నీ విజ్ఞానం ఎలాగో మహాత్ములలో ఎవరికి తెలియదు
కనీసం నీ రూపమైన విశ్వ రూపాలకు తెలుసా
సూర్య చంద్రులకైనా నీ రూపం గుర్తుందా
నీవు ఏనాడైనా లీనమై సూర్య చంద్రులను తిలకించావా
ఏ నక్షత్రాన్నైనా గొప్పగా మహా భావాలతో తిలకించావా
మేఘ వర్ణ భావ రూపాలను ఏ క్షణమైనా గమనించావా
ఏ రూపానికి తెలియని నీ రూపం విశ్వమున ఎందుకో
నీ రూపము విజ్ఞానము విశ్వంలో నిలిచిపోవుటకు ధ్యానించు
అనంత విజ్ఞానాన్ని విశ్వ భావాలతో మేధస్సున సేకరించు
జీవిత పరమార్థాన్ని ఆత్మ జ్ఞానంతో గ్రహిస్తే ఎక్కడైనా నీవే
నీవు ఎవరికి తెలియకపోయినా నీకు ఎవరు తెలియకపోయినా
విశ్వ రూప భావాలలో నీవే ఉదయిస్తూ ఆత్మగా నిలిచి ఉంటావు
No comments:
Post a Comment