Sunday, September 12, 2010

* ఓ సారి ప్రశాంతంగా సముద్ర తీరాన

ఓ సారి ప్రశాంతంగా సముద్ర తీరాన నిలిచి ఓ రోజంతా గమనించండి
ఓ రోజు కాకపొతే కొన్ని వారాలు నెలలు సంవత్సరాలు గమనించు
ఆకాశం తిరుగుతున్నాదా సూర్యుడు తిరుగుతున్నాడా గమనించు
సూర్య చంద్రులతో పాటు నక్షత్రాలు కూడా తిరుగుతూనే ఉన్నాయా
భూమి తిరిగితే సూర్య చంద్ర నక్షత్ర గ్రహాలు ఏ కక్ష్యలలో తిరుగుతాయి
మనకు కనిపించే సూర్య చంద్ర నక్షత్రాలు సగం రోజుకు ఆకాశాన్ని దాటేస్తున్నాయి
నాకు అనిపించే భావాన ఆకాశమే భూమి చుట్టూ తిరుగుతుందేమో
ఆకాశం తిరుగుటలో భూమి తిరగటంతో కక్ష్యలు మారుతున్నాయేమో
ఆకాశం తిరగటంతో సూర్య చంద్ర నక్షత్ర గ్రహాల కక్ష్యలు మారుతున్నాయేమో
ఆకాశం చాలా తేలికైనదని నా గురత్వాకర్షణ లేదా విశ్వ సమతుల్యత భావన
సమతుల్యత శక్తితో భూమి నిలిచే ఉందని ఆకాశ చలనమే తెలుపుతుందా
ఆకాశం తన చుట్టూ తాను తిరుగుటకు ఓ రోజు సమయం పడుతుంది
సూర్యుడు తిరుగుట లేదని ఓ నిర్దిష్ట స్థాయిలో ఆకాశాన నిలిచి ఉన్నాడేమో
ప్రతి రోజు ఒకే స్థానమున ఉదయించుటలో ఆకాశంతో తిరుగుతున్నాడేమో
చంద్రుడు రోజుకు ఓ కక్షలో నెలకు కొన్ని కక్ష్యలలో అలా ప్రతి నెలా వివిధ రూపాలతో కనిపిస్తూ -
ప్రతి నెల అవే కక్ష్యలలో తిరుగుతూ ఉన్నాడేమో (నెలకు అటు ఇటూ కొన్ని సార్లు మార్పు) -
విశ్వమున నీవు ఆకాశాన్ని గమనిస్తూ విశ్వ భావనతో లీనమై తెలుసుకో
విశ్వ భావ సారాంశ శాస్త్రీయ విజ్ఞానాన్ని క్షుణ్ణంగా అవగాహనతో పరిశీలించు
విశ్వ విజ్ఞాన శాస్త్రీయ విజ్ఞానము అనుభవానికి మహా మేధస్సుతో కూడినది

No comments:

Post a Comment