Wednesday, September 29, 2010

కర్మ కోసమే జన్మ జన్మలుగా

కర్మ కోసమే జన్మ జన్మలుగా జన్మించి శ్రమించడం అజ్ఞానమేగా
ఒక్క జన్మలోనైనా ఆత్మ జ్ఞానంతో జీవించడం మానవుని లక్షణం
ఆత్మ జ్ఞానం పొందలేక కర్మతో జన్మ జన్మలుగా జీవిస్తున్నాము
నిత్యమూ శ్రమిస్తూ జీవించుటలో విజ్ఞానం లేకపోతే జన్మ వ్యర్థం
జన్మ జన్మలు వ్యర్థమైతే లోకంలో అందరూ అజ్ఞానంగానే జీవిస్తారు
కొన్ని వేల కోట్ల జన్మల జీవితాలలో ఆత్మ జ్ఞానం లేకపోతే ఎలా
ఎంతవరకు అజ్ఞానంతోనే జీవిస్తుంటే సత్యమే తెలియకుండాపోతుంది
సత్యాన్ని గ్రహించుటకైనా ఆత్మ కర్మను విజ్ఞానంతో నశింపజేయాలి
పూర్తిగా తెలుపాలంటే మీ మేధస్సుకు అర్థంగా ఓ గ్రంధమవుతుంది


1 comment:

  1. అలాగని కర్మను త్యజించడమూ అఙ్ఞానమే.. :)

    మీ బ్లాగు బాగుంది మిత్రమా. నాకూ ఎప్పటి నుండో ఆధ్యాత్మిక విషయాలను కవితలుగా రాయాలని కోరిక. కానీ నాకు రావడం లేదు. నా శైలే నాకు అలవాటైపోతోంది. అదే మంచిది లెండి. :)

    ReplyDelete