం నీకు విజ్ఞానాన్ని మేధస్సున కలిగిస్తూ ఉంటుంది
No comments:
Post a Comment